Karimnagar: పాత ఫోన్‌లు అమ్ముతున్నారా? కొత్తగా జరుగుతున్న సైబర్ మోసం గురించి తెలుసా?
Telangana Crime News: సామాన్య ప్రజలను మోసం చేసేందుకు విచిత్ర వేషధారణలో సైబర్ నేరగాళ్లు ఊళ్లలోకి వస్తున్నారు. ఏమరుపాటుగా ఉంటే భారీగా మోసపోవడం ఖాయమంటున్నారు పోలీసులు
Karimnagar News: సామాన్య ప్రజలను మోసం చేసేందుకైతే వినూత్న తరహాలో వారి ప్రయత్నాలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వారి చేతికి చిక్కార అంతే సంగతి. సైబర్ నేరాలు చేసేందుకైతే గతంలో కస్టమర్ కేర్ తో, లేదా బ్యాంకింగ్ సర్వీస్ పేర్లతో, సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడేవారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ సైబర్ నేరాలు కూడా మరింత పెరిగిపోయింది. అయితే ప్రస్తుతం మాత్రం కొత్త తరహా వేషధారణలో ప్రజలను మోసం చేసేందుకు మనలో తిరుగుతున్నారు సైబర్ నేరాలు.
ఉగ్రవాద చర్యలకు వేషధారణలు....
అయితే ఇలాంటి పథకాలన్నీ గతంలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నవారు విచిత్ర వేషధారణలో ఉంటూ ఆయా ప్రదేశాల్లో ఉగ్రవాద చర్యలు చేపట్టేవారు. కొద్ది సంవత్సరాల క్రితం జగిత్యాల జిల్లాలో ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ వ్యక్తి పెన్ రిఫిల్ రీఫిలింగ్ చేస్తున్న వాడిగా ఉంటూ ఉగ్రవాద చర్యలు చేపట్టేవాడు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు రీఫిల్ రీఫిలింగ్ చేస్తూ జీవనం కొనసాగించడంపై అనుమానం వచ్చింది. వారి కోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు ఒక షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది. అతను ఓ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న వ్యక్తిగా పోలీసులకు నిర్ధారణ అయింది.
అలాగే కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బ్యాంకు దోపిడీ జిల్లాలో కలకలం రేగింది. ఆ కేసుకు సంబంధించిన నేరస్థుడు మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనియాంశంగా మారింది. ఈ కేసులు లోతుగా విచారిస్పోతే లీసులకు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీళ్లు ఇచ్చిన ససమాచారం ఆధారంగా హైదరాబాదులో కొందరి ఇళ్లల్లో సోదాలు చేస్తే పోలీసులకు కొన్ని కరెన్సీ నోట్లు లభించడంతో అవి ఎక్కడివి అన్న విచారణ చేపట్టగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం బ్యాంకు దోపిడీలో పోయినవి గా గుర్తించారు. అయితే ఆ దొంగతనం పాల్పడ్డ వ్యక్తి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న వ్యక్తిగా ఇంటలిజెన్స్ వర్గాలు వెలుగులోకి తీసుకువచ్చాయి.
కొత్త తరహాలో సైబర్ నేరాలు...
"పాత సెల్ ఫోన్లు కొంటాం పాత సెల్ ఫోన్లు కొంటాం" అంటూ పాత సామాన్లు కొనే వేషధారణలో పాత సెల్ ఫోన్లు కొనే వారి ముసుగులో తిరుగుతున్నారు. అయితే పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలో గత కొద్దిరోజులుగా సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్లు కొంటాము అంటూ ఓముఠా ఊరూరా వాడవాడనా తిరుగుతున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని తమ తరహాలో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది, వారి వద్ద సుమారు 4000 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: తలకిందులుగా నిలబడి నిరసన - ధరణి సమస్యపై రంగారెడ్డి జిల్లాలో ఓ రైతు పోరాటం వైరల్
ఊరూరా తిరుగుతూ సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్లు కొంటామని చెప్పి తీసుకున్న ఫోన్లతో డేటా సేకరించి డబ్బులు కాజేసే పథకం పన్నినట్టు సైబర్ నేరగాళ్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. అయితే పోలీసులు ఈ ముఠా సభ్యులను పట్టుకోవడంతో కోట్ల రూపాయల సొమ్మును కాపాడారని చెప్పుకోవచ్చు. కానీ మరి గతంలో జరిగినట్టుగా ఈ ముఠా సభ్యులు సైబర్ నేరస్తులైన లేక ఉగ్రవాద సంస్థలతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
అయితే ఏది ఏమైనాప్పటికీ ప్రజలంతా సమాజంలో ఇలాంటి వారి బారిన పడి మోసపోకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా తమ ప్రదేశాలలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు.
Also Read: హైదరాబాద్ యూట్యూబర్ అరెస్ట్, రీల్స్ చేసేవారికి పోలీసుల వార్నింగ్!