అన్వేషించండి

Telangana News : తలకిందులుగా నిలబడి నిరసన - ధరణి సమస్యపై రంగారెడ్డి జిల్లాలో ఓ రైతు పోరాటం వైరల్

Farmer Protest : రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మండల తహసీల్దార్ ఆఫీసులో ఓ రైతు తలకిందులుగా నిలబడి తెలిపిన నిరసన వైరల్ అయింది. తన భూమి విషయంలో రైతులు సమస్య పరిష్కరించడం లేదని ఆయనంటున్నారు.

RangaReddy farmer stands upside down For Protest :  తెలంగాణలో ధరణి  పేరుతో తీసుకు వచ్చిన భూసంస్కరణ కారణంగా ఎంతో మంది రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. వారి సమస్యను పరిష్కరించడానికి అధికారులు నానా తిప్పలు పెడుతున్నారు.  ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల్లో ఇలాంటి ధరణి సమస్యలే అరవై శాతం వరకూ ఉంటున్నాయి. అందుకే తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని తీసేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇంకా ధరణిని రద్దు చేయలేదు. తమ భూమి విషయంలో ఏర్పడిన సమస్యల కోసం రైతులు ఇంకా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 

తమ భూమిని నిషేధ జాబితాలో చేర్చారని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతు జీవన్                  

తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహంపట్నం తహశీల్ దార్ కార్యాలయంలో ఓ రైతు తలకిందులుగా నిలబడి నిరసన చేపట్టారు. అప్పటికే ఎన్నో సార్లు కార్యాలయానికి వచ్చినా పట్టించుకోలేదని ఆ రైతు అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే అధికారుల మీద ఆవేశ పడితే తనకే నష్టం కాబట్టి.. వినూత్నంగా ధర్నా చేయాలనుకున్నాడు. వెంటనే తలకిందులుగా నిలబడ్డాయి. అలా దాదాపుగా గంట సేపు తన నిరసన వ్యక్తం చేశాడు. యోగాలో ఇలా నిలబడటాన్ని శీర్షాసనం అంటారు. రైతు నిరసన సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

సీలింగ్  భూమి కాదని అన్ని ఆధారాలు సమర్పించినా ధరణిలో సీలింగ్ భూమిగా నమోదు             

నిరసన తెలిపిన రైతు పేరు ఉన్నితాల జీవన్. ఆయన విద్యాధికుడు కూడా. హైదరాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చదువుకున్నారు. జీవన్  తల్లి ఉన్నితాల జయసుధ పదిహేనేళ్ల కిందట మెట్టు సైదారెడ్డి అనే వ్యక్తి దగ్గర మంగలపల్లి గ్రామంలో ఎకరం32 సెంట్లను కొనుగోలు చేశారు. అయితే ధరణి వచ్చిన తర్వాత ఈ భూమిని నిషేధ జాబితాలో చేర్చారు. అయితే ఇది సీలింగ్ ల్యాండ్ కానే కాదని.. ప్రైవేటు ల్యాండేనని రికార్డులతో తన భూమిని నిషేధ జాబితా నుంచి తప్పించాలని ఆయన అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంత కాలం తిరిగినా వారి వద్ద నుంచి సమాధానం రావడం లేదు. గత ఎనిమిది నెలలుగా ఇబ్రహీనంపట్నం మండల కార్యాలయానికి.. కలెక్టర్ కార్యాలయానికి తిరుగుతూనే ఉన్నామని జీవన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఎనిమిది నెలలుగా తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో వినూత్నంగా  నిరసన                                    

అది అసలు సీలింగ్ ల్యాండ్ కాదని.. గత ఐదు దశాబ్దాల భూ రికార్డులను సమర్పించినా అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం నెల రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారని కానీ ధరణి సమస్యలను పది రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశిచిందన్నారు. ఎవరూ పని చేయడం లేదని.. తప్పక నిరసన వ్యక్తం చేశామని.. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Revanth Reddy Governance Criticisms: రాజకీయాల్లో దూకుడు - పథకాల అమల్లో ఆలస్యం - రేవంత్ పాలనలో వెనుకబడుతున్నారా?
రాజకీయాల్లో దూకుడు - పథకాల అమల్లో ఆలస్యం - రేవంత్ పాలనలో వెనుకబడుతున్నారా?
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Ponnam Prabhakar On SIR: ఓటు కోల్పోయిన వారిని తీసుకొస్తా, డేట్ ఫిక్స్ చెయ్- రాంచందర్‌రావుకు మంత్రి పొన్నం ఛాలెంజ్
ఓటు కోల్పోయిన వారిని తీసుకొస్తా, డేట్ ఫిక్స్ చెయ్- రాంచందర్‌రావుకు మంత్రి పొన్నం ఛాలెంజ్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget