(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad Youtuber: హైదరాబాద్ యూట్యూబర్ అరెస్ట్, రీల్స్ చేసేవారికి పోలీసుల వార్నింగ్!
Hyderabad News: రద్దీగా ఉన్న ప్రదేశంలో యువకుడు బైక్ మీద నుంచి ఆకాశంలోకి డబ్బులు విసిరేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు.
Hyderabad Youtuber Arrest: హైదరాబాద్ లోని కూకట్ పల్లి కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ వద్ద రోడ్లపై డబ్బులు విసిరేస్తూ రీల్స్ చేస్తున్న యువకుడిని కూకట్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. కేపీహెచ్‌బీ కాలనీలోని రోడ్డు నెంబర్ 1 దగ్గర రద్దీగా ఉండే ప్రదేశంలో బైక్ మీద నుంచి ఆకాశంలోకి డబ్బులు విసిరేస్తూ వీడియోలు తీస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో యువకుడు పోస్ట్ చేశాడు. దీంతో డబ్బుల కోసం రోడ్ల మీద జనాలు ఎగబడడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్న వంశీ కృష్ణ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటికే వంశీ కృష్ణ పైన పలు ఉన్నట్లు సమాచారం. వంశీకృష్ణ తండ్రి పేరు యాకయ్య.. స్వస్థలం పెద్ద ముత్తారం. ప్రస్తుతం బోరబండలోని పర్వత నగర్ లో నివాసం ఉంటున్నాడు. రోడ్లపై రీల్స్ చేసినందుకు గాను కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ, సనత్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు. సాయం చేస్తున్నానంటూ వీడియోలు చేస్తూ డబ్బులు గాల్లోకి విసరడం పట్ల పలువురు నెటిజన్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.