Bandi Sanjay: పుట్టినరోజు కానుకగా 20వేల సైకిళ్లు - కరీంనగర్ లోక్ సభ టెన్త్ విద్యార్థులకు బండి సంజయ్ కానుక
20,000 bicycles: కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ పదో తరగతి పిల్లలకు 20వేల సైకిళ్లను బండి సంజయ్ సంపిణీ చేయనున్నారు. బుధవారం నుంచే ఈ కార్యక్రమం జరగనుంది.

Bandi Sanjay will donate 20,000 bicycle: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ వేదికగా మరో మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్ధిని, విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను అందించనున్నారు. మొత్తం 20 వేల సైకిళ్లను పంపిణీ చేయాలని బండి సంజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు బ్రాండెడ్ సైకిల్ కంపెనీకి ఆర్డర్ కూడా ఇచ్చారు. సీ కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్ బిలిటీ ఫండ్స్ ను చెల్లించి ఈ మొత్తం సైకిళ్లను కొనుగోలు చేశారు.
ఒక ప్రజా ప్రతినిధి తన నియోజకవర్గ పరిధిలో 20 వేల సైకిళ్లను పంపిణీ చేయడం ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదని బండి సంజయ్ నుచరులు చెబుతున్నారు. ఈ సైకిళ్ల పంపిణీ ప్రారంభ కార్యక్రమానికి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదిక కాబోతోంది. ఇందుకోసం స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత కరీంనగర్ టౌన్ లో టెన్త్ చదువుతున్న విద్యార్ధిని, విద్యార్థులకు బండి సంజయ్ ఉదయం 11 గంటలకు తన చేతుల మీదుగా సైకిళ్లను అందజేయబోతున్నారు. మొత్తం 21 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.
ప్రతి విద్యార్ధికి ఈ సైకిల్ ను అందించాలనే ఉద్దేశంతో సైకిళ్ల పంపిణీ బాధ్యతను జిల్లా కలెక్టర్ కు అప్పగించారు. కలెక్టర్ ద్వారా డీఈఓ, ఎంఈవో స్కూళ్ల వారీగా ఎంత మంది విద్యార్థులున్నారనే జాబతాను సిద్ధం చేసిన అధికారులు ఆ మేరకు సైకిళ్లను ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా సైకిళ్లను పంపీణీ చేయనున్నారు. నెల రోజుల్లో ఈ సైకిళ్ల పంపిణీ పూర్తి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదువుకునే ప్రతి విద్యార్ధినీ, విద్యార్ధికి ఈ సైకిల్ ను అందజేయాలని కలెక్టర్ ను కోరారు. వేల రూపాయలు వెచ్చించి సైకిళ్లు కొనే స్తోమత ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు లేదని గ్రహించిన బండి సంజయ్ సీఎస్సార్ ఫండ్స్ ను సేకరించి 20 వేల సైకిళ్లను కొనుగోలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కానుక పేరుతో ఇస్తున్నారు.
*_గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కానుకగా 20,000 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్న బండి సంజయ్ కుమార్_* pic.twitter.com/jmOl1aqfiC
— Vamshiakula🚩 (@akulavamshi2464) July 5, 2025
బండి సంజయ్ కొన్నేళ్లుగా తన పుట్టిన రోజును సైతం పేద వర్గాలకు మరింత సేవ చేసేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా పేదలకు వైద్య, విద్యం అందని ద్రాక్షలా మారడంతో ఆయా రంగాల ద్వారా పేదలను ఆదుకునే విధంగా వైవిధ్యమైన సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏరియా ఆసుపత్రులకు రూ.5 కోట్ల విలువైన ఆధునాతన మెడికల్ ఎక్విప్ మెంట్స్ అందజేశారు. అంతకుముందు ‘సంజయ్ సురక్షా’ పేరుతో అంబులెన్స్ లను అందించారు. ఇవిగాకుండా మెడిసిన్స్, ఫ్రీజర్స్ సహా ఆసుపత్రులకు అవసరమైన మెడికల్ ఎక్విప్ మెంట్ ను సైతం అందించారు.





















