అన్వేషించండి

KTR vs Revanth Reddy:ఎవరొస్తారో రండి తేల్చుకుందాం! భారీ కాన్వాయ్‌తో ప్రెస్ క్లబ్ వద్దకు కేటీఆర్, మరి కాంగ్రెస్ ?

Telangana News | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలపై చర్చించేందుకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

హైదరాబాద్: రైతుల సమస్యలపై బహిరంగ చర్చకు రావాలని  భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్ నేపథ్యంలో బహిరంగ చర్చకు బయలుదేరేందుకు కేటీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. అటు నుంచి బీఆర్ఎస్ నేతలతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వెళ్లనున్నారు. బహిరంగ చర్చ కోసం కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొందరు 11గంటలకు ప్రెస్ క్లబ్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి పరస్పరం ఛాలెంజ్ ల దృష్ట్యా సోమాజీగూడ ప్లెస్ క్లబ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అసెంబ్లీలో చర్చకు రావాలన్న రేవంత్ రెడ్డి
రైతులకు తమ ప్రభుత్వం ఎంతో చేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అంటున్నారు. రైతు భరోసా నగదు రైతుల ఖాతాల్లో వేసి వారికి పంట సాయం చేశామన్నారు. ఏడాది కాలంలోనే రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదే నని రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ కాదు కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు రావాలని.. ఏ విషయం అయినా చర్చకు సిద్ధమేనని మంత్రులు స్పష్టం చేశారు. అసెంబ్లీకి వస్తే ప్రత్యేక చర్చకు తాము సిద్ధమేనని, ఏ అంశంపై అయినా బదులిస్తామని కాంగ్రెస్ అంటోంది.


KTR vs Revanth Reddy:ఎవరొస్తారో రండి తేల్చుకుందాం! భారీ కాన్వాయ్‌తో ప్రెస్ క్లబ్ వద్దకు కేటీఆర్, మరి కాంగ్రెస్ ?

రేవంత్ రెడ్డి పారిపోయిండా..

సీఎం రేవంత్ రెడ్డి చర్చకు వచ్చే అవకాశం లేదని మీడియా చెప్పగా.. అంతే అంటారా పారిపోయిండా ఏంటి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికీ నాలుగైదుసార్లు బహిరంగంగా చర్చకు సిద్ధం అన్నారు. మైక్ కట్ చేయకుండా అసెంబ్లీలో మా వాయిస్ వినిపిస్తామని చెబితే చర్చ పెట్టరు. ఒకవేళ చర్చ మొదలుపెడితే నాలుగు సెకన్లు కూడా మైక్ ఇవ్వరు. కేసీఆర్ వస్తరా, కేటీఆర్ వస్తారా.. రైతు సంక్షేమంపై చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. రేవంత్ సవాల్ ను అదేరోజు స్వీకరించాను. నీ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు. నేను చాలు అని చెప్పారు. అసెంబ్లీలో అయినా, ప్రెస్ క్లబ్, సెక్రటేరియట్, జూబ్లీహిల్స్ లో ఇంటికి రమ్మంటే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని చెప్పాం. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పి మాట తప్పిన నేత రేవంత్ రెడ్డి. సొంత నియోజకవర్గంలో ఓటమి తరువాత వెంటనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి మాట తప్పిన వ్యక్తి. అందుకే మేం ప్రెస్ క్లబ్ లో హాల్ బుక్ చేసి పెట్టాం చర్చకు రమ్మని చెప్పాం. 

రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఛాలెంజ్ చేశారు కనుక చర్చకు వస్తారని భావించాం. రేవంత్ లేని పక్షంలో వ్యవసాయశాఖ పై మాట్లాడేందుకు బాధ్యత తీసుకుని ఏ మంత్రి వస్తారో రండి. రైతులకు బీఆర్ఎస్ ఏం చేసిందో, కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై లెక్కలతో సహా వివరిస్తాం. అసెంబ్లీలో చర్చకు ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే.. బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తారు. అందుకే ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలని ఛాలెంజ్ చేశాం’ అని కేటీఆర్ అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget