అన్వేషించండి

Bandi Sanjay On BRS : బీఆర్ఎస్ అంటే బందిపోట్ల సమితి, ఆవిర్భావ సభ కాదు సంతాప సభ- బండి సంజయ్

Bandi Sanjay On BRS : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలా లేదని, సంతాప సభలా ఉందని బండి సంజయ్ విమర్శించారు. ఒక్కరి మొహంలో కూడా నవ్వులేదన్నారు.

Bandi Sanjay On BRS : టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ పేరు ప్రకటించి పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటుచేశారు. బీఆర్ఎస్ ప్రకటనపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ విమర్శలు చేశారు. మెట్పల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన..  సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రకటించి, మీటింగ్ పెడితే ఒక్కరి మొహంలో కూడా నవ్వు లేదన్నారు. అది ఆవిర్భావ సభలా లేదని, సంతాప సభలా ఉందని విమర్శలు చేశారు. పార్టీ పేరు నుంచి, జెండా నుంచి తెలంగాణను తీసేశారన్నారు. బెంగళూరులో డిపాజిట్ రాని వాళ్లను తెచ్చుకుని బీఆర్ఎస్ మద్దతు అంటున్నారన్నారు. పార్టీ ప్రారంభించినప్పుడు ఏం చేస్తారో చెప్పాలన్నారు. సమైక్యవాది అయిన ఉండవల్లిని తీసుకొచ్చి దావత్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అని బండి సంజయ్ ఆరోపించారు. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ అంటూ కొత్త రాగం అందుకున్నారన్నారు.  కేసీఆర్ కు తెలంగాణ మీద మాట్లాడే అర్హత కోల్పోయారన్నారు. దిక్కు, దివానా లెనోళ్ళను, తుక్డే గ్యాంగ్ ను పట్టుకొచ్చి బీఆర్ఎస్ అంటున్నారని విమర్శించారు. 

గుజరాత్ విక్టరీ నుంచి దృష్టి మళ్లించేందుకే 

"BRS కాదు... బందిపోట్ల రాష్ట్ర సమితి. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిండు. పంజాబ్ లో రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లని పరిస్థితి. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు?. కేసీఆర్ కుటుంబం దోచుకుతిన్నది. కేసీఆర్ బిడ్డ కవిత ఢిల్లీలో లిక్కర్ దందా చేసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ లిక్కర్ దందా చేస్తుందేమో చూడాలి. బిడ్డ లిక్కర్ దందా పక్కకు పోయేందుకే... BRS పార్టీ అంటూ నాటకాలు. జాతీయ పార్టీ పెడితే విధివిధానాలు ఉండాలి. కేవలం తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. గుజరాత్ లో బీజేపీ గ్రాండ్ విక్టరీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ ప్రకటన చేశారు. 'బీఆర్ఎస్' ఎప్పటికీ 'బంది పోట్ల రాష్ట్ర సమితి' నే. " -బండి సంజయ్ 

బూటకపు వాగ్దానాలు 

కృష్ణా జలాల్లో  కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణకు 575 టీఎంసీలు రావాల్సి ఉంటే...299 టీఎంసీలకే సంతకం చేసి, తెలంగాణ నోట్లో మన్ను కొట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు దండుకున్నారని ఆరోపించారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య పరస్పర కమీషన్ల అండర్స్టాండింగ్ ఉందన్నారు. రెండు రాష్ట్రాల నాయకులు కుట్రలతో సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇక్కడే ఏమి చేయలేని కేసీఆర్... దేశ రాజకీయాల్లో ఏం చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ వి అన్నీ బూటకపు వాగ్దానాలే అని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారో చెప్పాలన్నారు. కాషాయ జెండా కాంతిలో రంగురంగుల జెండాలు మాడి మసైపోతాయన్నారు. కాషాయ జెండా పవర్ అలాంటిదన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Bhuma Akhila Priya: అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
Shubman Gill Reclaims No1 ODI Rank: వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 
వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. Rankingsలో భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 
Srinivasa Mangapuram Twitter Review - శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
Embed widget