Kamareddy News : కామారెడ్డి జిల్లాలో వింత ఘటన, ఆవు కడుపున పంది జననం!
Kamareddy News : కామారెడ్డి జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఆవు కడుపున పంది ఆకారంలో వింత జీవి పుట్టింది. ఈ జీవిని చూసేందుకు జనం క్యూ కట్టారు.
Kamareddy News : నంది కడుపున పంది పుడుతుందనే నానుడి ఎంతో కాలంగా విన్నాం. కాని అది నిజమైందని అంటున్నారు కామారెడ్డి జిల్లా వాసులు. నిజంగా పంది ఆకారంలో ఉన్న వింత జంతువు ఆవు కడుపున పుట్టింది. కామారెడ్డి జిల్లా కనకల్ గ్రామంలో సాయిలు అనే వ్యక్తికి చెందిన ఆవుకు గురువారం పంది రూపంలో ఉన్న ఓ వింత జంతువు పుట్టింది. దానిని చూసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే వింత ఆకారంలో పుట్టిన ఆ జంతువు కొద్దిసేపటికే చనిపోయింది. ఈ వింత జంతువు ఆవు కడుపున పుట్టడంతో యజమాని సాయిలు షాక్ అయ్యారు. చుట్టూ పక్కల వారికి సమాచారం ఇచ్చారు. ఇది ఆనోట ఈ నోటా తెలియడంతో గ్రామంలోని వారంతా ఈ వింత జంతువును చూసేందుకు తరలి వచ్చారు. జన్యుపరమైన లోపంతో ఇలా పుట్టి ఉండొచ్చని పశువైద్యులు తెలిపారు. అయితే ఈ వింత ఆకారంలో ఉన్న జంతువు ఎక్కువసేపు ప్రాణాలతో ఉండలేదు. కొంత సమయం తర్వాత చనిపోయింది. సాయిలు ఆ వింత జీవికి అంత్యక్రియలు నిర్వహించారు.