అన్వేషించండి

Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!

Group 1 Recruitment Controversy : తెలంగాణ స్థానికతపై 600 ఏళ్లుగా దాడి జరుగుతోందని కవిత అన్నారు. గ్రూప్-1 నియామకాల్లో తీవ్ర అన్యాయం చేశారని 200 ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల వాళ్లకే ఇచ్చారన్నారు.

Million March Uppal Bhagayat July 2:  సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన  తెలంగాణ స్థానికత - సవాళ్లు ' రౌండ్ టేబుల్ సమావేశంలో కల్వకుంట్ల కవిత  సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ నేలపై స్థానికత, ముల్కీ హక్కుల కోసం గత 600 ఏళ్లుగా నిరంతర దాడి, పోరాటం జరుగుతూనే ఉన్నాయని చరిత్రను గుర్తుచేశారు. బహుమనీ సామ్రాజ్యం కాలం నాటి పోరాటాల నుండి, 1919 ముల్కీ నిబంధనలు, 1952  ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’  ఉద్యమం, 1969 ప్రత్యేక రాష్ట్ర పోరాటం వరకు ప్రతి దశలోనూ తెలంగాణ యాస, భాష, ఉద్యోగ వనరులపై పరాయి పాలకులు అన్యాయం చేస్తూనే వచ్చారని మండిపడ్డారు. ఎంతోమంది త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో కూడా నేడు స్థానికుల హక్కులు కాలరాస్తున్నారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
 
 న్యాయమూర్తులు అర్థం చేసుకోవాలి! 

రాష్ట్రపతి ఉత్తర్వులలో  ఉన్న నిబంధనలను తప్పుగా అన్వయిస్తూ స్థానికులకు కోలుకోలేని నష్టం చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఉత్తర్వులలోని మూడు వేర్వేరు అంశాలను కలిపి చూస్తామనడం సరికాదని, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నంబర్ 7 ప్రకారం స్థానికులకు రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గౌరవ న్యాయమూర్తులు ఇక్కడి నిరుద్యోగుల దుఃఖాన్ని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలని కోరారు. పక్క రాష్ట్రాల్లో మన వాళ్లు నాలుగేళ్లు చదివితే అక్కడ లోకల్‌గా గుర్తిస్తారా అని ప్రశ్నించిన ఆమె.. మన వనరులను ఇతర ప్రాంతాల వారు దోచుకునేలా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే తెలంగాణలో మళ్లీ పాత ముల్కీ నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
 
 గ్రూప్-1లో 200 మంది ఇతర రాష్ట్రాల వారే.. 

ఇటీవల ముగిసిన గ్రూప్-1 నియామకాల్లో తెలంగాణ అభ్యర్థులకు జరిగిందో పెద్ద కుట్రని కవిత ఘాటుగా ఆరోపించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేవలం ఇద్దరికే అవకాశం ఇవ్వాల్సిన చోట, నిబంధనలను తుంగలో తొక్కి 11 మంది ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు.  బయటి రాష్ట్రాల అభ్యర్థులకు ఇక్కడి ఈడబ్ల్యూఎస్  , బీసీ-డీ   సర్టిఫికెట్లు అక్రమంగా కేటాయించి పోస్టులు కట్టబెట్టారని, మొత్తం 563 గ్రూప్-1 ఉద్యోగాలలో దాదాపు 200 మంది ఇతర రాష్ట్రాల వాళ్లే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు దీనిపై న్యాయపోరాటం చేయకుండా ప్రభుత్వం పెద్ద పెద్ద లాయర్లకు ప్రజాధనం ఇచ్చి కేసులను బెంచ్ మీదికి రాకుండా అడ్డుకుంటోందని విమర్శించారు. 

జూలై 2న ‘మిలియన్ మార్చ్’కు పిలుపు! 

రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రైవేట్ రంగంలోనూ ఒక్క ఉద్యోగం రావడం లేదని కవిత ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్బీఐ  బ్యాంకుకు ఇచ్చిన భూమిని తిరిగి అమ్ముకోవడంతో ప్రభుత్వంపై సదరు బ్యాంకే కేసు వేసే దుస్థితి వచ్చిందని, ఇలాంటి వాతావరణంలో రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఒకవైపు నీళ్ల విషయంలో కర్ణాటక రాష్ట్రం తెలంగాణకు అన్యాయం చేస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి మంగళహారతులు పడుతూ మన నీటి వాటాను, హక్కులను కోల్పోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అన్యాయాలపై పోరాడటానికి జూలై 2న ఉప్పల్ భగాయత్ వేదికగా మరో 'మిలియన్ మార్చ్' జరగబోతోందని, హక్కుల సాధన కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.   

 
 సుప్రీంకోర్టుకు వెళ్లకపోతే మేమే వెళ్తాం..  

స్థానికత అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.  ప్రభుత్వానికి 15 రోజుల సమయం ఇస్తున్నాం.. గట్టి లాయర్లను పెట్టి ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయకపోతే, నిరుద్యోగుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీయే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది  అని స్పష్టం చేశారు. ఈ తీర్పును ఇప్పుడే అడ్డుకోకపోతే పరాయి రాష్ట్రాల దోపిడీకి ఫ్లడ్‌గేట్లు ఎత్తినట్లే అవుతుందన్నారు. రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి సర్కార్ గ్రూప్-1లో చేపట్టిన నియామకాలపై  జ్యూడిషియల్ రివ్యూ కమిటీ వేసి, జరిగిన అన్యాయాలను పూర్తిగా సరిదిద్ది తీరుతామన్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget