అన్వేషించండి

Jr NTR Land Registration: ఎమ్మార్వో ఆఫీసులో ఎన్టీఆర్ ప్రత్యక్షం.. సెల్ఫీలు, ఫొటోలతో ఉద్యోగులు సందడి

ఎన్టీఆర్ రాకతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయంలోని ఉద్యోగులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు.

ఉన్నట్టుండి ఓ పెద్ద సినిమా సెలబ్రిటీ మీ ప్రాంతంలోకి వస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి అనుభూతే రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలోని ఎమ్మార్వో కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగులకు కలిగింది. ఎందుకంటే అక్కడికి ఓ పెద్ద సినీ సెలబ్రిటీ వచ్చారు. ఆయన ఎవరో కాదు.. టాలీవుడ్ యంగ్ టైగర్, నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన వచ్చీ రావడంతోనే కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగులంతా అవాక్కయ్యారు. తమ అభిమాన నటుడు తమ కళ్ల ముందు ప్రత్యక్షంగా కనబడేసరికి వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇంకేముంది.. తమ సెల్‌ఫోన్లకు పని చెప్పారు. తారక్‌తో కలిసి సెల్ఫీలు, ఫొటోలు, గ్రూప్ ఫొటోలు దిగారు. అసలింతకీ జూనియర్ ఎన్టీఆర్ ఎమ్మార్వో కార్యాలయానికి ఎందుకు వచ్చారని అనుకుంటున్నారా..

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్‌ పనులతో బిజీగా ఉన్నారు. తీరిక చేసుకుని ఎమ్మార్వో కార్యాలయానికి ఎందుకు వస్తారని అనుకుంటున్నారా..? ఎన్టీఆర్ ఇటీవలే శంకర్‌పల్లి ఎమ్మార్వో కార్యాలయం పరిధిలో ఆరున్నర ఎకరాల పొలం కొన్నారు. ఆ రిజిస్ట్రేషన్ పనుల కోసం ఎన్టీఆర్ శుక్రవారం శంకర్‌పల్లిలోని ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చారు. అక్కడ భూ కొనుగోలుకు సంబంధించి సంతకాలు, ఫొటోలు దిగడం పూర్తయ్యాక తిరిగి వెళ్లిపోయారు.

Also Read: DGP Profile Picture Fraud: ఏకంగా డీజీపీ పేరుతో మోసాలు.. ఆయన ఫొటో కూడా వాడేస్తున్న సైబర్ నేరగాళ్లు

ఎన్టీఆర్ రాకతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయంలోని ఉద్యోగులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. రిజిస్ట్రేషన్‌ పనులు పూర్తైన వెంటనే కొంతమందితో ఫొటోలు దిగిన ఆయన మళ్లీ హైదరాబాద్‌కు వచ్చేశారు. సెల్ఫీలు దిగేందుకు తహసీల్దార్ సహా ఉద్యోగులు, అధికారులు పోటీ పడ్డారు. రిజిస్ట్రేషన్ అధికారి తహసీల్దార్ కృష్ణకుమార్, ఇతర అధికారులు, సిబ్బంది ఎన్టీఆర్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రాజెక్టు ప్రమోషన్ పనులతో బిజీగా ఉన్నారు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ పాన్ ఇండియా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక వెంటనే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడని టాక్. ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయనున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా.. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’లో హోస్ట్‌గా కూడా ఎన్టీఆర్ సందడి చేయనున్నారు.

Also Read: KCR Black : కేసీఆర్‌కు ఆ రంగు నచ్చదు.. ఆ కలర్‌లో ఉన్న కాన్వాయ్‌ని ఏం చేశారంటే..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget