Congress Jionings : కాంగ్రెస్‌లో జోరుగా చేరికలు - తాజాగా ఎవరెవరు చేరారంటే ?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. పలువురు ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ మారుతున్నారు.
Congress Jionings : బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బోథ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాపురావును బీఆర్ఎస్ అధిష్టానం పక్కనబెట్టేసి ఆ స్థానాన్ని అనిల్ జాదవ్‌కి కేటాయించింది. దీంతో ఆయన బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర నేతలు కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి రేవంత్ ఆహ్వానించారు. పలువురు బీఆర్ఎస్ నేతలు పార్టీని విడిచిపెడుతున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాకిచ్చారు కార్పొరేటర్లు. బీఆర్ఎస్ కు మాదాపూర్, హఫీజ్‌పేట డివిజన్ల కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత దంపతులు సోమవారం రాజీనామా చేశారు. జగదీశ్వర్ గౌడ్ కొంతకాలంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్‌కోసం ప్రయత్నాలు చేశారు. అయితే బీఆర్ఎస్ అధిష్ఠానం మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ టిక్కెట్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ లో చేరిన జీహెచ్ఎంసీ బీఆరెస్ ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ గారు, ఇతర నేతలు. #Congress6Guarantees#Congress6TelanganaVictoryFix#KCRNeverAgain #ByeByeKCR pic.twitter.com/QSQkXOF7U6
— Revanth Reddy (@revanth_anumula) October 17, 2023
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. తనను, మండవ వెంకటేశ్వర్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానించారని తెలిపారు. బుధవారం ములుగు రామప్ప దేవాలయానికి కాంగ్రెస్ జాతీయ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని కోరారని ఆ పార్టీలో చేరుతున్నామని ప్రకటించారు. బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ పార్టీలో తనకు నష్టం చేసే విధంగా వ్యవహరించారని ఆరోపించారు.
ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు సైతం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఆయన ఇవాళ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి థాక్రేతో సమావేశం అయ్యారు. మరో వైపు ఉమ్మడి నల్గొండలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ సహా ఐదుగురు కౌన్సిలర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్ రావుతో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో చేరే స్థానిక నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉండటంతో వారి కోసం పని చేయడం ఇష్టం లేని బీఆర్ఎస్ నేతలు .