By: ABP Desam | Updated at : 09 May 2022 03:23 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి హరీశ్ రావు
Minister Harish Rao : కాంగ్రెస్ , బీజేపీ కుర్చీల కోసం కోట్లాటే తప్ప ప్రజాసంక్షేమం కోసం కాదని తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్, బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి ఆయన జేపీ నడ్డా కాదు, అబద్ధాలకు అడ్డా అని విమర్శించారు. ఒకరు మోకాళ్ల యాత్ర, ఇంకొకరు పాదయాత్ర, మరొకరు సైకిల్ యాత్ర అంటూ బయలుదేరారన్నారు. బీజేపోళ్లు, కాంగ్రెస్సోళ్లు పాలించే రాష్ట్రాల్లో కనీసం కరెంటు కూడా ఉండడంలేదన్నారు. కళ్యాణ లక్ష్మీ, ఆసరా, రైతుబంధు, రైతుబీమా ఇలా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కావడంలేదన్నారు.
ఓటుకు నోటు, సీటుకు నోటు
"నడ్డాకు దమాక్ ఉందా లేదా...రా భూపాలపల్లికి ఎన్ని ఎకరాలకు సాగునీళ్లు అందాయో నిరూపిస్తా. ఆయన జేపీ నడ్డా కాదు అబద్ధాలకు అడ్డా. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు అని సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా మీ కేంద్రమంత్రే చెప్పిండు. కేంద్ర మంత్రులేమో కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడిదంటే నడ్డా ఏమో అవినీతి జరిగింది అంటుండు. ఏడేండ్ల కిందట పాలించింది కాంగ్రెస్ కాదా. కాంగ్రెస్ అంటేనే ఎరువుల కొరత. కాంగ్రెస్ అంటేనే పవర్ కట్లు. ఎరువుల కోసం, విత్తనాల కోసం కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడటం మరిచిపోయారా. ఒకపార్టీ నేత ఏమో ఓటుకు నోటు కేసు దొంగ. ఇంకో పార్టీ నేతలేమో పదవుల కోసం కోట్లు డిమాండ్ చేసే పార్టీకి చెందినవారు. కర్ణాటకలో బీజేపీ సీఎం సీటుకు రు. 2500 కోట్లు ఇవ్వాలట. ఆ పార్టీ ఎమ్మెల్యేనే మొన్న ఈ విషయం చెప్పారు. అలాంటి పార్టీలు అవి. ఒక పార్టీ ఓటుకు నోటు, మరొక పార్టీ సీటుకు నోటు." అని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
వరంగల్ కాంగ్రెస్ డిక్లరేషన్ పై
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ. 102 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీశ్‌రావు సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రూ. 55 కోట్ల వ్యయంతో 200 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశామన్నారు. రూ. 6 కోట్లతో రేడియోలజీ, పాథాలజీ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు ల్యాబ్‌ల్లో ఉచితంగా 56 పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్‌పై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఏడేండ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. ఎరువుల బస్తాల కోసం లైన్లలో గంటల తరబడి నిల్చున్నది మర్చిపోలేదన్నారు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు వారి పాలనను గుర్తుచేస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులని హరీశ్‌రావు గుర్తుచేశారు.
Modi Hyderabad Tour Today: నేడే హైదరాబాద్‌కు ప్రధాని, రంగంలోకి 2 వేల మంది పోలీసులు - పూర్తి షెడ్యూల్ ఇదీ
Petrol-Diesel Price, 26 May: ఈ నగరాల్లో వారికి శుభవార్త! ఇక్కడ ఇంధన ధరలు తగ్గుముఖం, ఈ సిటీల్లో మాత్రం పైపైకి
Gold-Silver Price: వరుసగా రెండోరోజూ బంగారం ధర షాక్! పెరిగిన పసిడి, వెండి ధరలు
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
Horoscope Today 26th May 2022: ఈ రాశివారి బలహీనతను ఉపయోగించుకుని కొందరు ఎదుగుతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్ చేసిన RCB - రాహుల్ సేనను ముంచిన క్యాచ్‌డ్రాప్‌లు!
Today Panchang 26 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, మతత్రయ ఏకాదశి ప్రత్యేకత