అన్వేషించండి

Minister Errabelli : ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడుతాం - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Minister Errabelli : ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. ప్రీతి మరణాన్ని రాజకీయం చేయొద్దని కోరారు.

Minister Errabelli : వైద్య విద్యార్థిని ప్రీతి మరణం ఆ కుటుంబానికి తీరని లోటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆమెను తిరిగి తీసుకురాలేము కానీ, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. రాజకీయాలు చేయడం కాదు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ముఖ్యమన్నారు. ఆ దిశగా సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆలోచిస్తున్నారని స్పష్టం చేశారు. వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ సహాయంతో పాటు నియోజకవర్గం పరంగా పార్టీ శ్రేణులు కార్యకర్తలు నేను కలిసి ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సాయాన్ని ప్రీతి కుటుంబానికి అందించామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఆ కుటుంబాన్ని ఇంకా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ప్రీతి సొంత గ్రామం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం మొండ్రాయి సమీపంలోని గిర్ని తండాకు మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం వెళ్లారు. ప్రీతి ఇంటికి వెళ్లిన మంత్రి ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ప్రీతి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వ హామీ మేరకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రీతి కుటుంబ సభ్యులతో  కొద్దిసేపు మాట్లాడారు వారి సమస్యలు విన్నారు. విచారణ జరుగుతున్న తీరు, వస్తున్న నివేదికల ఆధారంగా త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆ గ్రామస్థులతో మంత్రి మాట్లాడారు.

ప్రతీ కుటుంబానికి అండగా ఉంటాం 

 "ప్రీతి మరణం ఆ కుటుంబానికి తీరని లోటు. బాగా చదువుకొని, డాక్టర్ గా ఎదిగిన బిడ్డ మరణించడం ఆ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత. ప్రీతి మరణాన్ని రాజకీయం చేయడం కాదు ఆ కుటుంబానికి అండగా ఉందాం. కొందరు చావులను కూడా రాజకీయం చేస్తున్నారు. లబ్ధి పొందాలని చూస్తున్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడుదాం. ప్రీతికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. విచారణ జరుగుతుంది నివేదికలు రాగానే చర్యలు తీసుకుంటాం. ప్రీతి అన్యాయం చేసిన వారు ఎంతటి వారైనా శిక్షిస్తాం. పదేపదే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు చెబుతున్నట్లు.. ప్రీతి కుటుంబానికి అండగా ఉన్నారు. వారు ప్రకటించిన సాయాన్ని అందించడమే కాకుండా, స్వయంగా నియోజకవర్గ పార్టీ శ్రేణులు అంతా కలిసి మరింత సాయాన్ని అందించాం. ఇప్పుడు ఆ సహాయాన్ని స్వయంగా ఆ కుటుంబానికి అందజేశాం. చేసిన సహాయాన్ని చెప్పుకోవడం కాదు. ప్రీతి కుటుంబంలోని సభ్యులకి ఉద్యోగపరమైన అవకాశాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ప్రీతి కుటుంబానికి అండగా ఉంటాం అన్ని విధాలుగా ఆదుకుంటాం." - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 

దోషులను కఠినంగా శిక్షించాలి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు  మా కుటుంబం రుణపడి ఉంది. వారికి ఏం చేసినా ఆ రుణం తీర్చుకోలేం. ప్రీతి ఘటన జరిగిన నాటి నుంచి ఎర్రబెల్లి మాకు అండగా ఉన్నారు. అన్ని విధాలుగా ఆదుకున్నారు. ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా, పార్టీ పరంగా అన్ని విధాలుగా మాకు సాయం అందించారు. ప్రీతి లేని లోటుని ఎవరు తీర్చలేరు కానీ ప్రీతికి జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదంటే దోషులను కఠినంగా శిక్షించాలి. అప్పుడే ప్రీతీ ఆత్మ శాంతిస్తుంది. మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు."- ప్రీతి తల్లి శారద 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget