News
News
వీడియోలు ఆటలు
X

Jaggareddy : 47 నియోజకవర్గాల్లో పాదయాత్ర - అనుమతి కోసం థాక్రేకు జగ్గారెడ్డి లేఖ !

పాదయాత్ర చేసేందుకు జగ్గారెడ్డి రెడీ అయ్యారు. అనుమతి కోసం పార్టీ తెలంగాణ ఇంచార్జ్ కు లేఖ రాశారు.

FOLLOW US: 
Share:

Jaggareddy :  తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారు. తాను తెలంగాణలోని 47 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలనుకుంటున్నానని అనుమతి ఇవ్వాలని ఆయన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్  ఇంఛార్జి మాణిక్ రావు థాక్రేకు లేఖ రాశారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఓ విడత పాదయాత్ర పూర్తి చేశారు. మరో విడత ప్రారంభించబోతున్నారు. మరో సీనియర్ నేత మల్లు  భట్టివిక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు. ఆయన పాదయాత్ర వరంగల్ వరకు వచ్చింది. ఖమ్మంలో ముగిసే అవకాశం ఉంది. ఇప్పుడుజగ్గారెడ్డి తాను కూడా పాదయాత్ర చేస్తానని అంటున్నారు. 

ఇంతకు ముందు తెలంగామ కాంగ్రెస్ అసంతృప్త నేతల్లో ఒకరైన మహేశ్వర్ రెడ్డి కూడా పాదయాత్ర ప్రారంభించి ఆపేశారు. మాణిక్ రావు ధాక్రే ఆపేయమన్నారని ఆయన ఆరోపించారు. తర్వాత  బీజేపీలో చేరిపోయారు. మూడు రోజులుగా జగ్గారెడ్డి వరుసగా లేఖలు రాస్తున్నారు. గాంధీభవన్‌లో ప్రెండ్లీ పాలిటిక్స్ కరువయ్యాయని ఆరోపిస్తున్నారు.  ఆవేదన పేరుతో జగ్గారెడ్డి వరుసగా లేఖలను వడుదల చేయడం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చర్చకు కారణమైంది. గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేదన్నారు. తాను ను ఎవరి పేర్లు చెప్పదల్చుకోలేదని చెప్పారు. కార్యకర్తలు,అభిమానులకు తెలియాలనేది తన ఆవేదనగా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. గాంధీ భవన్ లో ప్రశాంతత కరువైందన్నారు. దాదాపు ఐదు మాసాలుగా జగ్గారెడ్డి గాంధీభవన్ కు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.  

గతంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి ఒంటికాలిపై విమర్శలు చేశారు. ఆ తర్వాత ఈ విమర్శలను కొంత కాలంగా నిలిపి వేశారు నియోజకవర్గంపైనే జగ్గారెడ్డి కేంద్రీకరించారు. హైద్రాబాద్ సిఎల్‌పి కార్యాలయానికి వస్తున్నా కూడా వివాదాస్పద విషయాలపై నోరు మెదపలేదు. పార్టీ అంతర్గత అంశాలపై కూడా ఆయన మాట్లాడలేదు. కానీ ఆకస్మాత్తుగా జగ్గారెడ్డి లేఖలు విడుదల చేయడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు, పిసిసిచీఫ్ రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ ఉంది. మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి జగ్గారెడ్డి అత్యంత సన్నిహితుడుగా పేరుంది. ఆవేదన పేరుతో జగ్గారెడ్డి లేఖల విడుదల వెనుక వ్యూహం ఏముందనే విషయమై పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది.                                 

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ నాయకత్వం పట్టుదలతో ఉంది. అయితే పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం ఆ పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. పార్టీ అంతర్గత అంశాలపై పార్టీ వేదికలపైనే చర్చించాలని పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలంగాణ నేతలకు సూచించారు. మీడియా వద్ద ఈ అంశాలపై మాట్లాడితే చర్యలు తీసుకొంటామని కూడా ఆయన హెచ్చరించారు. పార్టీ వేదికలపై కాకుండా బయట మాట్లాడితే పార్టీకి నస్టమని ఆయన తేల్చి చెప్పారు. జగ్గారెడ్డి పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోతే.. అదే కారణం చెప్పి ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. 

Published at : 28 Apr 2023 03:00 PM (IST) Tags: Jaggareddy Telangana Congress Politics Manik Rao Thakre Jaggareddy Padayatra

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: మంత్రులపై బాబు పంచ్‌లు, జగన్‌పై పేర్ని నాని ప్రశంసలు- సింగరేణిపై కేసీఆర్ కీలక ప్రకటన

Top 10 Headlines Today: మంత్రులపై బాబు పంచ్‌లు, జగన్‌పై పేర్ని నాని ప్రశంసలు- సింగరేణిపై కేసీఆర్ కీలక ప్రకటన

Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, రుతుపవనాలు రాయలసీమకు ఎప్పుడో తెలుసా?

Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, రుతుపవనాలు రాయలసీమకు ఎప్పుడో తెలుసా?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

IND vs AUS, WTC Final 2023: 300కు చేరిన ఆసీస్ ఆధిక్యం - డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పట్టు బిగించిన కంగారూలు

IND vs AUS, WTC Final 2023: 300కు చేరిన ఆసీస్ ఆధిక్యం - డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పట్టు బిగించిన కంగారూలు