News
News
వీడియోలు ఆటలు
X

SIT Notices To Bandi Sanjay : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు సిట్ నోటీసులు - 24న హాజరు కావాలని ఆదేశం !

బండి సంజయ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. 24వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

FOLLOW US: 
Share:


SIT Notices To Bandi Sanjay :   ఉద్యోగ పరీక్షల పేపర్ల లీకేజీ కేసుల్లో తనకు నోటీసులు ఇచ్చే ధైర్యం ఉందా అని సిట్ అధికారులపై సోమవారం బండి సంజయ్ చాలెంజ్ చేశారు. మంగళవారం ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రశ్నాపత్నాల లీకేజీ విషయంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఆధారాలివ్వాలని 24వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు చేసిన  టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయనను 23వ తేదీన ఆధారాలు తీసుకుని తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పుడు బండి సంజయ్ వంతు.  ఈ పేపర్ లీకేజీ కేసులో ఆరోపణలు చేసిన మరికొంత మందికి కూడా సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

పేపర్ లీకేజీకి కేటీఆర్ బాధ్యుడని బండి సంజయ్ ఆరోపణలు

టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీకి మంత్రి కేటీఆర్ బాధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల ఆరోపించారు. గ్రూప్-1 పేపర్ లీకేజీ వ్యవహారంలో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయన్నారు. బీఆర్ఎస్ జడ్పీటీసీ, సర్పంచ్, సింగిల్ విండో ఛైర్మన్ పిల్లలు, బంధువులు గ్రూప్ 1 పరీక్షలో క్వాలిఫై అయ్యారన్నారు. ఒకే మండలం నుంచి 50 మందికిపైగా క్వాలిఫై అయ్యారని, ఒక చిన్న గ్రామంలో 6గురు క్వాలిఫై అయ్యారని ఆరోపించారు. ఈ లీకేజీకి కేసీఆర్ కొడుకే బాధ్యుడని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నియమించిన సిట్ విచారణ ఎలా చేయగలదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మంత్రివర్గం నుంచి సీఎం కేసీఆర్ కొడుకును బర్త్ రఫ్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులే అధిక సంఖ్యలో క్వాలిఫై అయ్యారని ఆరోపించారు. వీటికి ఆధారాలు తేవాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది. 

ఓ చిన్న గ్రామంలో 6గురు క్వాలిఫై  అయ్యారని ఆరోపణలు

తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టి తన ఇంటికే ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతల పుత్రరత్నాలకు, బంధువులకు ప్రభుత్వ కొలువులు ఇప్పించే కుట్ర చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వ నియామకాల్లో అక్రమాలకు పాల్పడి 30 లక్షల మంది యువతీ, యువకుల జీవితాలను ఆగం చేశారన్నారు.  గ్రూప్-1 పరీక్షకు సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగు చూస్తున్న కొద్దీ TSPSC స్కామ్ అనుకున్న దానికన్నా చాలా పెద్దదని అర్థమవుతోందన్నారు. బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారివద్ద పని చేసే వాళ్లను గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో క్వాలిఫై చేసినట్టు తెలుస్తోందన్నారు. జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికిపైగా మెయిన్స్ కు అర్హత సాధించారన్నారు. ఒక చిన్న గ్రామం నుంచే 6 గురు క్వాలిఫై అయ్యారని, వీళ్లంతా ప్రతిభావంతులు అనుకుంటే పొరబాటే అన్నారు. బీఆర్ఎస్ నేతల కొడుకులు, బంధువులు, వాళ్ల వద్ద పనిచేసే వాళ్లు కావడం వీళ్లకున్న ఎక్స్ ట్రా క్వాలిఫికేషన్ అని బండి సంజయ్ అన్నారు. ఇలా క్వాలిఫై అయిన వారి వివరాలు తేవాలని సిట్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలు్సతోంది. 

సిట్ తో నిష్పక్షపాత విచారణ ఎలా సాధ్యం? 
 
"నలుగురు బీఆర్ఎస్ సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో ఛైర్మన్ కొడుకుతో పాటు ఒక జడ్పీటీసీ బాడీగార్డ్ కొడుకు క్వాలిఫై అయ్యారు. ఒక సర్పంచ్ కుమారుడికి అర్హతలు లేకున్నా దొడ్డిదారిన క్వాలిఫై చేశారు. ఇదంతా కేసీఆర్ కొడుకు కనుసన్నల్లోనే జరిగింది. ఇందుకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. నిరుద్యోగ యువతకు అన్యాయం చేసి అనర్హులకు ఉద్యోగాలిప్పిస్తున్న కేసీఆర్ కొడుకును తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. సీఎం కొడుకు ప్రమేయం ఉన్న నేపథ్యంలో ఆయన నియమించిన సిట్ తో నిష్పక్షపాత విచారణ ఎలా సాధ్యం? నయీం డైరీ, టాలీవుడ్ డ్రగ్స్ కేసు, మియాపూర్ ల్యాండ్ కేసు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సూసైడ్ కేసు తరహాలోనే పేపర్ లీకేజీ కేసును సైతం సిట్ కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోంది. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు అభ్యంతరం ఎందుకు?" అని బండి సంజయ్ ప్రశ్నించారు. వీటికి ఆధారాలు తీసుకుని బండి సంజయ్ సిట్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. 

Published at : 21 Mar 2023 06:38 PM (IST) Tags: Bandi Sanjay Paper Leakage Case tspsc case sit inquiry

సంబంధిత కథనాలు

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, చివరగా ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, చివరగా ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?

Telangana సీఎం కేసీఆర్ కి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ- ప్రస్తావించిన అంశాలివే

Telangana సీఎం కేసీఆర్ కి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ- ప్రస్తావించిన అంశాలివే

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

టాప్ స్టోరీస్

AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ పనీ చెప్పడం లేదా ?

AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ  పనీ చెప్పడం లేదా ?

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!

Anasuya - Vimanam 2023 Movie : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ

Anasuya - Vimanam 2023 Movie : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో