అన్వేషించండి

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై సీఎం కేసీఆర్ ది ఎన్నికల ప్రేమని వైఎస్ షర్మిల విమర్శించారు. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి గడీదాటి వచ్చారన్నారు.

 తెలంగాణలో పంట నష్టపోయిన రైతులకు గడిచిన ఎనిమిదేళ్లుగా పరిహారం ఇవ్వలేదంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వక్తం చేశారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పూర్తి స్థాయిలో ఒకేసారి రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్న నేత తన తండ్రి  వైయస్ఆర్ అన్నారు. వైఎస్ఆర్ హయాంలో సబ్సిడీ విత్తనాలు, ఎరువులను పంపిణీ చేశారని, రైతులకు బ్యాంకర్ల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు పంపిణీ చేయించారన్నారు.. యంత్ర లక్ష్మి పథకాన్ని అమలు చేసి, రైతులకు ఉచితంగా బోర్లు వేయించారన్నారు. పూర్తి స్థాయిలో మద్దతు ధరతో పాటు బోనస్ కూడా చెల్లించేవారని తెలిపారు. కౌలు రైతులను గుర్తించి ఆదుకున్నారన్నారు. వైయస్ఆర్ పాలనలో అకాల వర్షాలు పడ్డా, వడగండ్ల వానలు పడ్డా రైతులు తమకు వైయస్ఆర్ ఉన్నాడనే గుండెధైర్యంతో జీవించేవారన్నారు. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణలో రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని షర్మిల విమర్మించారు.

8 వేల మంది రైతులు ఆత్మహత్య 

కేసీఆర్  తొమ్మిదేండ్లుగా రుణమాఫీ అమలు చేయడం చేతకావడలేదని, ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని ఓట్లు వేయించుకుని ,ఆ తరువాత అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ తీరుతో రైతులు డీఫాల్టర్లుగా మారాల్సిన దుస్దితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని, అలాగే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి, కరెంట్ కోతలు విధించి, రైతు కండ్లలో కారం చల్లుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పంట పరిహారం దేవుడెరుగు కనీసం పంట బీమాకు సైతం దిక్కు లేదన్నారు. రైతులకు తొమ్మిదేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనను కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం పక్కన పెట్టి, రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు. రైతులకు సంబంధించిన కనీసం రూ.30 వేల రూపాయల విలువల గల పథకాలు అన్నీ బంద్ పెట్టి, కేవలం రూ.5 వేల రూపాయల రైతు బంధు ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. పుట్టలు, గుట్టలు అనే తేడా లేకుండా వందల ఎకరాలు ఉన్న సంపన్న వర్గాలకు కూడా రైతుబంధు చెల్లించడం కేసీఆర్ కే సాధ్యమైయ్యిందని ఆరోపించారు. 2017లో ప్రగతిభవన్ లో రైతులతో సమావేశం నిర్వహించి వందకు వంద శాతం ఉచిత ఎరువులు అంటూ మోసం చేశారని తెలిపారు. ఆరేండ్లు దాటినా ఇప్పటికీ ఒక్క బస్తా కూడా పంపిణీ చేయలేదని మండిపడ్డారు వైఎస్ షర్మిల. రైతులకు ఆసరాగా నిలిచే సబ్సిడీ విత్తనాలు, ఎరువులు సైతం పంపిణీ చేయడం లేదని, ఎనిమిదేండ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణాలో రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు.  యంత్ర లక్ష్మి పథకాన్ని సైతం అటకెక్కించారు. కౌలు రైతులు అసలు రైతులే కాదని, వారికి ఒక్క పథకం కూడా అమలు చేయకుండా రాక్షసత్వం ప్రదర్శించారని కేసీఆర్ తీరుపై విమర్శలు సంధించారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడే సరికి దొరకు రైతులు, కౌలు రైతులు యాదికొచ్చారా అంటూ ప్రశ్నించారు వైఎస్ షర్మిల. 

రైతులపై కేసీఆర్ ఎన్నికల ప్రేమ..

ఎన్నికలు ఉంటేనే కేసీఆర్ గడీ దాటుతారని  మరోసారి రుజువయ్యిందన్నారు వెఎస్ షర్మిళ. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే సరికి ఉన్నట్లుండి దొరకు  రైతులు గుర్తుకొచ్చారా అంటూ ప్రశ్నించారు. తొమ్మిదేండ్లుగా  జరిగిన పంట నష్టాన్ని కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదు, ఏటా దాదాపు రూ.వెయ్యి కోట్లు అంటే తొమ్మిదేండ్లలలో దాదాపు రూ.9వేల కోట్ల మేర పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి ఇవ్వలేదని అన్నారు. రైతులు సర్వం కోల్పోయామని రోడ్లపై పడి ఆందోళన చేసినా పట్టించుకోలేదన్నారు. పంట నష్టం కింద మీరిచ్చే రూ.10 వేలు రైతును నిలబెడతాయా? ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టినం అని మీకే చెప్పిన రైతుకు మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పరిహారం పూర్తి స్థాయిలో ఎవరూ ఇవ్వరు అని చెప్పడానికి సిగ్గుగా లేదా? బిడ్డ లిక్కర్ స్కాం, కొడుకు TSPSC లీకుల పంచాయితీలో ఇరుక్కుపోయే సరికి దొర రూట్ మార్చి, రైతులకు మాయ మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో వ్యవహారం బెడిసి కొట్టేటట్లు ఉందని.. సద్ది మూట కట్టుకుని చల్లటి మాటలు చెప్తున్నాడన్నారు షర్మిల. కనీసం ఇచ్చిన రూ.10 వేల హామీ అయినా నెరవేరుస్తావా? లేక వరద బాధితులను మోసం చేస్తావా అంటూ ప్రశ్నించారు అధ్యక్షురాలు షర్మిల. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Allu Arjun - Chiranjeevi: అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
Viral Video: చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
Teacher Transfers: ఏపీలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రోడ్ మ్యాప్ విడుదల చేసిన విద్యాశాఖ
ఏపీలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రోడ్ మ్యాప్ విడుదల చేసిన విద్యాశాఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Allu Arjun - Chiranjeevi: అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
Viral Video: చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
Teacher Transfers: ఏపీలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రోడ్ మ్యాప్ విడుదల చేసిన విద్యాశాఖ
ఏపీలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రోడ్ మ్యాప్ విడుదల చేసిన విద్యాశాఖ
Joe Root Recods: సచిన్ రికార్డు బద్ధలుకొట్టిన జో రూట్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడిగా ఘనత
సచిన్ రికార్డు బద్ధలుకొట్టిన జో రూట్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడిగా ఘనత
Fastest Developing Cities: 2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
Russia Ukraine War :  ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
Embed widget