News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

YS Sharmila: మోదీకి ఎదురెళ్లి నిలదీసే దమ్ము సీఎం కేసీఆర్ కు లేదు: వైఎస్ షర్మిల 

YS Sharmila: నరేంద్ర మోదీకి రాష్ట్రంలో అడుగు పెట్టే హక్కు లేదని చెబుతున్న సీఎం కేసీఆర్ కు.. ఎదురెళ్లి ప్రధానిని నిలదీసే దమ్ములేదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. 

FOLLOW US: 
Share:

YS Sharmila: రాష్ట్రంలో ప్రధానికి అడుగు పెట్టే అర్హత లేదంటున్న సీఎం కేసీఆర్ కు.. ఎదురెళ్లి మోదీని నిలదీసే దమ్ము లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సీఎం కేసీఆర్ కు అడిగే దమ్ము లేదు, ఇచ్చే దమ్ము లేదంటూ ఫైర్ అయ్యారు. గత పదేళ్లుగా ఇలాగే వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే.. 5 ఏళ్లలో మోడీ వచ్చిన ప్రతీసారి మొహాలు ఎందుకు చాటేశారని ప్రశ్నించారు. విభజన హామీల సంగతి ఏంటని ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. అలాగే తెలంగాణకు దక్కాల్సిన నిధులపై ఎందుకు నిలదీయలేదని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. 

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులపై చేసిన పోరాటాలు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. కేంద్రం ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాల్లో రాష్ట్ర వాటా ఏదని అడిగారా అంటూ సీఎం కేసీఆర్ ను నిలదీశారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన విశ్వ విద్యాలయం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల సంగతిపై పోరాడారా అని అన్నారు. అలాగే ఏటా బడ్జెట్ లో రాష్ట్రానికి మొండి చేయి ఇస్తుంటే మీ ఎంపీలు చేతకాని దద్దమ్మలు కాలేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ ఇదే "బీజేపీ రాష్ట్ర సమితి" దోస్తానా అంటూ చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ కు కుటుంబ క్షేమంపై ఆరాటం తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమంపై సోయి రాదని.. కేసుల నుంచి తప్పించుకునేందుకు మోడీ వద్ద మోకరిల్లి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఈ కేసీఆర్ అండ్ కో కు రాష్ట్రంలో ఉండే అర్హతే లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.

పార్టీ విలీనంపై ఈనెల 30వ తేదీలోగా నిర్ణయం

కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనంపై సోమవారం వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. పార్టీ విలీనంపై ఈ నెల 30వ తేదీలోపు నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. విలీనం లేకపోతే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌టీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని తెలిపారు. ఒకవేళ విలీనం లేకపోతే తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సింగిల్‌గా పోటీ చేసేందుకు వైఎస్సార్‌టీపీ సిద్దంగా ఉందని చెప్పారు. కార్యకర్తలు, నేతలు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం కష్టపడ్డవారికి సరైన ప్రాధాన్యత దక్కుతుందని షర్మిల పేర్కొన్నారు. విలీనంపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటానంటూ ఇటీవల వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలో షర్మిల ప్రకటించారు. ఆ తర్వాత ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ అయ్యారు. ఆ తర్వాత షర్మిల సైలెంట్ కావడంతో పార్టీ విలీనానికి బ్రేక్‌లు పడ్డాయనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా  విలీనం లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తానని షర్మిల ప్రకటించడం కీలకంగా మారింది. దీంతో విలీనం ఉంటుందా..? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.

Published at : 27 Sep 2023 05:03 PM (IST) Tags: YS Sharmila Telangana News YSRTP President Sharmila Sharmila on CM KCR Sharmila Fires on BRS

ఇవి కూడా చూడండి

అన్ని తుపానులకు ఎందుకు పేర్లు పెట్టరూ? మిగ్‌జాం  అంటే అర్థమేంటీ?

అన్ని తుపానులకు ఎందుకు పేర్లు పెట్టరూ? మిగ్‌జాం అంటే అర్థమేంటీ?

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

TSPSC Group 4 Results: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?

TSPSC Group 4 Results: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?

Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ

Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ

Hyderabad News: ఒంటెలను వధించి మాంసం విక్రయం - ముగ్గురు నిందితుల అరెస్ట్

Hyderabad News: ఒంటెలను వధించి మాంసం విక్రయం - ముగ్గురు నిందితుల అరెస్ట్

టాప్ స్టోరీస్

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
×