అన్వేషించండి

Sharmila Comments: ‘కేసీఆర్‌లా రాజశేఖర రెడ్డి ఒకరికే కాంట్రాక్ట్‌లు ఇవ్వలేదు, ఒక్కరి దగ్గరే అన్ని కమీషన్లు తీసుకోలేదు’ షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila: కేసీఆర్, మేఘా క్రిష్ణారెడ్డి లక్ష్యంగా కేసీఆర్ విమర్శలు చేశారు. తెలంగాణలో 80 శాతం ప్రాజెక్టులను ఒకే వ్యక్తికి ఎందుకు కట్టబెడుతున్నారని షర్మిల ప్రశ్నించారు.

YS Sharmila Comments: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నోరు జారారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విమర్శలు చేస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన నీటి ప్రాజెక్టుల విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగానే పొరపాటు పడ్డట్లుగా కనిపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తూ ఆయన ప్రాజెక్టులన్నిటినీ ఒక్కరికే అప్పగించి కమీషన్లు పొందారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి హాయాంలో రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ లా ఒక్క మనిషికే అన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదని, ఒక్క మనిషి దగ్గరే అన్ని కమీషన్లు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి చేసింది డెవలప్‌మెంట్.. కేసీఆర్ చేసింది కరప్షన్ అని షర్మిల ఆరోపించారు.

‘‘రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ లాగా ఒక్క మనిషికే అన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు. ఒక్క మనిషి దగ్గరే అన్ని కమిషన్లు తీసుకోలేదు.’’ ని షర్మిల అన్నారు. ప్రస్తుతం ఈ క్లిప్ విపరీతంగా వైరల్ అయింది. అయితే, వైఎస్ షర్మిల ఇలా ఉద్దేశ పూర్వకంగా వ్యాఖ్యానించలేదనే విషయం స్పష్టం అవుతోంది. 

కేసీఆర్, మేఘా క్రిష్ణారెడ్డి లక్ష్యంగా కేసీఆర్ విమర్శలు చేశారు. తెలంగాణలో 80 శాతం ప్రాజెక్టులను ఒకే వ్యక్తికి ఎందుకు కట్టబెడుతున్నారని షర్మిల ప్రశ్నించారు. మేఘా కృష్ణా రెడ్డి తెలంగాణను దోచుకున్నారరని ఆరోపించారు. ప్రపంచంలోని సంపన్నుల లిస్టులో ఆయన చోటు సంపాదించుకున్నారని అన్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా వాళ్లకు ప్రాజెక్టులు కట్టబెట్టడాన్ని కేసీఆర్ ప్రశ్నించారని గుర్తు చేశారు.

కొత్త వాళ్లకు ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఎందుకు ఇవ్వడం లేదని షర్మిల నిలదీశారు. ‘‘తెలంగాణ వచ్చింది మెగా కృష్ణా రెడ్డి కోసమేనా? తెలంగాణను ఆయన చేతుల్లో పెడితేనే రాష్ట్రం ఇస్తామని ఏమైనా ఒప్పందం చేసుకున్నారా? రాష్ట్రం మొత్తాన్ని మేఘా కృష్ణా రెడ్డి చేతుల్లో పెట్టడం ద్వారా ఏం సంకేతాలు ఇస్తున్నారు. ఒకే వ్యక్తికి 80 శాతానికిపైగా ప్రాజెక్టులా? ఇది ఇతర రాష్ట్రాల్లో ఏమైనా జరుగుతుందా? కృష్ణా రెడ్డి దగ్గర రూ.70 వేల కోట్ల బ్లాక్ మనీ ఉంది. దానికి సంబంధించి రూ.12 వేల కోట్లు జీఎస్టీ కట్టాలని జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ స్వయంగా చెప్పారు’’ అని షర్మిల ఆరోపించారు.

మేఘా కృష్ణా రెడ్డితో ఎలాంటి ఒప్పందం లేకపోతే కేసీఆర్ అన్ని ప్రాజెక్టులను ఆయనకే ఎందుకు ఇస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. వాళ్లిద్దరూ ఒకటేనని వ్యాఖ్యానించారు. కృష్ణారెడ్డి నుంచి కేసీఆర్ కుటుంబానికి కమీషన్లు వెళ్తాయని, కృష్ణారెడ్డికి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ అందరూ దోస్తులేనంటూ ఎద్దేవా చేశారు. అందుకే ప్రతిపక్షాలు కూడా ఏమీ స్పందించడం లేదని అన్నారు. మెగా కృష్ణారెడ్డి మీద విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయనకు కట్టబెట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంపు హౌజ్ లోకి నీళ్లు వస్తే అది కట్టిన కృష్ణారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Embed widget