Weather Updates: ఏపీలో ఆ జిల్లాల్లో భరించలేనంత ఉక్కపోత - అగ్నిగోళంలా మారుతున్న తెలంగాణ

Dry Weather likely to Prevail in Telangana:ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

FOLLOW US: 

Dry Weather likely to Prevail in Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇకనుంచి 41 నుంచి 45 డీగ్రీల మధ్యలో ఎండలు ఉంటాయని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ కేంద్రం కొన్నిజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, అధిక ప్రభావం ఉండే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

ఉత్తర కోస్తాంధ్ర యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోకి ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం మరింత వేడెక్కనుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం,  ఉభయ గోదావరి జిల్లాల్లో ఎండల తీవ్రత 40 నుంచి 44 డిగ్రీల దాక ఉండనుంది. కోస్తా ప్రాంతాలు ( విశాఖ​, కాకినాడ​, మచిలీపట్నం) ఇలాంటి చోట్ల ఎండలకంటే ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. మంచి ఎండ వేడి, కాస్తంత తేమ ఉండటం వల్ల విశాఖపట్నం పరిసర ప్రాంతాలైన పాడేరు-బొబ్బిలి ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ప్రజలు మధ్యాహ్నం వేళ ఎండలో బయట తిరగకూడదదని, అవసరమైతే గొడుకు తీసుకుని బయటకు వెళ్లాలని, రోజుకు 5 లీటర్ల నీరు తాగాలని వాతావరణ శాఖ, వైద్య నిపుణులు సూచించారు.

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న వడగాల్పుల వల్ల ఈ రోజు చిత్తూరు, కడప​, కర్నూలు, అనంతపురం జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీల దాక ఎండల తీవ్రత ఉంటుంది. అలాగే నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లా (పల్నాడు ప్రాంతం) లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సీమ జిల్లాల్లో భానుడి ప్రతాపంతో ఉక్కపోత, తేమ పెరిగింది. రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కర్నూలు జిల్లా-తెలంగాణ సరిహద్దు ప్రాంతం ముఖ్యంగా నందికొట్కూరు పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. ఏపీలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 41.5 డిగ్రీలు, నంద్యాలలో 40, అనంతపురం, కడపలో 40.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

తెలంగాణ వెదర్ అప్‌డేట్స్..
తెలంగాణలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో వైపున తెలంగాణ రాష్ట్రంలోనూ ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ ఎండలతో ఉక్కపోత, తేమ అధికం అవుతాయి. హైదరాబాద్ లో నేడు సైతం 40 డిగ్రీల ఎండ ఉంటుంది. ఎండల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. మధ్యాహ్నం సమయం ఎండలు, వేడి గాలులు ఎక్కువగా ఉంటాయని అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వాతావరణ కేంద్రం సూచించింది.

 Also Read: Horoscope Today 3rd April 2022: ఈ రాశివారు కోరికలకు కళ్లెం వేయాల్సిందే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

 Also Read: Gold-Silver Price: శుభవార్త! నేడు దిగొచ్చిన పసిడి ధర, అదే దారిలో వెండి కూడా

Published at : 03 Apr 2022 06:43 AM (IST) Tags: rains in telangana Weather Updates ap weather updates AP Temperature Today Telangana Temperature Today

సంబంధిత కథనాలు

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Breaking News Live Updates : ఆత్మకూరులో ఉద్రిక్తత, కాల్వ శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

Breaking News Live Updates : ఆత్మకూరులో ఉద్రిక్తత, కాల్వ శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

CM KCR Meets Akhilesh Yadav : దిల్లీలో సీఎం కేసీఆర్ తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ, ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ!

CM KCR Meets Akhilesh Yadav : దిల్లీలో సీఎం కేసీఆర్ తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ, ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ!

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో ఐదుగురు నిందితులు అరెస్టు

Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో ఐదుగురు నిందితులు అరెస్టు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Subrahmanyam Death Case: ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి

Subrahmanyam Death Case: ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌	గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !

IPL 2022 TV Ratings: ఐపీఎల్‌ టీవీ రేటింగ్స్‌ ఢమాల్‌! పరిహారం డిమాండ్‌ చేస్తున్న అడ్వర్టైజర్లు

IPL 2022 TV Ratings: ఐపీఎల్‌ టీవీ రేటింగ్స్‌ ఢమాల్‌! పరిహారం డిమాండ్‌ చేస్తున్న అడ్వర్టైజర్లు

Buggana On Jagan London Tour : జగన్ లండన్ వెళ్లింది నిజమే కానీ అసలు కారణం వేరే - బుగ్గన వివరణ !

Buggana On Jagan London Tour :  జగన్ లండన్ వెళ్లింది నిజమే కానీ అసలు కారణం వేరే - బుగ్గన వివరణ !