అన్వేషించండి

Horoscope Today 3rd April 2022: ఈ రాశివారు కోరికలకు కళ్లెం వేయాల్సిందే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

2022 ఏప్రిల్ 3 ఆదివారం రాశిఫలాలు

మేషం
ఈ రాశి వ్యాపారులకు లాభం వస్తుంది. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. ప్రతికూల ధోరణులు ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి.  విద్యార్థులకు రోజు చాలా మంచిది. మీ ఆలోచనలు స్థిరంగా ఉంచుకోండి. ఈ రోజు సానుకూలంగా ఉంటారు.

వృషభం
వృషభ రాశివారు ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఏదో విషయంలో భయపడుతుంటారు. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగించండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను తేలిగ్గా తీసుకోకండి.  మీ కోరికలను నియంత్రించుకోండి. జీవిత భాగస్వామి సలహాలు పాటించడం మంచిది.

మిథునం
వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. వ్యాధిగ్రస్తులు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. సోదరుల సహకారం ఉంటుంది.  ఆర్థికంగా స్థితి బావుంటుంది. చిత్తశుద్ధితో పనిచేయడం వల్ల ప్రయోజనం పొందుతారు. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు.

కర్కాటకం
ఈ రోజు మీరు సామాజికంగా చాలా గౌరవం పొందుతారు. కొన్ని ముఖ్యమైన బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. ఆగిపోయిన కొన్ని పనులు సాయంత్రానికి పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. . కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మధురంగా ​ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ రోజు మంచిది. తెలియని వ్యక్తుల వల్ల సమస్యలు తలెత్తుతాయి.

Also Read: ఖురాన్ ఆవిర్భవించిన నెల ఇదే, మనసు-శరీరంలో మలినాల ప్రక్షాళణకే రంజాన్ ఉపవాస దీక్షలు

సింహం
ఋషి ధోరణి ఉన్నవారి ఆలోచనలు మీపై ప్రభావం చూపుతాయి. మీ పిల్లలు చదువులో మంచి విజయం సాధించగలరు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారిపై పనిభారం పెరుగుతుంది. మీరు మీ పని శైలిని కూడా మార్చవలసి ఉంటుంది. వ్యాపారాలు లాభాలు పొందుతారు. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి.

కన్యా
మీరు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. కొత్త పనికి సంబంధించిన మీ ప్రణాళికలను వ్యక్తులతో పంచుకోవద్దు. ఈ రోజు మీకు సహోద్యోగుల నుంచి మద్దతు లభించదు. పాత రుణాన్ని తిరిగి చెల్లించాలనే ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈరోజు కాస్త ప్రశాంతంగా, ఓపికగా ఉండండి. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు.

తులా
బంధువులను కలుస్తారు .  జీవిత భాగస్వామితో అనుబంధం చాలా బాగుంటుంది.  పెద్ద లావాదేవీల సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీలకు పని ప్రదేశంలో గౌరవం లభిస్తుంది. కొన్ని సామాజిక కార్యక్రమాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు శుభసమయం.

వృశ్చికం
మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశలొస్తాయి.  ఇంటి సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. ప్రభుత్వ నిబంధనలను పాటించేందుకు వెనుకాడవద్దు. స్నేహితులు, సహోద్యోగులతో సమన్వయం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. మీ శత్రువులు చురుకుగా ఉంటారు.

ధనుస్సు 
మీరు కుటుంబ సంబంధాలను పూర్తిగా ఆనందిస్తారు. నిర్ణీత సమయంలో మీ లక్ష్యాలను సాధిస్తారు. విద్యారంగంలో కొత్త అవకాశాలను పొందుతారు. గొప్ప ఒప్పందాలు కుదుర్చుకుంటారు.  మేధోపరమైన చర్చల ద్వారా మీరు విజయం పొందుతారు. మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాలపై సంప్రదిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Also Read: శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో మీ రాశిఫలితం, కందాయ ఫలం ఇక్కడ తెలుసుకోండి

మకరం
ఈ రోజు తొందరగా అలసిపోతారు. ఉధ్యోగులు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆహారంలో స్వచ్ఛత, పోషకాహారంపై శ్రద్ధ వహించండి. ఏదైనా పెద్ద లక్ష్యాన్ని సాధించాలనే ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి తీసుకోవడం వల్ల మీ నిర్ణయాలు తప్పుగా మారొచ్చు. గృహ నిర్మాణ పనులకు సంబంధించిన వ్యక్తులు లాభపడతారు.

కుంభం
మీ ఆలోచనలను, కోర్కెలను నియంత్రించుకోండి. మీరు తలపెట్టిన పనుల్లో మీ జీవితభాగస్వామి సహకారం ఉంటుంది.  అకస్మాత్తుగా ఎక్కడికో ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు చాలా శుభప్రదం. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం ఉంటుంది. స్వీయ అధ్యయనం ఆసక్తిని కలిగిస్తుంది.

మీనం
కార్యాలయంలో మీకు మద్దతు ఉంటుంది. మీ నైపుణ్యంతో, మీరు చాలా మంది వ్యక్తులు తమ పనిని పూర్తిచేసుకుంటారు.  ఆర్థికంగా బలపడతారు. మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది.ఈరోజు విద్యార్థులకు గందరగోళ పరిస్థితి ఉంటుంది. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది.

Also Read: శుభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలావారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే అంతా శూన్యమే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget