Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల అలర్ట్! వచ్చే 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వానలు - IMD ప్రకటన
హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు నేడు (ఆగస్టు 4) ఉదయం వెల్లడించిన వివరాల మేరకు వచ్చే 3 గంటల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.
Weather Latest News: ఛత్తీస్ గడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరీన్ ప్రాంతం వరకు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీ తీరంలో కోస్తా తమిళనాడు మరియు పరిసర ప్రాంతాలపై తుపాను ప్రసరణ ఇప్పుడు పశ్చిమ, మధ్య మరియు దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో ఏపీలో వాతావరణ పరిస్థితులు ఇలా ఉండే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తాఆంధ్ర, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల సంభవించే అవకాశం ఉంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో
తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల సంభవించే అవకాశం ఉంది.
Telangana Weather: తెలంగాణలో ఇలా
హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు నేడు (ఆగస్టు 4) ఉదయం వెల్లడించిన వివరాల మేరకు వచ్చే 3 గంటల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. మహబూబాబాద్, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో వచ్చే 3 గంటల్లో అత్యధిక వర్షం కురవనున్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Now cast warning, Met. Center, Hyderabad, 04-08-2022, 0400 IST: pic.twitter.com/xLwn7OZBFM
— IMD_Metcentrehyd (@metcentrehyd) August 3, 2022
ఇక నిన్న తెలంగాణలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని ఎండలు కూడా అధికంగా ఉన్నాయి. నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి,హైదరాబాద్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, జనగాం, హనుమకొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఏరియాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని నిన్న వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.