By: ABP Desam | Published : 11 May 2022 07:38 AM (IST)|Updated : 11 May 2022 07:38 AM (IST)
అసని తుపాను ప్రభావం చూపిస్తున్న ఉపగ్రహ చిత్రం
Asani Cyclone Effect Latest News: కల్లోలం రేపుతున్న అసని తుపాను తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడినట్లుగా ఏపీ విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ డాక్టర్ అంబేడ్కర్ తెలిపారు. 'అసని' రేపు (మే 12) ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుందని తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలిందని తెలిపారు. ప్రస్తుతం మచిలీపట్నానికి 60 కి.మీ., కాకినాడకు 180 కి.మీ., విశాఖపట్నానికి 310 కి.మీ., గోపాలపూర్ కు 550 కి.మీ., పూరీకి 630 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమైంది.
కొన్ని గంటల్లో ఈ తుపాను వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉత్తరం-ఈశాన్య దిశగా కదులుతూ మచిలీపట్నం, నర్సాపూరం, యానాం, కాకినాడ, తుని, విశాఖపట్నం తీరాల వెంబడి కదులుతూ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉంది.
వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అంతేకాక, కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. సహాయక చర్యలకు తొమ్మితి రాష్ట్ర విపత్తు నిర్వహణ టీమ్‌లు, మరో 9 జాతీయ విపత్తు నిర్వహణ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Fisherman warnings for Andhra Pradesh dated 10.05.2022 pic.twitter.com/tfcDp71eIT
— MC Amaravati (@AmaravatiMc) May 10, 2022
Telangana Weather తెలంగాణలో వాతావరణం ఇలా
అసని తుపాను ఎఫెక్ట్ తెలంగాణపై అంతగా లేదు. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణలో మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) May 10, 2022
Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ
Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ
Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్
Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు
Prabhas: ప్రభాస్‌కు కండిషన్లు పెట్టిన దర్శకుడు?
Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam
Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'
Kamareddy Rains: కామారెడ్డి జిల్లాలో అకాలవర్షాలు...తడిసిపోయిన ధాన్యం|ABP Desam