Hyderabad News: హైదరాబాద్ లో భయంకరమైన దొంగల ముఠా, ఈ ఏరియా వారికి పోలీసుల అలర్ట్!
Hyderabad News in Telugu: రాత్రి సమయంలో హయత్ నగర్, రాచకొండ కమిషనరేట్ పరిసర ప్రాంతాలలో థార్ అనే భయంకరమైన దొంగల ముఠా సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని పోలీసులు తెలిపారు.
Vanasthalipuram Police Alert: హైదరాబాద్ లో ఓ కరడుకట్టిన దొంగల ముఠా తిరుగుతున్నట్లుగా పోలీసులు హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా వనస్థలిపురం పరిసర ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధి లో చుట్టుపక్కల ప్రజలకు తెలియజేయునది ఏమనగా.. నిన్న రాత్రి సమయంలో హయత్ నగర్, రాచకొండ కమిషనరేట్ పరిసర ప్రాంతాలలో థార్ అనే భయంకరమైన దొంగల ముఠా సంచరిస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ గ్యాంగ్ లో ఉత్తరప్రదేశ్ కి చెందిన ఐదు నుంచి ఆ పైన వ్యక్తులు దొంగల ముఠాగా ఏర్పడి, పట్టణ శివారు ప్రాంతాలలో, చిన్న చిన్న లాడ్జిల్లో తాత్కాలికంగా నివాసం తీసుకుంటారు. ఈ గ్యాంగ్ వ్యక్తులు, పగలు సమయంలో రెక్కీ నిర్వహణ చేసుకుని తాళం వేసి ఉన్న ఇళ్లను, నగర శివారు ప్రాంతాల్లో నివసించే ఇళ్లను అలాగే గేటెడ్ కమ్యూనిటీలో నివసించే విల్లాలు, అపార్ట్మెంట్స్ లను టార్గెట్ చేసుకొని పగటి సమయంలో షేరింగ్ ఆటోలో తిరుగుతూ పరిశీలన చేస్తారు. ఈ ముఠా సభ్యులు రాత్రి సమయంలో మెయిన్ గేట్ నుంచి రాకుండా కాంపౌండ్ వాల్ దూకి ఇంటి మెయిన్ డోర్ కొడతారు. డోర్ తీసిన తర్వాత ఇంట్లో ఉన్న వ్యక్తులను కొట్టి, కొన్ని సందర్భాల్లో చంపి కూడా ఇళ్లలో ఉన్న బంగారం నగలు ఇతర విలువైన వస్తువులు దోచుకొని వెళ్తారు.
కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మీరందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎవరైనా రాత్రి పూట తలుపు తడితే ఎట్టి పరిస్థితుల్లో మీరు తలుపు తీయకుండా డయల్ 100 ద్వారా వనస్థలిపురం పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలి. వచ్చిన వ్యక్తుల్ని కిటికీలోంచి చూసి మీ కాలనీవాసులను అప్రమత్తం చేయాలి. అలాగే మీ కాలనీలో వేరే ప్రదేశం నుంచి వచ్చిన వింత వ్యక్తులు అనుమానంగా ఎవరైనా వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసు వారికి డయల్ 100 నెంబర్ ద్వారా సమాచారం ఇవ్వగలరు. అలాగే ఈ కింది పోలీస్ ఆఫీసర్స్ నెంబర్ లకి కూడా సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి’’ అని వనస్థలిపురం పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఫోన్ నెంబర్లు ఇవీ
8712662300
8712662637 (వనస్తలిపురం పోలీస్ స్టేషన్ )
8712662279
8712662281