అన్వేషించండి

Nature Index Rank: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే నెంబర్ వన్ - నేచర్ ఇండెక్స్ ర్యాంకులో టాప్

Nature Index Rank: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నేషనల్ ఇండెక్స్ ర్యాంకులో సత్తా చాటింది. దేశంలో విశ్వవిద్యాలయాల కేటగిరీలో ప్రథమ స్థానం దక్కించుకోగా.. మొత్తం మీద 16వ స్థానాన్ని చేజిక్కించుకుంది. 

Nature Index Rank: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నేషనల్ ఇండెక్స్ ర్యాంకు (Nature Index Rank)ల్లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకొని సత్తా చాటింది. దేశంలో యూనివర్సిటీల కేటగిరీలో University of Hyderabad తొలి స్థానాన్ని సంపాదించుకుంది. మొత్తం మీద 16వ స్థానం సాధించింది. 72 పరిశోధన పత్రాల సంఖ్య, 19.46 షేర్ తో ఆ స్థానం దక్కించుకున్నట్లు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ బీజే రావు తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ 2021 సంవత్సరం నుండి 31వ తేదీ మార్చి 2022 వరకు తీసుకున్న సమాచారం ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు. కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్, ఎర్త్ & ఎన్విరాన్మెంట్ సైన్సెస్ అలాగే ఫిజికల్ సైన్సెస్ లో ప్రచురితమైన పరిశోధన ఆర్టికల్స్ ఆధారంగా నేచర్ ఇండెక్స్ ర్యాంక్ సర్వే జరిగింది. 

తెలుగు రాష్ట్రాల నుంచి పలు విద్యా సంస్థలు.. 
ఈ ర్యాంకుల్లో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తొలి స్థానంలో నిలిచింది. ఈ సంస్థ ఆచార్యులకు చెందిన 194 పరిశోధన పత్రాలు నేచర్ జర్నల్ లో ప్రచురితం అయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పలు విద్యా సంస్థలు కూడా నేషనల్ ఇండెక్స్ ర్యాంకులో చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ హైదరాబాద్ కు 23వ ర్యాంకు, ఐసెర్ తిరుపతికి 26వ ర్యాంకు, అమిటీ యూనివర్సిటీకి 54వ ర్యాంకు, నైపర్ హైదరాబాద్ కు 76వ ర్యాంకు, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కు 82వ ర్యాంకు, ఆంధ్రా యూనివర్సిటీకి 92వ ర్యాంకు, జేఎన్టీయూ కాకినాడకు 108వ ర్యాంకు, ఐఐటీ తిరుపతికి 122వ ర్యాంకు వచ్చింది. 

ఉన్నత విద్య, పరిశోధనలకు.. 
హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని భారత పార్లమెంట్ చట్టం ద్వారా కేంద్ర విశ్వ విద్యాలయంగా మార్చారు. ఆ తర్వాత హైదరాబాద్ విశ్వ విద్యాలయంగా నామకరణం చేశారు. అయితే ఉన్నత విద్యకు, పరిశోధనలకు ఈ విశ్వ విద్యాలయం దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థగా ఎదిగింది. వేలాది మంది ఇక్కడ చదువుకొని ఉన్నత స్థానాల్లో కొలువులు చేస్తున్నారు. ఉన్నత విద్య, పరిశోధనలకు హెచ్ సీయూ పెట్టింది పేరు. 2012వ సంవత్సరంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ అండ్ టెక్నాలజీలో దేశంలోనే ఏడవ ర్యాంకు సాధించింది. 

ప్రశంసా పత్రంతో పాటు లక్ష రూపాయల నగదు.. 
అంతే కాదండోయ్ ఉన్నత విద్యలో అత్యుత్తమ ఫలితాలను సాధించేలా కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. విజిటర్స్ అవార్డులను నెలకొల్పారు. దేశంలోని ఉత్తమ వర్సిటీలతో పాటు నూతన ఆవిష్కరణలకు సంబంధించి ఈ విజిటర్స్ అవార్డులను ప్రదానం చేసేవారు. ఉత్తమ వర్సిటీకి ప్రశంసా పత్రంతో పాటు పరిశోధనలకు లక్ష రూపాయల చొప్పున నగదును అందజేస్తారు. హెచ్‌సీయూలో రతన్ టాటా ఆధ్వర్యంలో రంగస్థల కళల శాఖకు సంబంధించి థియేటర్ ఔట్ రీచ్ యూనిట్ ను నెలకొల్పారు. అలాగే ఇక్కడ ఇందిరా గాంధీ స్మారక గ్రంథాలయాన్ని 1988 అక్టోబర్ 21 నుంచి ప్రారంభించారు. ఈ రెండూ అక్కడ చదువుకునే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు పలు రంగాలలో కీలక పదవులలో కొనసాగుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget