News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Outer Rail Project: హైదరాబాద్‌కి క్రేజీ ప్రాజెక్టు, ఔటర్ రైలు ప్రాజెక్టు ప్రకటించిన కిషన్ రెడ్డి

బుధవారం (జూన్ 28) ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇప్పటికే హైదరాబాద్ కు ప్రకటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ తో పాటు ఈ  ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు వల్ల హైదరాబాద్‌కు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు.

FOLLOW US: 
Share:

హైదరాబాద్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్రేజీ ప్రాజెక్టును ప్రకటించారు. హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రైలు ఏర్పాటుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టు సర్వే కోసమే రూ.14 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు. బుధవారం (జూన్ 28) ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇప్పటికే హైదరాబాద్ కు ప్రకటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ తో పాటు ఈ  ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు వల్ల హైదరాబాద్‌కు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు సమాంతరంగా రైల్వే ప్రాజెక్ట్‌ ఉంటుందని అన్నారు.

ఈ  తరహా ప్రాజెక్టు దేశంలోనే మొట్టమొదటిది అని కిషన్ రెడ్డి చెప్పారు. రైలు కనెక్టివిటీ లేని ప్రాంతాలకు ఔటర్ రైలు లైన్ ద్వారా మేలు జరుగుతుందని తెలిపారు. దాదాపు 350 కిలో మీటర్ల ఆర్ఆర్ఆర్ రోడ్డు రాష్ట్రంలోని చాలా జిల్లాలను కలుపుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రూ.26 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు. భూసేకరణకు 50 శాతం ఖర్చు కేంద్రమే భరించడానికి రెడీగా ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని అన్నారు. ఇందులో భాగంగా భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించామని అన్నారు. రైలు మార్గం ఎలా ఉండాలనే దానికి 99శాతం ఆమోదం లభించిందని చెప్పారు. MMTS రెండో దశలో భాగంగా దీనిని పూర్తి చేయాలని చెప్పామని అన్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశకు రూ.330 కోట్ల కేటాయింపుతో పాటు, కేంద్ర నిధులతో ఘట్‌కేసర్‌-రాయగిరి వరుకు ఎంఎంటీఎస్‌ రైలు ఏర్పాటు చేయనున్నారు.

బండి సంజయ్ మార్పుపైనా క్లారిటీ

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై జరుగుతున్న ప్రచారంపై కూడా కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడి మార్పు ఏమీ ఉండబోదని, అలాంటి నిర్ణయాలు అధిష్ఠానం తీసుకోలేదని చెప్పారు. ఈ అంశంలో ఎవరూ గందరగోళంలో లేరని, మీడియానే వార్తలు ప్రసారం చేస్తూ గందరగోళం సృష్టిస్తుందని అన్నారు. ఇలాంటి వార్తలు ఎందుకు వచ్చాయో తమకు తెలియదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు నెలలు మాత్రమే ఉన్నందున కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం లేదని, ఆ దిశగా ఆలోచన కూడా చేయడం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు అధిష్టానం ఎలాంటి మార్పులు చేయబోదని కిషన్ రెడ్డి చెప్పారు.

Published at : 28 Jun 2023 05:37 PM (IST) Tags: Kishan Reddy G Kishan reddy Hyderabad Outer Ring Road outer rail project

ఇవి కూడా చూడండి

TS CM Revanth Reddy Oath ceremony : వీళ్లే రేవంత్ టీం- రాజ్‌భవన్‌కు వివరాలు అందజేత 

TS CM Revanth Reddy Oath ceremony : వీళ్లే రేవంత్ టీం- రాజ్‌భవన్‌కు వివరాలు అందజేత 

Hyderabad News: హైదరాబాద్‌ పురుషుల్లో ఈ సమస్య అధికం- నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో సంచలన రిపోర్ట్‌

Hyderabad News: హైదరాబాద్‌ పురుషుల్లో ఈ సమస్య అధికం- నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో సంచలన రిపోర్ట్‌

Revanth Team: రేవంత్‌తోపాటు ప్రమాణం చేసేది ఎవరు? ఇంకా వీడని సస్పెన్స్‌

Revanth Team: రేవంత్‌తోపాటు ప్రమాణం చేసేది ఎవరు? ఇంకా వీడని సస్పెన్స్‌

Revanth Reddy First Signature: ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ పెట్టే తొలి సంతకం ఇదే

Revanth Reddy First Signature: ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ పెట్టే తొలి సంతకం ఇదే

Revath Reddy Schedule Today: నేడే సచివాలయానికి రేవంత్ రెడ్డి - సాయంత్రానికి సీఎంగా బాధ్యతల స్వీకరణ

Revath Reddy Schedule Today: నేడే సచివాలయానికి రేవంత్ రెడ్డి - సాయంత్రానికి సీఎంగా బాధ్యతల స్వీకరణ

టాప్ స్టోరీస్

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Hi Nanna Review - హాయ్ నాన్న ఆడియన్స్ రివ్యూ : నాని అంత ఏడిపించేశాడా? కర్చీఫ్, టవల్స్ తీసుకువెళ్లక తప్పదా? 

Hi Nanna Review - హాయ్ నాన్న ఆడియన్స్ రివ్యూ : నాని అంత ఏడిపించేశాడా? కర్చీఫ్, టవల్స్ తీసుకువెళ్లక తప్పదా? 

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

బేగంపేట ఎయిర్ పోర్టులో రేవంత్ కు ఘన స్వాగతం, రాత్రి గచ్చిబౌలిలో బస

బేగంపేట ఎయిర్ పోర్టులో రేవంత్ కు ఘన స్వాగతం, రాత్రి గచ్చిబౌలిలో బస