TSRTC: RRR ప్రచారంలో సజ్జనార్, ఈ రేంజ్ వాడకం ఎప్పుడూ చూసి ఉండరు
TSRTC, RRR Movie: RRR సినిమాను కూడా టీఆర్ఎస్ ఆర్టీసీకి ప్రచారంగా వాడుకున్నారు. RRR నుంచి తాజాగా విడుదలైన ‘ఎత్తర జెండా’ పాటను ఎంచుకున్నారు.
TSRTC Publicity Strategy: తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) సంస్థ ట్రెండ్‌కు తగ్గట్లుగా ముందుకు పోతోంది. మూస పద్ధతిలో అవగాహన కార్యక్రమాలు, ప్రకటనలు ఇవ్వడం ఎప్పుడో మానేసి నవతరం అభిరుచులకు అనుగుణంగా ప్రచార చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. అది కూడా ఉచితంగానే. యువతలో బాగా క్రేజ్ ఉన్న సినిమానో, లేదా నటుడినో లేదా అంశాన్నో ప్రచారాస్త్రంగా వాడేస్తోంది. ఆర్టీసీకి ఎండీగా సజ్జనార్ (VC Sajjanar) నియామకం జరిగినప్పటి నుంచి ఈ ప్రచారాల పంథా పూర్తిగా మారిపోయింది. టీఎస్ఆర్టీసీని (TSRTC) ఎలాగైనా లాభాల బాట పట్టించాలని కంకణం కట్టుకున్న సజ్జనార్ (Sajjanar) ఆ దిశగా ప్రచార వ్యూహాలు అమలు చేస్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జనాల్ని ఆకట్టుకొనేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యాల్ని కూడా కల్పిస్తున్నారు.
తాజాగా RRR సినిమాను కూడా టీఆర్ఎస్ ఆర్టీసీకి ప్రచారంగా వాడుకున్నారు. RRR నుంచి తాజాగా విడుదలైన ‘ఎత్తర జెండా’ పాటను ఎంచుకున్నారు. ఆ పాటను టీఎస్ఆర్టీసీకి అన్వయిస్తూ.. పబ్లిసిటీ చేశారు. అసలు RRR Movie టైటిల్ అర్థాన్నే మార్చేసి ఆర్టీసికి అదిరిపోయే పబ్లిసిటీ తెచ్చేశారు. RRR అంటే ‘రాష్ట్ర రోడ్డు రవాణా’ అంటూ సరికొత్త అర్థాన్ని ఇచ్చారు.
‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ అనే పాట సమయంలో పైకి ఎత్తే జెండాపై ‘వందేమాతరం’ (Vandemataram) అని ఉంటుంది. కానీ సజ్జనార్ చేసిన ట్వీట్‌లో ప్రచార చిత్రంలో మాత్రం ‘వందేమాతరం’ స్థానంలో టీఎస్ఆర్టీసీ (TSRTC) లోగో, బస్సు గుర్తులు ఉన్నాయి. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ ట్వీట్‌ను చూసి వేర్వేరు కామెంట్లు చేస్తున్నారు. ఆర్టీసీని బలోపేతం చేయడానికి సజ్జనార్ చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నారు.
మొన్నటికి మొన్న దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ‘పుష్ప’ (Pushpa Movie) సినిమాను, నిన్న రాధేశ్యామ్ (Radhesyam Movie) సినిమాను కూడా టీఎస్ఆర్టీసీ పబ్లిసిటీకి ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సినీ జనం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న Movie RRR తోనూ అదే తరహాలో ప్రచారం చేశారు.
#TSRTC is at the Service of Public #RRR - రాష్ట్ర రోడ్డు రవాణా #TSRTCPublicService #EtharaJenda @TSRTCHQ @baraju_SuperHit @MilagroMovies @tarak9999 @ssrajamouli @AlwaysRamCharan @TarakFans @Chiru_FC @worldNTRfans @NTR2NTRFans @RRRMovie @AlwaysCharan_FC @TrackTwood @TV9Telugu pic.twitter.com/XybL6SDQWt
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 15, 2022