News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

శ్రమకు దక్కిన గౌరవం- టీఎస్‌ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనంపై టిఎస్ ఆర్టీసి, ఎండీ హర్షం

తెలంగాణ ఆర్టీసి రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఆర్టీసీ ఎండీ, ఛైర్మన్ ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యోగుల శ్రమకు ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ ఆర్టీసి రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడంపై టిఎస్ ఆర్టీసి చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్‌ ఎంతో గొప్ప మనస్సని, ఎప్పట్నుంచి బాధల్లో, కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన గొప్ప వరం అందించారని పొగడ్తలతో వర్షం కురింపించారు. ఇన్నాళ్ల ఉద్యోగుల కష్టాలన్నీ ఒకేసారి పోగొట్టారని తెలిపారు బాజిరెడ్డి.

కేబినెట్‌ సమావేశం తరువాత బాజిరెడ్డి మీడియాతో మాట్లడుతూ గత కొంతకాలంగా ఆర్టీసీ కార్మికులు ఎంతో మనోవేదనకు గురవుతున్నారన్నారని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినా సొంత రాష్ట్రంలో సముచిత స్థానం దక్కలేదని అన్నారు. ఏపీలో ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఉన్నారనే భావన వారిలో ఉండేదని గుర్తు చేశారు. ఇవాళ కేసీఆర్ ముందు రెండు డిమాండ్లను తాను పెట్టానని, ఒకటి.. వెయ్యి కోట్ల నిధి గ్యారెంటీని కల్పిస్తే పీఎఫ్‌ చెల్లించి వారికి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ మంచిగా దక్కేలా చూడాలని రెండు పీఆర్‌సీ చెల్లించాలని కోరామన్నారు. కానీ ఇవన్నీ తలకిందులు చేస్తూ కేసీఆర్‌ ఏకంగా కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడంతో అందరి కోరిక నెరవేరిందని, ఇది ఎంతో పెద్ద మనస్సుతో ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్‌ ఇచ్చిన వరమని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 43వేల మంది కుటుంబాల్లో ఆయన వెలుగులు నింపారని, మేమంతా ఎప్పటికీ ఆయన చేసిన మేలును మరిచిపోమన్నఆర్టీసి చైర్మెన్ బాజిరెడ్డి ఉద్యోగుల పక్షాన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఓ వైపు కార్పొరేషన్లను అమ్ముకుంటూ ఉద్యోగులను నడిబజార్‌లో పడేస్తుంటే.. కేసీఆర్‌ మాత్రం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారనడానికి చెప్పడానికి  నిదర్శనమే తాజాగా విలీనం నిర్ణయం అన్నారు. ఆర్టీసి కార్మికులను ప్రభుత్వంలో చేర్చుకోవడం చిన్న విషయం కాదని, ఈ నిర్ణయం దేశానికే ఆదర్శమన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, తాను ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తు చేశారు.

ఉద్యోగులకు కొంత మేలు చేయగలిగామన్నారు బాజిరెడ్డి. కానీ లాభాల బాట పట్టించలేకపోయామని, కొంత నష్టాన్ని నివారించగలిగామని, ఇప్పుడు కేసీఆర్ నిర్ణయంతో ఇక ఉద్యోగుల కష్టాలకు శాశ్వత పరిష్కారం దొరికిందని అన్నారు. ఈ నిర్ణయాన్ని యావత్ రాష్ట్ర, దేశ ప్రజలు కూడా హర్షిస్తున్నారని అన్నారు బాజిరెడ్డి. ఏపీ ప్రభుత్వం అక్కడ తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో కమిటీ ద్వారా అధ్యయనం చేసి అంతకన్నా మెరుగైన లబ్ది చేకూరేలా ఇక్కడ నిర్ణయాలు అమలు చేస్తామన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లు పాస్‌ చేసి ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేర్చుతామని, వారి ఉద్యమ స్పూర్తికి కానుకగా దీన్ని అందిస్తామన్నారు చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినేట్‌ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని ట్విట్టర్ వేదికగా స్పందించారు ఆర్టీసి ఎండీ సజ్జనార్. సంస్థలోని దాదాపు 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం ఇదని, ఎన్నో ఏళ్లుగా నిబద్దతతో పనిచేస్తోన్న సిబ్బంది శ్రమను గుర్తించి.. వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నరాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు.సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నిర్ణయంతో సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి, ప్రజా రవాణా వ్యవస్థను తెలంగాణలో మరింతగా ప్రజలకు చేరువ చేస్తారని ఆశిస్తూనంటూ ట్విట్ చేసారు సజ్జనార్.

Published at : 01 Aug 2023 10:36 AM (IST) Tags: Bajireddy Govardhan CM KCR TSRTC Sajjanar

ఇవి కూడా చూడండి

PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్

తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్

Bandi sanjay on BRS: ప్రధాని టూర్‌తో ప్రగతిభవన్‌లో ప్రకంపనలు- బీఆర్ఎస్‌లో చీలిక ఖాయమన్న బండి సంజయ్‌

Bandi sanjay on BRS: ప్రధాని టూర్‌తో ప్రగతిభవన్‌లో ప్రకంపనలు- బీఆర్ఎస్‌లో చీలిక ఖాయమన్న బండి సంజయ్‌

Mega Dairy Project: పాడి రంగంలో మెగా ప్రాజెక్టు, రేపు కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం

Mega Dairy Project: పాడి రంగంలో మెగా ప్రాజెక్టు, రేపు కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం

Inter Admissions: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!

Inter Admissions: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!

టాప్ స్టోరీస్

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్