By: ABP Desam | Updated at : 22 Mar 2023 10:46 AM (IST)
గోడలకు అంటించిన వాల్ పోస్టర్లు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు (టీఎస్పీఎస్సీ) చెందిన పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారంలో మరింత వేడి రాజుకుంటోంది. విపక్షాలకు చెందిన కొంత మంది కమిషన్ పని తీరును ఎండగడుతున్నారు. ఏకంగా గోడలకు పోస్టర్లు అంటించి మరీ నిరసన తెలియజేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ ఆఫీసు వద్ద వివాదాస్పద రీతిలో గోడకు అంటించిన వాల్ పోస్టర్లు వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. టీఎస్పీఎస్సీ జిరాక్స్ సెంటర్ అని ఎద్దేవా చేస్తూ ఆ పోస్టర్లలో ఉంది. నాంపల్లిలో టీఎస్పీఎస్సీ కార్యాలయం సమీపంలోనే కొంత మంది ‘టీఎస్పీఎస్సీ జిరాక్స్ సెంటర్’ అని ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.
‘టీఎస్పీఎస్సీ జిరాక్స్ సెంటర్’ ఇక్కడ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ పత్రాలు లభించును అంటూ ఎగతాళి చేస్తూ పలు డిమాండ్లతో ఓయూ జేఏసీ సభ్యులు పోస్టర్లు అతికించారు. ఇది ఉద్యోగ నియామక కార్యాలయం కాదు.. జిరాక్స్ సెంటర్ అని వాల్ పోస్టర్లలో ముద్రించారు.
"ముఖ్యమంత్రి.. మీరు తక్షణమే తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి.. ప్రశ్నపత్రాల లీకేజీలో మీ కుటుంబ సభ్యుల పాత్రలేదని చెప్పడానికి వెంటనే కేసును సీబీఐకి అప్పగించి టీఎస్పీఎస్సీ బోర్డును, సంబంధిత శాఖ మంత్రిని భర్తరఫ్ చేయండి. నష్టపోయిన విద్యార్థులకు ఈ నెల నుంచి నెలకు రూ.10 వేల చొప్పున మళ్లీ పరీక్ష నిర్వహించే వరకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి" అని గోడలకు అతికించిన పోస్టర్లలో డిమాండ్ చేశారు.
TSPSC: నేడే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
TSPSC HO Exam Halltickets: జూన్ 11 నుంచి హార్టికల్చర్ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?
TSPSC Group 1 Exam: వారికీ గ్రూప్-1 హాల్‌టికెట్లు ఇవ్వండి, టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు!
TS Group-1: రేపే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట
Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే
Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!
IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!
Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!