News
News
X

సీఎం కేసీఆర్‌తో టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ భేటీ- కీలక నిర్ణయం ఉంటుందా?

తెలంగాణ ముఖ్యమంత్రితో టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

FOLLOW US: 
Share:

తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం... దాని తర్వాత పలు పోటీ పరీక్షలు రద్దు చేయడం జరింది. ఇది రాష్ట్రంలో తీవ్ర దుమారాన్నే రేపుతోంది. ప్రతిపక్షాలు విమర్సలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు పరీక్షల రద్దుతో ఉద్యోగార్థులు కూడా తీవ్ర గందరగోళం ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 

భవిష్యత్ చర్యల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కీలక సమావేశం ఏర్పాటు చేసారు. దీనికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ జనార్ధన్ రెడ్డి సహా  పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ అధికారులతోపాటు మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. 

ఈ కీలక భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకన్నారు. ఇప్పటికే గ్రూప్‌ వన్ లాంటి పరీక్ష రాసిన వేల మంది అభ్యర్థులు తర్వాత దశ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు. ఇందులో లీకేజీతో సంబందం లేకుండా రాత్రిపగలు చదివి మంచి మార్కులు తెచ్చుకొన్ని అర్హత సాధించిన వాళ్లుు  ఉన్నారు. ఇప్పుడు పరీక్ష రద్దుతో వాళ్లు కూడా నష్టపోయారు. ఇలా చాలా మందికి అన్యాయం జరగుతుంది. అలాంటి వారికి ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వనుంది అనేది ఇప్పుడు ముందున్న టాస్క్

దీంతో పాటు ఒకసారి లీకేజీ ఆరోపణలు వచ్చిన తర్వాత భవిష్యత్‌లో ఎలాంటి లీకేజీ బెడద లేకుండా తీసుకునే చర్యలపై కూడా చర్చ నడుస్తోంది. ఇప్పటికే పరీక్ష విధానంపై చాలా అయోమయం ఉంది. ఇలాంటి టైంలో ఒక్కరు చేసిన తప్పునకు లక్షల మంది బలి అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అందుకే మరోసారి ఇలాంటివి రీపీట్ కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాల్సిన బాధ్యత ఉంది. దానిపై ఏమైనా ఆలోచిస్తున్నారా అనేది తేలాలి. 

మొత్తానికి ఈ భేటీలో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఏమైన చర్యలు తీసుకుంటారా లేకుంటే నివేదిక ఇచ్చి సరిపెట్టేస్తారా అనేది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న అంశం. 

లీకేజీ ఆరోపణలతో గ్రూప్ వన్ రద్దు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసినట్లు ప్రకటించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌తోపాటు డీఏవో, ఏఈఈ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను ఈ ఏడాది జూన్ 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పేపర్ లీకేజీ కారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు. ఇవికాకుండా త్వరలో నిర్వహించనున్న మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో 80,039 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆ దిశగా నియామక సంస్థలు శరవేగంగా పనిచేస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ ఇప్పటి వరకు 17,136 ఉద్యోగాల భర్తీకి 26 నోటిఫికేషన్లు ఇచ్చింది. అందులో ఇప్పటికే ఏడు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయి. మార్చి 5న అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్ష జరుగగా, ప్రశ్నపత్రం లీకేజీ ఘటనతో ఆ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మార్చి 12న జరగాల్సిన టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ (టీపీబీవో); మార్చి 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాలను కూడా వాయిదా వేసినట్టు ప్రకటించింది. ఏప్రిల్‌ 4 నుంచి జరగాల్సిన పరీక్షలన్నీ యథావిధిగా షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది..

Published at : 18 Mar 2023 11:50 AM (IST) Tags: TSPSC Group 1 TSPSC Chairman TSPSC Paper Leakage TSPSC Paper Leak Row

సంబంధిత కథనాలు

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి  బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Revanth Reddy : సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, గ్రూప్ 1 టాప్ స్కోరర్స్ జాబితాతో విచారణకు రేవంత్ రెడ్డి!

Revanth Reddy : సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, గ్రూప్ 1 టాప్ స్కోరర్స్ జాబితాతో విచారణకు రేవంత్ రెడ్డి!

TSPSC Paper Leak: 'ఓఎంఆర్' విధానానికి టీఎస్‌పీఎస్సీ గుడ్‌బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే!

TSPSC Paper Leak: 'ఓఎంఆర్' విధానానికి టీఎస్‌పీఎస్సీ గుడ్‌బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే!

వివేక హత్య కేసులో గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ పిటిషన్- విచారణ 29కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

వివేక హత్య కేసులో గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ పిటిషన్- విచారణ 29కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

టాప్ స్టోరీస్

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !