News
News
వీడియోలు ఆటలు
X

నెల రోజుల భక్తి యాత్ర- నిద్రాహారాలు లేక నరకయాతన - పేపర్ లీక్‌ కేసులో ఈ జంట స్టోరీయే వేరు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌ కేసులో ఎక్కడ దొరికిపోతామో అని భయపడిపోయారు. నెలరోజుల పాటు దేవాలయాలు తిరిగారు. చివరకు అరెస్టు అయ్యారు.

FOLLOW US: 
Share:

చేసిన తప్పు ఎవర్నీ కుదురుగా ఉండనివ్వదు. వారిది అదే పరిస్థితి. వాళ్లే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో నిందితులు. ప్రధాన నిందితులతో చేతులు కలిపి పేపర్ తీసుకున్న పాపానికి నెల రోజుల పాటు నిద్రలేకుండా జాగారం చేశారు. గుడులు గోపురాలు సందర్శించారు. కనిపించిన దేవుడిని మొక్కారు. తమను ఈ గండం నుంచి గట్టెక్కించాలని వేడుకున్నారు. అయినా పాపం పండింది. కటకటాలు లెక్కించాల్సి వచ్చింది. 
తెలంగాణ పబ్లిష్ సర్వీస్ కమిషన్  పేపర్ లీకేజీ కేసు నిందితుల్లో సుస్మిత, లౌకిక్‌ కూడా ఉన్నారు. సుస్మిత సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్. గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చాక ఉద్యానికి రాజీనామా చేసి ప్రిపేర్ అయ్యారు. గ్రూప్‌-1 రాశారు. అయితే ఆమె చేసిన చిన్న తప్పిదం కారణంగా గ్రూప్‌ వన్ రిజల్ట్ రాలేదు. ఆమె రిజల్ట్‌ను విత్‌హెల్డ్‌లో పెట్టారు. బాగా రాశానన్న కాన్ఫిడెన్స్‌తో పలుమార్పు టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌కు వెళ్లి తన రిజల్ట్ రాకపోవడానికి, చేసిన తప్పు సరిచేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. 

గ్రూప్ వన్ రిజల్ట్స్‌ విషయం మాట్లాడటానికి వెళ్లిన సుస్మిత, ఆమె భర్త లౌకిక్‌కు అక్కడే పరిచయమయ్యాడు ప్రవీణ్. ఆమె డివిజినల్ అకౌంట్స్‌ ఆఫీసర్ పరీక్ష కూడా రాస్తున్నట్టు గ్రహించాడు. అంతే సైలెంట్‌గా వారితో బేరం పెట్టాడు. రాబోయే పరీక్షకు సంబంధించిన పేపర్ తనవద్ద ఉందని.. చెప్పి డబ్బులు వసూలు చేశాడు. వీళ్ల మధ్య ఆరు లక్షలకు బేరం కుదిరింది. 

భార్య సుస్మిత కోసం ప్రవీణ్‌కు ఆరులక్షలు ఇచ్చాడు లౌకిక్‌. పరీక్షను విజయవంతంగా రాశారు సుస్మిత. గ్రూప్ -1 రిజల్ట్ వచ్చినా రాకున్నా డీఏఓ ఉద్యోగం మాత్రం వస్తుందని సంతోషంగా ఉన్నారు. ఇంతలో పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ న్యూస్ చూసిన సుస్మిత, లౌకిక్‌ గుండెళ్లో రాయిపడ్డట్టు అయింది. రోజుకొకర్ని అరెస్టు చేయడం... ప్రవీణ్‌తో జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఫోన్ సంభాషణల ఆధారంగా కేసు సీరియస్ అవుతండటంతో వారిలో టెన్షన్ మరింత పెరిగింది. 

చేసింది తప్పని దొరికిపోతున్నామని భయం పట్టుకుంది సుస్మిత, లౌకిక్‌. అంతే తిరుపతి నుంచి షిర్డీ వరకు కనిపించన ఆలయాలకు వెళ్లారు. నెలరోజుల పాటు నిద్రాహారాలు లేకుండా తమను రక్షించాలని దేవుణ్ని వేడుకున్నారు. ఎన్ని మొక్కులు చెల్లించుకున్నా.. మరిన్నె ముడుపులు కట్టినా వారి వృతాలు, పూజలు ఫలించలేదు. చివరకు ప్రవీణ్‌తో జరిపిన లావాదేవీలు, సంబాషణలు, చాటింగ్ ఆధారంగా సుస్మిత, లౌకిక్‌ను ఐదు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. 

Published at : 12 Apr 2023 09:57 AM (IST) Tags: Telangana News Khammam TSPSC Paper Leak Pravin Kumar

సంబంధిత కథనాలు

3D Printed Temple: ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ టెంపుల్, ఎక్కడో కాదు మన దగ్గరే

3D Printed Temple: ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ టెంపుల్, ఎక్కడో కాదు మన దగ్గరే

TSPSC Group1: 'గ్రూప్-1' పరీక్షపై మళ్లీ హైకోర్టుకెక్కిన అభ్యర్థులు, దర్యాప్తు పూర్తయ్యేదాకా వద్దంటూ విజ్ఞప్తి!

TSPSC Group1: 'గ్రూప్-1' పరీక్షపై మళ్లీ హైకోర్టుకెక్కిన అభ్యర్థులు, దర్యాప్తు పూర్తయ్యేదాకా వద్దంటూ విజ్ఞప్తి!

Minister KTR: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ - ఆందోళనలో కొందరు నేతలు!

Minister KTR: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ - ఆందోళనలో కొందరు నేతలు!

Hayathnagar Murder Case: హయత్‌నగర్ రాజేశ్, సుజాత మృతి కేసులో వీడిన మిస్టరీ, ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు

Hayathnagar Murder Case: హయత్‌నగర్ రాజేశ్, సుజాత మృతి కేసులో వీడిన మిస్టరీ, ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు

Hyderabad News: బొల్లారం అరబిందో కంపెనీలో లీకైన గ్యాస్ - ముగ్గురికి తీవ్ర అస్వస్థత

Hyderabad News: బొల్లారం అరబిందో కంపెనీలో లీకైన గ్యాస్ - ముగ్గురికి తీవ్ర అస్వస్థత

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !