By: ABP Desam | Updated at : 18 Mar 2023 02:17 PM (IST)
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌లో బీజేపీ పాత్రపై అనుమానం- కేటీఆర్ సంచలన కామెంట్స్
TSPC Paper Leak :ఇద్దరు వ్యక్తులు చేసిన పొరుపాటు కారణంగానే మొత్తం వ్యవస్థ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు మంత్రి కేటీఆర్. సీఎంతో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ భేటీ, సమీక్ష జరిగిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. TSPSC పేపర్ లీకేజీలో బీజేపీ పాత్రపై కూడా అనుమానం ఉందన్నారు. ఇప్పుడు స్కామ్‌లో దొరికిన నిందితుల్లో ఏ2గా ఉన్న వ్యక్తి బీజేపీ క్రియాశీల కార్యకర్త అని చెప్పారు. దానికి సంబంధించిన ఫొటోలు విడుదల చేశారు.
తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక 150నోటిఫికేషన్ ఇచ్చామని...ఏక కాలంలో 10లక్షల మందికి TSPSC పరీక్ష నిర్వహించిందన్నారు. సాంకేతికంగా అనేక నిర్ణయాత్మక మార్పులు జరిగాయని వివరించారు. ఇక్కడ మార్పులు పరిశీలించేందుకు UPSC ఛైర్మెన్ కూడా రెండుసార్లు వచ్చారని గుర్తు చేశారు.
దేశం మొత్తంలో అత్యధికంగా ఉద్యోగాల కల్పన చేసిన సంస్థ తమ టీఎస్‌పీఎస్సీ అని తెలిపజేశారు కేటీఆర్. ఇంత వరకు ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. ఇప్పడు వచ్చిన స్కామ్‌లో బీజేపీ కుట్ర దాగుందనే అనుమానాలు ఉన్నాయన్నారు. నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి బీజేపీ క్రియాశీలక కార్యకర్తగా చెప్పుకొచ్చారు. దీనిపై లోతైన దర్యాప్తు చేయాలని డీజీపీకి రిక్వస్ట్ చేశారు కేటీఆర్.
పేపర్ లీకేజ్ వెనుక ఏ పార్టీ, ఏ నేతలు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు కేటీఆరర్. అయితే ఇద్దరు వ్యక్తుల కారణంగా లక్షల మంది అభ్యర్థులు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. దీనికి చాలా బాధపడుతున్నట్టు చెప్పారు కేటీఆర్. మళ్ళీ ఇలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి చర్యలు తీసుకుంటామన్నారు కేటీఆర్. రద్దు అయిన పరీక్షలకు ఫీజు కట్టిన యువత మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. గతంలో అప్లై చేసుకున్న వాళ్లంతా అర్హులేనన్నారు. పరీక్షల మెటీరియల్ అంతా ఆన్లైన్ లో పెడతామని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. స్టడీ సర్కిల్స్‌ను బలోపేతం చేస్తూ రీడింగ్ రూమ్స్ 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పిల్లలకు భోజన వసతి ఫ్రీగా అందించబోతున్నామన్నారు.
దీనిపై లేని పోని రాద్ధాంతం చేసి అభ్యర్థులను గందరగోళ పరచొద్దని విపక్షాలను కోరారు మంత్రి కేటీఆర్. రాజకీయ నిరుద్యోగులు చేసే ప్రచారం చూసి భయపడవద్దని అభ్యర్థులకు సూచించారు. నోటిపికేషన్స్ వస్తున్నప్పటి నుంచి బీజేపీ చేస్తున్న విమర్సలు ఆ పార్టీ అధ్యక్షుడి ఆరోపణల వల్లే తమకు అనుమానం వస్తుందున్నారు కేటీఆర్
తము లక్ష ఉద్యోగలని చెప్పి 2లక్షల ఉద్యోగ నియామకాలు వేగంగా భర్తీ చేయబోతున్నామన్నారు. రాజకీయ నిరుద్యోగులు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను యువత పట్టించుకోవద్దని సూచించారు. అపోహలు, అనుమానాలు యువత నమ్మొద్దన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంటే బండి సంజయ్ కుట్ర అన్నారని ఈ సందర్భంగా చెప్పారు కేటీఆర్. ప్రభుత్వాని అప్రతిష్టపాలు చేయాలనే కుట్ర ఏమైనా ఉందా అనే అనుమానాలు ఉన్నాయన్నారు.
తెలంగాణ యువతకు నమ్మకం కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు మంత్రి కేటీఆర్. ప్రవీణ్, రాజశేఖర్ వెనకాల ఎవరు ఉన్నా వాళ్ళ పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది సిస్టం ఫెల్యూర్ కాదని... ఇద్దరు వ్యక్తుల స్వార్థం చేసిన తప్పుగా చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకునే భాద్యత తమపై ఉందన్నారు.
ఐటి మినిష్టర్ అయితే రాష్ట్రంలో ఉన్న ప్రతీ కంప్యూటర్‌కు నేనె భాద్యున్నా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఐటి మినిష్టర్ ఏం పనిచేస్తాడో తెలుసా అని నిలదీశారు. పేపర్ లికేజీకి, ఐటి మినిష్టర్‌కు సంబంధం ఏంటని అడిగారు. పేపర్ లీక్ జరిగితే తానెందుకు రాజీనామా చేయ్యాలన్నారు. అసోం, యూపీ, గుజరాత్‌లో పేపర్ లీక్ లు జరిగాయని అక్కడ మంత్రులు రాజీనామాలు చేశారా అని క్వశ్చన్ చేశారు. పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చిన వాళ్లకు కొంత భాధ ఉంటుందని...కానీ ఆరోపణలను నిర్వృతి చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
SSC Exam Hall Tickets: 'టెన్త్' హాల్‌టికెట్లు మార్చి 24న విడుదల, 'బిట్ పేపర్' విషయంలో కీలక నిర్ణయం!
TSPSC Paper Leak SIT : గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 127, 122 మార్కులు- మరో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు అరెస్టు!
Telangana weather report: పగలంతా ఎండలు, సాయం కాలం వానలు - రానున్న ఐదురోజులు తెలంగాణలో వెదర్ ఇలా!
Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి
Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ
Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?
Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు