News
News
X

Telangana: 13 బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు మంత్రుల శంకుస్థాపన, దసరా నాటికి నిర్మాణం పూర్తి

హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన వేల కోట్ల విలువైన స్థలాల్లో బీసీ ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

FOLLOW US: 
Share:

వెనుకబడిన వర్గాల చరిత్రలో ఈరోజు సువర్ణాద్యాయంగా నిలిచిపోనుంది, హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన వేల కోట్ల విలువైన స్థలాల్లో బీసీ ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం 13 బిసి సంఘాలు ఉప్పల్ భగాయత్లో సామూహికంగా నిర్వహించిన భూమి పూజ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి పాల్గొన్నారు. ప్రతీ కుల సంఘ భవనం శిలాఫలకం వద్దకు స్వయంగా వెళ్ళిన మంత్రులు శాస్తోక్త్తంగా పూజలు నిర్వహించి నవధాన్యాలతో భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన బీసీ కుల సంఘాల ప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన బీసీలు, ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభా వేదికగా ప్రసంగించారు.

మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 75 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో ఇంతవరకు ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వెనకబడిన వర్గాలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారే అన్నారు, గతంలో దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిన గుంట జాగ కూడా ఇవ్వలేదని నేడు ఎవ్వరు అడగకుండానే రాజధాని నడిబొడ్డున కోకాపేట, ఉప్పల్ బాగాయత్ లో వేల కోట్ల విలువచేసే 87.3 ఎకరాలు 95 కోట్లను సీఎం గారు కేటాయించారు అన్నారు. ఉప్పల్ భగాయత్లో నేడు 13 కుల సంఘాలకు 18.3 ఎకరాలలో దాదాపు 17 కోట్లతో నిర్మించే భవనాలకు భూమి పూజ చేసుకున్నామన్నారు. మొత్తం ఉప్పల్ బగాయత్లో 22 కులాలకు 38 ఎకరాలు కేటాయించామన్నారు, దసరా నాటికల్లా వీటిలో కార్యకలాపాలు ప్రారంభించుకోవాలని ఆయా సంఘాలకు సూచించారు మంత్రి గంగుల. 

ఈ ఆత్మగౌరవ భవనాలను తమ కులం యొక్క ప్రతిష్ట ఇనుమడించేలా, సంస్కృతి వెళ్లి విరిసేలా డిజైన్లు చేసి నిర్మించుకోవడానికి ఆయా కుల సంఘాలకే సంపూర్ణ అధికారం కూడా సీఎం కేసీఆర్ గారు కల్పించారని గుర్తు చేశారు మంత్రి గంగుల. విశాలమైన స్థలాలు ఇచ్చినందున ప్రతి ఆత్మగౌరవ భవనంలో దూర ప్రాంతాలకు వచ్చే వారికి వసతి, తమ సంస్కృతి తెలిసేలా కమ్యూనిటీ హాళ్లు, పిల్లలు చదువుకోవడానికి లైబ్రరీలు, రిక్రియేషన్ సెంటర్లు తదితర అన్ని సదుపాయాలు సమకూర్చుకోవాలన్నారు. వీటిలో రోడ్లు తాగునీరు మురుగునీరు కరెంటు వంటి మోలుక సదుపాయాలని సైతం ప్రభుత్వమే కల్పిస్తుంది అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం చేపట్టిన అది బీసీలకు అత్యధిక మేలు చేసే విధంగానే రూపొందిస్తుందని, కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, గురుకులాలు ఇలా ప్రతి ఒక్కదాంట్లో బీసీల వాటాను సగర్వంగా తీసుకుంటున్నామన్నారు మంత్రి గంగుల. గతంలో కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉంటే నేడు 310 గురుకులాలకు పెంచామన్నారు. వెనుకకు నెట్టేయబడ్డ వర్గాలను అభివృద్ధిలోకి తెస్తూ వారికి ఆత్మగౌరవం కల్పిస్తూ మన కడుపు నిండేలా చేస్తున్న ముఖ్యమంత్రి గారికి దీవనార్థులు ఇవ్వాలని చల్లగా నిండు నూరేళ్లు బతకాలని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని కోరారు మంత్రి గంగుల కమలాకర్. ఈనెల ఏడో తారీఖున కోకాపేట్లో ఆత్మగౌరవ భవనాలకు సామూహిక భూమిపూజలు నిర్వహిస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్.

ఇదే కార్యక్రమంలో మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అకుంఠిత దీక్షా, కఠోర శ్రమతో నేడు ఆత్మగౌరవ భవనాల కార్యరూపం దాలుస్తున్నాయన్నారు. ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా కోట్లాది రూపాయల విలువైన భూమి, కోట్ల రూపాయల నగదు అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కే దక్కుతుందన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కుల  వృత్తులకు చేయూత దొరికిందన్నారు, తెలంగాణ రావడంతోనే మన జీవితల్లో పెద్ద మార్పు జరిగిందని, అంతకుముందు సమైక్య రాష్ట్రంలో నీళ్లులేక చెరువులెండాయని, నేడు కాళేశ్వరంతో పెరిగిన పంట దిగుబడే ఏం జరిగిందో చెపుతుందన్నారు. ఉద్యమంలో అమూలాగ్రం తెలంగాణను చూసిన కేసీఆర్ గారు మనకు ఏం కావాలో అదే ఇస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రమే 2 లక్షల 15వేల ఉద్యోగాల భర్తీ చేసిందన్న తలసాని ద్వంసమైన కులవ్రుత్తులకు పూర్వ వైభవం తెచ్చామన్నారు. కాంగ్రెస్ దోపిడీ చేస్తుందని, బీజేపీ మతం మత్తులో ముంచుతుందని కేవలం బీఆర్ఎస్ మాత్రమే అభివ్రుద్ది తెస్తుందన్నారు మంత్రి తలసాని

మరో మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కుల వ్యవస్థపై మహనీయులు పూలే అద్బుత పరిశోదన చేసి మనమంతా ఒకటేనని, కేవలం వ్రుత్తిపరంగా కులాలుగా విభజించబడ్డామని చెప్పారని, అందరినీ కలపడానికి పూలే పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదన్నారు. ఆపనిని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నారని, సమూహంగా ఎదిగే అవకాశాన్ని బీసీలకు ఇచ్చేందుకు ఆత్మగౌరవ భవనాలు దోహదం చేస్తాయన్నారు. సంఘాల నేతలు ఏ పార్టీకి చెందిన వారైనా గుండె మీద చేయివేసుకొని ఆలోచిస్తే మనకు వేలకోట్ల విలువైన స్థలాల్ని ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అని అర్తమౌతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసుధనాచారి మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణులను గుర్తించి 5 ఎకరాలతో పాటు 5 కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామన్నారు. స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్లో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం, బీసీ కులాలకు వేదికగా ఉప్పల్ని చేయడం సంతోషంగా ఉందన్నారు.

ఉప్పల్ భగాయత్లో శంకుస్థాపనలు చేసుకున్న 13 సంఘాల వివరాలివే
1. గంగ పుత్ర – 3 ఎకరాలు – 3 కోట్లు. 
2. నీలి – 10 గుంటలు – 25 లక్షలు 
3. లక్కమరికాపు –20 గుంటలు
4. తెలంగాణ మరాఠా మండల్ – 2 ఎకరాలు
5. పూసల – 1ఎకరాం  – 1కోటి
6. కుమ్మరి శాలివాహన – 3 ఎకరాలు – 3 కోట్లు
7. విశ్వభ్రాహ్మణ – 5 ఎకరాలు – 5 కోట్లు
8. నక్కాస్ – 1 ఎకరం – 1 కోటి
9. బొందిలి – 1 ఎకరా – 1 కోటి
10. కాచి – 20 గుంటలు – 50 లక్షలు
11. వాల్మీకి బోయ – 1 ఎకరా – 1 కోటి
12. భూంజ్వ – 10 గుంటలు – 25 లక్షలు
13. జాండ్ర–10 గుంటలు –25 లక్షలు. 

ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యే భేటీ సుభాష్ రెడ్డి ముఠాగోపాల్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి బీసీ కమిషన్ చైర్మన్ వకలాభరణం కృష్ణమోహన్రావు, సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీ శంకర్, బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర, కిషోర్. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఇతర ఉన్నతాధికారులు, రెవెన్యూ ఆర్అండ్ బీ శాఖల అధికారులు, పెద్ద ఎత్తున తరలివచ్చిన బీసీ కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Published at : 05 Feb 2023 10:28 PM (IST) Tags: Hyderabad Gangula kamalakar Talasani Srinivas Yadav Srinivas Goud BRS KCR

సంబంధిత కథనాలు

TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 15 మంది అరెస్ట్, ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం

TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 15 మంది అరెస్ట్, ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం

Hyderabad Fire Accidents: అగ్నిప్రమాదాల నివారణకు GHMC కొత్త వ్యూహం - ఇకపై ఆ సర్టిఫికేట్ తప్పనిసరి!

Hyderabad Fire Accidents: అగ్నిప్రమాదాల నివారణకు GHMC కొత్త వ్యూహం - ఇకపై ఆ సర్టిఫికేట్ తప్పనిసరి!

Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం- కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్, యువకుడు ఆత్మహత్య!

Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం- కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్, యువకుడు ఆత్మహత్య!

CM KCRకు బండి సంజయ్ లేఖ- విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్

CM KCRకు బండి సంజయ్ లేఖ-  విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్

ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా

ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా

టాప్ స్టోరీస్

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!