News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: విచారణకు రాని వారికి తెలంగాణ సిట్ భారీ ఝలక్!

సంతోష్‌ను విచారణ చేయొచ్చని, అరెస్ట్‌ విషయంలో కోర్టు పర్మిషన్ మాత్రం తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఇప్పుడు బీఎల్‌ సంతో‌షను నిందితుడిగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సిట్‌ మెమో దాఖలు చేయడం సంచలనం అయింది.

FOLLOW US: 
Share:

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) బీఎల్ సంతోష్ తో పాటు కొత్తగా నలుగురిని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ముందు నుంచి రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్‌లు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బీఎల్ సంతోష్‌తో పాటు కేరళకు చెందిన డాక్టర్ జగ్గు స్వామి, బీడీజేఎస్ నేత తుషార్, కరీంనగర్ అడ్వకేట్ బూసారపు శ్రీనివాస్‌లను కూడా నిందితులుగా చేర్చారు. ఈ మేరకు ఏసీబీ కేసుల స్పెషల్ కోర్టులో తాజాగా సిట్ మెమో దాఖలు చేసింది.

వీరు అందరూ విచారణకు రావాలని కొద్ది రోజుల క్రితం సిట్ నోటీసులు జారీ చేసింది. అయినా శ్రీనివాస్ తప్ప మరెవరూ విచారణకు హాజరు కాలేదు. నవంబరు 21, 22 తేదీల్లో శ్రీనివాస్ విచారణకు వచ్చి మూడో రోజు విచారణకు వెళ్లలేదు. హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఆయన మళ్లీ విచారణకు వస్తారని అనుకుంటున్నారు. తమ ఎదుట విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్నందుకు గానూ వీరిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. కేసులో మొదట్నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బీఎల్‌ సంతోష్‌ను సిట్‌ టార్గెట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఎల్‌ సంతోష్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన సిట్‌ శనివారం లేదా సోమవారం విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేక గడువు కోరతారా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం గుజరాత్‌ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు కొంత టైం కావాలని కోరుతూ బీఎల్ సంతోష్‌ సిట్‌ అధికారులకు ఇటీవల లేఖ రాశారు.

సంతోష్‌ను విచారణ చేయొచ్చని, అరెస్ట్‌ విషయంలో కోర్టు పర్మిషన్ మాత్రం తీసుకోవాలని హైకోర్టు ఇప్పటికే చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీఎల్‌ సంతో‌షను నిందితుడిగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సిట్‌ మెమో దాఖలు చేయడం సంచలనంగా అయింది.

ఎంపీ రఘురామకీ సిట్ నోటీసులు
ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు టీమ్ తాజాగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సీఆర్‌పీసీ 41(ఏ) ప్రకారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 29న సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. రామచంద్ర భారతి, నందుతో రఘురామకు పరిచయం ఉన్నట్లుగా సిట్‌ ఆధారాలు గుర్తించింది. అలాగే అజ్ఞాతంలో ఉన్న కేరళ వైద్యుడు జగ్గుస్వామి సోదరుడు మనీలాల్‌, జగ్గు వద్ద పనిచేసే విమల్‌, ప్రశాంత్‌, శరత్‌లకు నోటీసులు పంపారు. వీరితోపాటు జగ్గుస్వామి పని చేస్తున్న అమృత ఆస్పత్రి భద్రతా అధికారి ప్రతాపన్‌కు సిట్‌ సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీ చేసింది.

ఇవాళ విచారణకు హాజరయ్యేవారు వీరే

నేడు సిట్ విచారణకు న్యాయవాది ప్రతాప్ గౌడ్, నంద కుమార్ భార్య చిత్రలేఖ హాజరు కానున్నారు. నంద కుమార్ తో, సింహ యాజీ, రామచంద్ర భారతిలతో ఉన్న సంబంధాలపై ప్రతాప్ గౌడ్ ను సిట్ ప్రశ్నించనుంది. నంద కుమార్ కు సంబంధించిన వివరాలపై చిత్రలేఖను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. 

Published at : 25 Nov 2022 08:06 AM (IST) Tags: TRS MLAs Poaching Case BL Santosh Telangana SIT MLAs News TRS MLA buying case

ఇవి కూడా చూడండి

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

Ganesh Nimajjanam 2023: ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తాం, గణేష్ మండప నిర్వహకుల ఆందోళన! భారీగా ట్రాఫిక్ జామ్

Ganesh Nimajjanam 2023: ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తాం, గణేష్ మండప నిర్వహకుల ఆందోళన! భారీగా ట్రాఫిక్ జామ్

Minister KTR: 30 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ పూర్తి, త్వరలోనే మరో 40 వేల ఇండ్లు: కేటీఆర్

Minister KTR: 30 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ పూర్తి, త్వరలోనే మరో 40 వేల ఇండ్లు: కేటీఆర్

Minister Vemula: గవర్నర్ నియామకమే అప్రజాస్వామికం, పదవిలో కొనసాగే అర్హత లేదు - మంత్రి వేముల

Minister Vemula: గవర్నర్ నియామకమే అప్రజాస్వామికం, పదవిలో కొనసాగే అర్హత లేదు - మంత్రి వేముల

టాప్ స్టోరీస్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత