News
News
X

Revanth Reddy: హత్యాచార బాలిక కుటుంబానికి రేవంత్ పరామర్శ.. నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్

హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీ లో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబ సభ్యులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. 

FOLLOW US: 

సైదాబాద్ లో బాలిక హత్యాచార కుటుంబాన్ని రేవంత్ రెడ్డి పరామర్శించారు.  టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. హత్యాచారం నిందితున్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో గిరిజనులకు న్యాయం జరగడం లేదని.. గిరిజన బిడ్డలు తెలంగాణ కోసం పోరాటం చేశారని రేవంత్ అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికి మంత్రులు స్పందించలేదని విమర్శించారు. గంజాయ్ మత్తులో ఒక దుర్మాగుడు.. చిన్నారిని అత్యాచారం చేసి.. హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.  నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. 

మద్యం అమ్మకాలు.. గంజాయ్ అమ్మకంతో ఇటు వంటి దారుణాలు జరుగుతున్నాయని లోకేశ్ చెప్పారు. హోంమంత్రి ఈ ఘటనపై స్పందించకపోవడం బాధకరమన్నారు. దత్తత తీసుకున్న ఈ సింగరేణి కాలనీని ఎందుకు సందర్శించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ప్రశ్నించారు.  ప్రభుత్వం చిన్నారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.  

తెలంగాణను మాదక ద్రవ్యాలకు బానిసని చేశారు. రాష్ట్రంలో మద్యం ఆదాయం 10 వేల కోట్ల నుంచి 36 వేల కోట్లకు పెరిగింది. 12 ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు మద్యానికి బానిస అవుతున్నారు. డ్రగ్స్, గంజాయి, మద్యం లాంటి వ్యసనాలకు తెలంగాణ యువత బానిస అయింది. డ్రగ్స్ కు కేటీఆర్, మద్యానికి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ అయ్యారని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ లో పెరుగుతున్న ఈ విష సంస్కృతికి కేసీఆర్ కుటుంబమే కారణం.
     - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇంత పెద్ద నేరం జరిగి 5 రోజులు అయినా సిటీ పోలీస్ కమిషనర్ సంఘటన స్థలాన్ని సందర్శించలేదని రేవంత్ రెడ్డి అన్నారు.  'బాధితుల పక్షాన పోరాటం చేసిన వారిపైన కేసులు పెట్టారు. ఇంత దారుణమా.. ఈ నెల 17వ తేదీన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. ఆయనను బీజేపీ నాయకులు ఇక్కడ కు తీసుకువచ్చి ఈ కుటుంబానికి భరోసా ఇప్పించాలి. తాము ఈ విషయంలో అమిత్ షా అపాయింట్ మెంట్ అడుగుతాం. ఇవ్వకపోతే కేసీఆర్, అమిత్ షా ఒకటే.. ఈ బాలిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుంది.' అని రేవంత్ రెడ్డి చెప్పారు.

Also Read: TS High Court On Immersion: తీర్పును సవరించేది లేదు.. నిమజ్జనంపై గతంలోనే ఉత్తర్వులిచ్చాం.. అయినా పాటించకపోవడమేంటి

Published at : 13 Sep 2021 03:29 PM (IST) Tags: revanth reddy TPCC hyderabad girl rape case TRS Govt saidabad minor rape revanth reddy on saidabad rape incident

సంబంధిత కథనాలు

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - 3 రోజులపాటు అక్కడ అతి భారీ వర్షాలు, IMD ఆరెంజ్ అలర్ట్

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - 3 రోజులపాటు అక్కడ అతి భారీ వర్షాలు, IMD ఆరెంజ్ అలర్ట్

కేసిఆర్ వేసిన స్కెచ్‌కు ఆ రెండు జాతీయపార్టీలు ఇంతే సంగతులా?

కేసిఆర్ వేసిన స్కెచ్‌కు ఆ రెండు జాతీయపార్టీలు ఇంతే సంగతులా?

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

రూటు మారుస్తున్న గంజాయి స్మగ్లర్లు- హైదరాబాద్ పోలీసుల నిఘాకు చిక్కకుండా స్కెచ్‌

రూటు మారుస్తున్న గంజాయి స్మగ్లర్లు- హైదరాబాద్ పోలీసుల నిఘాకు చిక్కకుండా స్కెచ్‌

Garikapati Narsimharao : చిరంజీవిపై గరికపాటి సీరియస్, అసూయ పరిపాటే అంటూ నాగబాబు ట్వీట్

Garikapati Narsimharao : చిరంజీవిపై గరికపాటి సీరియస్, అసూయ పరిపాటే అంటూ నాగబాబు ట్వీట్

టాప్ స్టోరీస్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!