By: ABP Desam | Updated at : 26 May 2022 01:37 PM (IST)
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
ప్రధాన మంత్రి మోదీ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న వేళ బీజేపీ శ్రేణులు ఉత్సాహంతో స్వాగతం పలుకుతుండగా, ఆయన పర్యటనను మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మోదీ పర్యటనను ప్రశ్నిస్తూ ఆయనకు పలు ప్రశ్నలు వేశారు. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్విటర్, ఫేస్ బుక్‌లో మోదీకి బహిరంగ లేఖ రాశారు. అంతేకాక, రాజకీయ నాయకులకే కాక మోదీ విద్యార్థులకు కూడా భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అందుకే మోదీ హాజరయ్యే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో విద్యార్థుల నేపథ్యాలను తనిఖీ చేశారని, మోదీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని అనుమతించడం లేదని గుర్తు చేశారు.
ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం మధ్య ఫెవికాల్ బంధం ఉన్నా ప్రజల ఆకాంక్షలు ఎందుకు నెరవేర్చడం లేదని రేవంత్ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు మర్చిపోయారని విమర్శించారు.
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు, రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవినీతిపై విచారణ ఎందుకు చేయించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. హైదరాబాద్ కు రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, నైనీ కోల్ మైన్స్ విషయంలో అవినీతి, క్రిష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆడుతున్న జగన్నాటకం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీ సంగతి ఏంటని నిలదీశారు. ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ను ఎందుకు మూసేశారని అన్నారు. రైతుల ఆదాయం 2022 కల్లా రెట్టింపు చేస్తానని ఇప్పుడు ఏం చేశారని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మోదీజీ… ఐఎస్బీ స్నాతకోత్సవంలో విద్యార్థులు మిమ్మల్ని ప్రశ్నించకూడదని వాళ్ల నేపథ్యాలను భూతద్దంలో వెతికి మరీ ప్రవేశానికి అనుమతించారు.
— Revanth Reddy (@revanth_anumula) May 26, 2022
తెలంగాణ ప్రజల తరఫున అడుగుతున్నా… కనీసం ఈ ప్రశ్నలకైనా జవాబు చెబుతారా!?#GoBack_Modi pic.twitter.com/89r8xR6rKA
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (మే 26) హైదరాబాద్ కు రానున్న వేళ ఆయన పర్యటన విషయంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయన హైదరాబాద్‌కు మధ్యాహ్నం 1.25కు చేరుకోవాల్సి ఉండగా, కాస్త ముందుగా 12.50 నిమిషాలకు రానున్నారు. ఓ అరగంట ముందుగానే హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి వస్తున్నారు. ముందుగానే హైదరాబాద్ వచ్చి తర్వాత పావుగంట పాటు తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అవ్వనున్నారు. ఆ తర్వాత బేగంపేట్ నుంచి హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకోనున్నారు. అయితే, నిన్ననే బండి సంజయ్ మతపరమైన వ్యాఖ్యలు వివాదాస్పదంగా చేసిన వేళ ఇప్పుడు బీజేపీ నేతలతో మోదీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణ నుంచి తరిమేయండి- ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు
IT Raids in Hyderabad: హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడుల కలకలం! 50కిపైగా బృందాలు రంగంలోకి
తెలంగాణ బడ్జెట్‌కి గవర్నర్ ఆమోద ముద్ర- ఈసారి మూడు లక్షల కోట్లతో పద్దు!
Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల
Telangana CS Shanti Kumari: కంటి వెలుగు, పోడు పట్టాలు, టీచర్ల బదిలీలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష
పెళ్లి కాకపోయినా పర్వాలేదు, పిల్లలను కనండి - పాలకులు షాకింగ్ నిర్ణయం, ఎక్కడో తెలుసా?
Nellore Anam : నెల్లూరు వైఎస్ఆర్సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !
Agent Release Date : 'ఏజెంట్' రిలీజ్ డేట్ ఫిక్స్ - థియేటర్లలో అఖిల్ వైల్డ్ యాక్షన్ రైడ్ ఆ రోజు నుంచి షురూ!
Stock Market News: బడ్జెట్ ముందు పాజిటివ్‌గా స్టాక్ మార్కెట్ల ముగింపు - రేపు డబ్బుల వర్షమేనా!!