తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం- ట్రాక్టర్, గరుడ బస్ ఢీ- ముగ్గురు మృతి
చెరకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను బస్ ఢీ కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో టర్నింగ్ ఉన్నందున ప్రమాదం జరిగిందంటున్నారు.
వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను తెలంగాణ ఆర్టీసీ గరుడ బస్ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోయారు. పదిమందికి గాయాలు అయ్యారు. కొత్తకోట మండలం ముమ్మాలపల్లిలో ఘోరం జరిగింది. మియాపూర్ డిపోకు చెందిన బస్ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ బస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ట్రాక్టర్ చెరకు లోడుతో వెళ్తోంది. టర్నింగ్‌లో ఆ ట్రాక్టర్‌ను బస్ ఢీ కొట్టింది. ట్రాక్టర్ లైట్లు వేయకపోవడం కారణంగానే చీకటిలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ప్రమాదంలో డ్రైవర్, ఆయన సహాయకుడు ఇద్దరూ స్పాట్‌లోనే చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ ప్రయాణికుడు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం జాతీయ రహదారి ఎన్ హెచ్ 44 మూమ్మాలపల్లి దగ్గర అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న మియాపూర్ వన్ డిపోకు చెందిన గరుడ బస్సు కొత్తకోట మండలం మూమ్మాలపల్లి స్టేజి దగ్గర చెరుకులోడుతో వెళుతున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో బస్సులో 48 మంది ప్రయాణిస్తున్నారు. ఈ దుర్ఘటనలో డ్రైవర్, క్లీనర్ ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందగా, 15 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న కొత్తకోట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని అంబులెన్స్ లో వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయి దాదాపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొత్తకోట ఎస్సై నాగ శేఖర్ రెడ్డి, సిబ్బంది దగ్గరుండి ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ జామ్ క్లియర్ చేశారు. ఎన్ హెచ్ 44 పై అక్కడక్కడ మలుపులు ఉండడం అదేవిధంగా అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి స్థానికులు చెబుతున్నారు.