అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Hyderabad Metro: ఎయిర్‌పోర్టు మెట్రోపై ముందడుగు, ఇంజినీరింగ్ కన్సార్టియం ఎంపిక పూర్తి

Hyderabad Metro: శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో పొడగింపుపై ముందడుగు పడింది. మూడు ఇంజినీరింగ్ సంస్థలతో కలిపి కన్సార్టియంను ఎంపిక పూర్తయింది.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సర్వీసులను శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు పొడిగింపుపై ముందడుగు పడింది. ఎయిర్ పోర్టు వరకు మెట్రోకు జనరల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ గా సిస్ట్రా, రైట్స్ డీబీ ఇంజినీరింగ్ సంస్థల కన్సార్టియం ఎంపిక అయింది. జనరల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఎంపిక పూర్తయిందంటూ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటన రిలీజ్ చేశారు. జనరల్ కన్సల్టెంట్ ఎంపిక కోసం మొత్తం 5 అంతర్జాతీయ కన్సార్టియంలు పోటీ పడ్డాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక, పురపాలక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, అర్వింద్ కుమార్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు ఏర్పాటైన కమిటీ పోటీ పడ్డ 5 అంతర్జాతీయ కన్సార్టియంలను పరిశీలించినట్లు వెల్లడించారు. 

5 కన్సార్టియాల సాంకేతిక సామర్థ్యాన్ని, వారి అనుభవాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకుని ఎయిర్ పోర్టు మెట్రోకు కన్సార్టియాన్ని ఎంపిక చేసినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సిస్ట్రా నేతృత్వంలోని కన్సార్టియానికి అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చి టెండర్ అప్పగించినట్లు వెల్లడించారు. సిస్ట్రా నేతృత్వంలోని కన్సార్టియానికి సాంకేతికంగా అత్యధిక మార్కులు వచ్చాయని, అలాగే ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సేవలు అందించేందుకు ఈ కన్సార్టియం తక్కువ మొత్తంలో రూ. 98.54 కోట్ల మేర కోట్ చేసినట్లు మెట్రో రైల్ ఎండీ పేర్కొన్నారు. కన్సార్టియంలోని 3 సంస్థలకు ప్రజా రవాణా రంగంలో అందులోనూ మెట్రో రైళ్ల నిర్వహణలో విశేష అనుభవం ఉందని, ఆయా విభాగాల్లో ఈ సంస్థలు ప్రఖ్యాతి చెందినవి వెల్లడించారు. ఫ్రాన్స్ కు చెందిన సిస్ట్రా, భారతీయ రైల్వేలకు చెందిన రైట్స్, జర్మనీకి చెందిన డీబీ సంస్థలకు గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నట్లు తెలిపారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో నిర్మాణంలో పలు విభాగాల్లో 18 మంది ఇంజినీరింగ్ నిపుణులు, క్షేత్రస్థాయిలో మరో 70 మంది సీనియర్ ఇంజినీర్లు, ఇతర సిబ్బందిని కన్సార్టియం సమకూర్చుతుంది. ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ వెంటనే తన పనిని మొదలు పెడుతుందని, ఎయిర్ పోర్టు మెట్రో నిర్మాణానికి అవసరం అయిన ఈపీసీ టెండర్ డాక్యుమెంట్లను త్వరలోనే తయారు చేస్తుందని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. 

రెండో ఫేజ్ అత్యంత క్లిష్టమైంది..

శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు నిర్మించే రెండో ఫేజ్ లో మెట్రో లైన్​ వెళ్లే రాయదుర్గం స్టేషన్​ నుంచి నానక్‌రామ్‌గూడ జంక్షన్ వ​రకు ఉన్న పనులు ఇంజినీరింగ్ ​పరంగా అతి క్లిష్టమైనవి. ఈ ప్రాంతంలో మెట్రో సాంకేతిక సవాళ్లను ఎదుర్కొక తప్పదు. 21 మీటర్ల ఎత్తులో రాయదుర్గ్, మైండ్​ స్పేస్​ జంక్షన్ ను దాటడం ఒక పెద్ద సవాల్‌​తో కూడుకున్న విషయం. బెస్ట్ ఇంజినీరింగ్ సొల్యూషన్ కోసం రెండో ఫేజ్ మెట్రో లైన్ రూట్ మ్యాప్ పరిశీలించగా.. అంత ఎత్తులో మైండ్​ స్పేస్​ జంక్షన్ ను దాటడం ఒక పెద్ద సవాల్ అని అధికారులు గుర్తించారు. ఈ జంక్షన్ వద్ద కింద నుంచి అండర్ ​పాస్​ వే ఉండగా, మధ్యలో రోటరీ, ఆ పైన ఫ్లై ఓవర్​ ఇలా ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. ఈ సవాల్ ను అధిగమించేందుకు పరిష్కారంగా ప్రత్యేకమైన స్పాన్ ​ని అక్కడే నిర్మించేలా పరిశీలించినట్లు చెప్పారు. ఇక్కడి నుంచి మొదలయ్యే మెట్రో లైన్ ​వెళ్లే ఎయిర్ ​పోర్టు మెట్రో పిల్లర్​లను ఫ్లైఓవర్​ పిల్లర్​లకు దూరంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని గతంలో ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget