అన్వేషించండి

తెలంగాణ బడ్జెట్‌కి గవర్నర్ ఆమోద ముద్ర- ఈసారి మూడు లక్షల కోట్లతో పద్దు!

ఓవైపు గవర్నర్, తెలంగాణ ప్రభుత్వం ఎవరికి వారే పట్టుదలకు పోవడంతో బడ్జెట్‌ సమావేశాలతోపాటు బడ్జెట్ ఉంటుందా లేదా అన్న ఉత్కంఠ నిన్న సాయంత్ర వరకు కొనసాగింది.

తెలంగాణ బడ్జెట్‌ 2023-24కు గవర్నర్ ఆమోదం లభించింది. మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు నిన్న తెరపడినా... ఆమోదంపై సస్పెన్స్‌ మాత్రం కొనసాగింది. మొత్తానికి మూడు లక్షల కోట్లతో రూపొందించిన తెలంగాణ పద్దుపై గవర్నర్‌ తమిళిసై సంతకం చేసి ఆమోదించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఈ టెర్మ్‌లో ప్రవేశ పెడుతున్న ఆఖరి బడ్జెట్‌ ఇది. అందుకే భారీ అంచనాలు ఉన్న బడ్జెట్‌పై కేసీఆర్‌ ప్రత్యేక ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. 

ఓవైపు గవర్నర్, తెలంగాణ ప్రభుత్వం ఎవరికి వారే పట్టుదలకు పోవడంతో బడ్జెట్‌ సమావేశాలతోపాటు బడ్జెట్ ఉంటుందా లేదా అన్న ఉత్కంఠ నిన్న సాయంత్ర వరకు కొనసాగింది. చివరకు విషయం కోర్టు వరకు కూడా వెళ్లింది. మొత్తానికి ఇరు పక్షాలు ఓ మెట్టు దిగి వచ్చి... బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించడంతోపాటు కోర్టులో వేసిన పిటిషన్‌ను కూడా వెనక్కి తీసుకుంది. గవర్నర్‌ కూడా బడ్జెట్ ఆమోదానికి అంగీకరించారు. ముందుగా ప్రకటించినట్టుగా మూడో తేదీన ప్రవేశా పెట్టాల్సిన బడ్జెట్‌ను ఆరో తేదీకి మార్చారు. 

నిన్న సాయంత్రం పుదుచ్చేరి పర్యటన ముగించుకున్న హైదరాబాద్ తిరిగి వచ్చిన గవర్నర్ తమిళి సైని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కలిశారు. బడ్జెట్ ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం తరఫున గవర్నర్ ను కోరారు. బడ్జె్ట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు రావాల్సిందిగా గవర్నర్‌‌ తమిళి  సై ను ఆహ్వానించారు. ఉభయ సభల ప్రోరోగ్, తిరిగి సమావేశమయ్యేందుకు నోటిఫికేషన్, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫారసు అంశాలపై గవర్నర్ తో చర్చించారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన స్పీచ్ కాపీని మంత్రి గవర్నర్ కు అందించారు. పెండింగ్ బిల్లుపై చర్చకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.  

రాజ్ భవన్ , ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగిన క్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి గవర్నర్ ను కలిసి చర్చించడం ఆసక్తికరంగా మారింది. గతంలో రెండుసార్లు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈసారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భావించినా చివరికి ఆ నిర్ణయాన్ని మార్చుకుంది ప్రభుత్వం. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ స్పీచ్ ఉంటుందని తెలిపింది. ఈ మేరకు గవర్నర్ ను బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది. ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానుండగా,  3వ తేదీ మధ్యాహ్నం గవర్నర్‌ తమిళిసై ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 6న  రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. 

రాజ్ భవన్ తో రాజీ

ఫిబ్రవరి 3న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపాలని గవర్నర్‌ కు ఈ నెల 21న లేఖ రాసింది ప్రభుత్వం. గవర్నర్‌ ఆ బడ్జెట్‌కు ఆమోదం తెలపకుండా పెండింగ్ లో పెట్టారు. రాజ్‌భవన్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేసింది. బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపేలా గవర్నర్ ను ఆదేశించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని వాదించింది. కానీ అనుహ్యంగా హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగి రాజ్ భవన్ తో రాజీకి వచ్చింది. మంత్రులు గవర్నర్ తో భేటీ అయ్యి బడ్జెట్ కు అనుమతి ఇవ్వడంతో పాటు ఉభయసభల్లో ప్రసంగించాలని కోరారు. 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి మూడో తేదీన మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభించాలని నిర్ణయించారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాలకు ముందు ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తారు. కానీ తెలంగాణ సర్కార్ కు..  గవర్నర్ కు మధ్య విభేదాలు ఉండటంతో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో కొత్త సమావేశాలు కాదని.. పాత సమావేశాలకు కొనసాగింపేనని చెబుతూ.. శాసనసభ 8వ సెషన్ 4వ విడత సమావేశాలంటూ ప్రకటన చేశారు.   గతేడాది సెప్టెంబర్లో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. అయితే అసెంబ్లీని ప్రోరోగ్ చేయలేదు. దీంతో గత సమావేశాలకు కొనసాగింపుగానే.. ఫిబ్రవరి సెషన్స్ కొనసాగుతాయని ప్రకటించారు. అయితే  బడ్జెట్‌కు రాజ్యాంగపరంగా  గవర్నర్ ఆమోదం తప్పని సరి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి  రాజ్ భవన్‌కు బడ్జెట్ వెళ్లింది. కానీ బడ్జెట్ ను గవర్నర్ ఆమోదించలేదు. కానీ  అసెంబ్లీ సంయుక్త సమావేశం ఎందుకు లేదు ? గవర్నర్ ప్రసంగం ఎందుకు లేదు ? అని ప్రశ్నిస్తూ ఓ లేఖను తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ పంపారు. ఈ కారణంగానే  గవర్నర్ బడ్జెట్ ఆమోదించేలా ఆదేశించాలని తెలంగాణ సర్కార్ హైకోర్టుకు వెళ్లింది. అంతిమంగా తమ వాదన రాజ్యాంగ పరంగా నిలబడదని అనుకున్నారేమో కానీ.. చివరికి గవర్నర్ విషయంలో  పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గారు.

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget