అన్వేషించండి

Teachers Transfers: టీచర్ల బదిలీకి విడుదలైన షెడ్యూల్, సెప్టెంబర్ 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

Teachers Transfers In Telangana: టీచర్ల బదిలీలకు తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల హైకోర్టు తీర్పుతో బదిలీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

Teachers Transfer In Telangana: తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో విద్యాశాఖ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ప్రభుత్వం టీచర్ల బదిలీపై కసరత్తు చేయడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ బదిలీల్లో ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించనుంది. కోర్టు తుది తీర్పునకు లోబడే టీచర్ల ట్రాన్స్‌ఫర్లు ఉండాలని హైకోర్టు  ఆదేశించిన నేపథ్యంలో.. బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా శాఖ ప్రతిపాదనలు పంపించింది.

బదిలీలు కోరుకునే ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. 8, 9 తేదీల్లో బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను అధికారులు డిస్ ప్లే చేస్తారు. 10, 11 తేదీల్లో అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. 12, 13 తేదీల్లో సీనియారిటీ జాబితాలను ఉన్నతాధికారులు ప్రచురిస్తారు. 14వ తేదీన ఎడిట్ చేసుకునే వీలు ఉంటుంది. సెప్టెంబర్ 15వ తేదీన ఆన్‌లైన్‌ ద్వారా ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపడతారు. సెప్టెంబరు 16వ తేదీన ప్రధానోపాధ్యాయుల ఖాళీలను ప్రదర్శిస్తారు. 17, 18, 19 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్లుగా పదోన్నతులు ఇస్తారు.

సెప్టెంబరు 20, 21 తేదీల్లో ఖాళీ అయిన స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ప్రదర్శన చేస్తారు. 21న వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటే.. 22వ తేదీన ఎడిట్  ఆప్షన్ ను వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. 23, 24 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ బదిలీలు చేపడతారు. ఈ నెల 24వ తేదీన స్కూల్ అసిస్టెంట్ ఖాళీల ప్రదర్శన ఉంటుంది. 26, 27, 28 తేదీల్లో ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతులు పొందుతారు. 29, 30, 31 ఎస్టీటీ ఖాళీలను డిస్‌ప్లే చేస్తారు. అక్టోబర్ 2వ తేదీన ఎడిట్ ఆప్షన్లు ఇస్తారు. అక్టోబర్ 3వ తేదీన ఎస్టీటీ, భాషాపండితులు, పీఈటీల బదిలీలు చేపట్టనున్నారు. అక్టోబర్ 5 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తారు.

Also Read: Kidney Donation: ఇది కదా రాఖీ కట్టిన సోదరికి ఇచ్చే బహుమతి- కిడ్నీ దానం చేసిన సోదరుడు

నిబంధనలు ఏంటంటే..

  • సెప్టెంబర్ 1వ తేదీ కటాఫ్ తేదీగా లాంగ్ స్టాండింగ్ కు ఉపాధ్యాయులకు 8 సంవత్సరాలు, ప్రధానోపాధ్యాయులకు 5 ఏళ్లు నిబంధన వర్తించేలా ప్రతిపాదించారు.
  • 5 లేదా 8 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు లేదా ప్రధానోపాధ్యాయుల స్థానాలను ఖాళీలుగా జాబితాలో చేర్చనున్నారు.
  • పదవీ విరమణకు 3 ఏళ్ల లోపు సర్వీసు ఉన్న టీచర్లకు, ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు.
  • అన్ని రకాల పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా అధికారులకు సూచనలు ఇచ్చారు.
  • కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. గతంలో అప్లై చేసుకున్న టీచర్ల దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని, అదనంగా స్పౌజ్ బదిలీలకు పాయింట్లు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు.
  • సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి 50 ఏళ్ల లోపు వయస్సు ఉండి బాలికల పాఠశాలలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు నిర్బంధ బదిలీ వర్తింప జేస్తూ ప్రతిపాదనలు పంపించింది.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget