News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Singer Gaddar: పరిటాల, వంగపండుతో గద్దర్‌కు ఉన్న అనుబంధం ఏంటీ? విమానం ఎందుకు ఎక్కలేకపోయారు?

Telangana Singer Gaddar: జానపద గాయకుడు గద్దర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం.

FOLLOW US: 
Share:

Telangana Singer Gaddar: తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన జానపదంతో ఎందరినో కదిలించాడు జానపద గాయకుడు గద్దర్. తన ఆటపాటలతో ఆలోచనలు రేకెత్తించారు. తన గళంతోనే సమస్యలపై పోరాటాన్ని సాగించారు. ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలలో విప్లవ పంథాను ఎంచుకుని పాటలతో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. తుదిశ్వాస విడిచే వరకు తన పాటలతో చైతన్యం కల్పించారు. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్షను, పోరాట పటిమను మేల్కొలిపారు. ఆయన పాటలు ఉద్యమానికి కొత్త రూపును ఇచ్చి ముందుకు తీసుకెళ్లాయి. ఉద్యమ సమయంలో గద్దర్ పాట లేని కార్యక్రమం ఉండేది కాదు. అంతలా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు గద్దర్.

గద్దర్ అనే పేరు ఎలా వచ్చిందంటే..

మెదక్ జిల్లా తూప్రాన్‌లో జన్మించారు గద్దర్. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ చేశారు. ఢిల్లీ దర్బార్ హోటల్‌లో ప్రతి రోజూ 2 గంటల పాటు సర్వర్ గా పని చేస్తూ చదువుకునేవారు. దళిత్ పాంథర్, నక్సల్ బరీ ఉద్యమాల స్ఫూర్తితో ఇంజినీరింగ్ చదువును మధ్యలోనే ఆపేసి ఉద్యమాల బాటపట్టారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్లారు. ఉద్యమంలో ఉన్నప్పుడు రచనలపై తన పేరు రాయాల్సి వచ్చినప్పుడు.. గుమ్మడి విఠల్ రావు అనే తన అసలు పేరును కాకుండా స్వాతంత్య్ర పోరాటంలో గదర్‌ (తిరుగుబాటు) పార్టీ పేరును స్ఫూర్తిగా తీసుకుని గదర్ అనే పేరు పెట్టారు. కానీ ప్రింటింగ్ మిస్టేక్ వల్ల గదర్ కాస్త గద్దర్ గా ప్రింట్ అయింది. అప్పటి నుంచి గద్దర్ అనే పేరును కొనసాగుతూ వచ్చింది.

ఎత్తిపోతల పథకం తెచ్చిన గద్దర్..

తను పుట్టిన తూప్రాన్ కు ఏదైనా చేయాలని ఎప్పుడూ తపించేవారు గద్దర్. కిష్టాపూర్ హల్దీవాగుపై ఎత్తిపోతల పథకం నిర్మించాలని గద్దర్ కల. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుల దృష్టికి తీసుకెళ్లారు. అలా హల్దీవాగుపై ఎత్తిపోతల పథకం నిర్మాణం కావడంతో తూప్రాన్ పెద్దచెరువును నీటితో కళకళలాడింది. 

పరిటాల శ్రీరాములుతో కలిసి అజ్ఞాతం

ఎమర్జెన్సీ సమయంలో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో నక్సల్ నాయకుడు పరిటాల శ్రీరాములుతో కలిసి అజ్ఞాతంలో గడిపారు. 1985లో సాంస్కృతిక ఉద్యమం నడిపించారు. 1990 దాకా అజ్ఞాతంలో ఉంటూనే ఉద్యమ పోరు సాగించారు. 1990 లో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 1996 లో తెలంగాణ జనసభ లో పాల్గొన్నారు. 2002 లో నక్సలైట్ల ప్రతినిధులుగా వరవరరావుతో కలిసి గద్దర్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. గద్దర్ ను ప్రజా యుద్ధనౌక (పీపుల్స్ వార్‌షిప్) అని 1989 లో ఒక సంపాదకుడు సంబోధించగా.. ఆ తర్వాత అదే తన బిరుదుగా మారిపోయింది.

Also Read: Viral Video: ఫ్లైట్‌లో AC పని చేయక నరకం చూసిన ప్రయాణికులు, టిష్యూలు పంచిన ఎయిర్‌హోస్టెస్

విదేశాల్లో తన గళం వినిపించలేకపోయిన గద్దర్

గద్దర్ కు విదేశాల్లోని ఎన్నో అభ్యుదయ, సాంస్కృతిక సంఘాల నుంచి ఆహ్వానం వచ్చినా ఎక్కడికి వెళ్లలేకపోయారు గద్దర్. 1997లో ఆయనపై కాల్పులు జరిగ్గా.. 6 బుల్లెట్లు శరీరంలోకి చొచ్చుకుపోయాయి. 5 బుల్లెట్లను తొలగించగా.. వెన్నుపూసలో ఉన్న మరో బుల్లెట్ తొలగిస్తే ప్రాణాలకే హాని ఉంటుందని చెప్పి దానిని అలాగే ఉంచేశారు. అయితే ఎయిర్ పోర్టులకు వెళ్లిన ప్రతీసారి స్కానింగ్ లో బుల్లెట్ కనిపించేది. దీనిపై అధికారులకు సమాధానం చెప్పడంలో గద్దర్ ఇబ్బంది పడటం వల్ల అనుమతి లభించేది కాదు. శరీరంలో బుల్లెట్, కేసులు పాస్ పోర్టు జారీకి అడ్డంకిగా మారాయి. అలా విదేశాల నుంచి ఎన్ని ఆహ్వానాలు వచ్చినా విమానం ఎక్కి విదేశాలకు వెళ్లలేకపోయారు.

చేపల కూరంటే గద్దర్ కు ఎంతో ఇష్టం

విశాఖలో దొరికే తాజా చేపలతో వండే కూరంటే గద్దర్ కు ఎంతో ఇష్టం. విశాఖ వచ్చిన ప్రతీసారి ప్రజాకవి వంగపండు ప్రసాదరావు ఇంట్లో తనకిష్టమైన చేపలకూరను వండించుకుని తినేవారు. విశాఖ వస్తే హోటల్ లో ఉండటానికి ఇష్టపడేవారు కాదు. బావగా పిలుచుకునే వంగపండు ఇంట్లోనే ఉండేవారు. 

Published at : 07 Aug 2023 11:16 AM (IST) Tags: Interesting Facts Gaddar Telangana Gummadi Vittal Rao Renowned Folk Singer

ఇవి కూడా చూడండి

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

Ganesh Nimajjanam 2023: ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తాం, గణేష్ మండప నిర్వహకుల ఆందోళన! భారీగా ట్రాఫిక్ జామ్

Ganesh Nimajjanam 2023: ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తాం, గణేష్ మండప నిర్వహకుల ఆందోళన! భారీగా ట్రాఫిక్ జామ్

Minister KTR: 30 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ పూర్తి, త్వరలోనే మరో 40 వేల ఇండ్లు: కేటీఆర్

Minister KTR: 30 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ పూర్తి, త్వరలోనే మరో 40 వేల ఇండ్లు: కేటీఆర్

Minister Vemula: గవర్నర్ నియామకమే అప్రజాస్వామికం, పదవిలో కొనసాగే అర్హత లేదు - మంత్రి వేముల

Minister Vemula: గవర్నర్ నియామకమే అప్రజాస్వామికం, పదవిలో కొనసాగే అర్హత లేదు - మంత్రి వేముల

టాప్ స్టోరీస్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత