Bandi Sanjay: ఎంపీ అసదుద్దిన్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్ - ఎంఐఎం చేతిలోనే కారు స్టీరింగ్ ఉందంటూ కామెంట్లు!
Bandi Sanjay: బీఆర్ఎస్ కు అండగా ఎంఐఎం ఉందని.. కారు స్టీరింగ్ కూడా మజ్లిస్ పార్టీ చేతిలోనే ఉందంటూ బండి సంజయ్ షాకింగ్ కామెంట్లు చేశారు.
Bandi Sanjay: బీఆర్ఎస్ పార్టీకీ అండగా ఎంఐఎం ఉందని.. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ కూడా మజ్లిస్ పార్టీ చేతిలోనే ఉందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ మినహా మరెక్కడా పోటీ చేసే దమ్ము లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం కొమ్ము కాస్తుందని అన్నారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా మార్చి.. వారి జీవితాలను ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ పెద్దది చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు మూడు పార్టీలో ఒక్కటవుతున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అలాగే పాతబస్తీని మజ్లిస్ పార్టీ ఎందుకు అభివృద్ధి చేయలేదంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. అన్ని పార్టీలతో ఎంఐఎం కలిసి పని చేసినా.. పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. పాతబస్తీలో ఇప్పటికి కూడా ఓ పెద్ద కంపెనీ లేదని.. అధికార పార్టీ ఎందుకు వచ్చేలా చేయలోదే చెప్పాలని అన్నారు.
Live from Sri Venkateshwara Swamy temple at Padmanagar, Karimnagar being constructed by Tirumala Tirupathi Devasthanam https://t.co/O1ko61UlG8
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 31, 2023
కుటుంబ సభ్యుల ఆస్తులను పెంచుకోవడం, కాపాడుకోవడమే ఎంపీ అసదుద్దీన్ లక్ష్యం అంటూ బండి సంజయ్ విమర్శలు చేశారు. దమ్ముంటే అన్ని చోట్ల ఎంఐఎం పోటీ చేయాలని సవాల్ విసిరారు. దారుస్సలాంలో కూర్చొని మాట్లాడడం కాదని.. దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి సత్తా నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తన తమ్ముడు అక్బరుదన్నీ గతంలో హిందువులపై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దిన్ ఒవైసీ స్పందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంత శక్తివంతంగా ఉందో అసదుద్దిన్ వ్యాఖ్యలతోనే అర్థం అవుతుందని కామెంట్లు చేశారు.
"ఎంఐఎం పార్టీని ముస్లింలు ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్లు బీఆర్ఎస్ కు వంత పాడుతున్నారు. ముందుగా అసదుద్దిన్ ఒవైసీ తమ్ముడు చేసిన వ్యాఖ్యలపై ఆయన క్లారిటీ ఇవ్వాలి. దీనికి బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు సమాధానం చెప్పాలి. హిందూ పండగలు, హిందూ దేవుళ్లను కించపరిచిన విషయాన్ని తెలుసుకోవాలి. పోటీ చేసే చాతకాదు వాళ్లకు. హైదరాబాద్ ల కూసొని మాటలు చెప్తే సరిపోదు కదా. దారుసలెంలో కూసొని నేను అది పీకుతూ, ఇది పీకుతా అంటే కాదు కదా. డిపాజిట్ రాదు. పోటీ చేసే దమ్ము లేదు. అధికారంలో ఉన్న పార్టీతో కుమ్మక్కవ్వాలి. కాంప్రమైజ్ కావాలే. వాళ్లకు పైసలు ఇవ్వాలే. అప్పుడే కదా ఒవైసీ కుటుంబం ఆస్తులను రక్షించుకోగల్గుతడు. వ్యాపారాలు చేసుకోగల్గుతడు." - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బండి సంజయ్
కరీంనగర్ లో టీటీడీ ఆలయ నిర్మాణ శంకుస్థాపనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరయ్యారు. కరీంనగర్ లో టీటీడీ ఆలయం నిర్మించడం సంతోషకరమన్నారు. హిందూ ధర్మ రక్షణకు టీటీడీ ఎన్నో మంచి కార్యాలు చేస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే కరీంనగర్ లో ఆలయం నిర్మించడం వల్ల తిరుపతికి వెళ్లలేని పేద భక్తులు ఇక్కడే స్వామి వారిని దర్శించుకోవచ్చన్నారు. భవిష్యత్తులో తన యాత్ర గురించి పార్టీలో అందరూ కలిసి కూర్చొని నిర్ణయిస్తామని తెలిపారు.