By: ABP Desam | Updated at : 20 Mar 2023 10:33 AM (IST)
Edited By: jyothi
తెలంగాణ మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్ మృతి
PV Satheesh Death: తెలంగాణ మిల్లెట్ మ్యాన్ గా పేరొందిన డీడీవైఎస్ డైరెక్టర్ పీవీ.సతీష్ ఆదివారం రోజు ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ ఏర్పాటు చేసిన దళిత మహిళలు, పేదలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు. స్వచ్ఛంధ సంస్థల్లోకి రాకముందు దూరదర్శన్ లో పని చేశారు. జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్ లో డీడీఎస్ కార్యాలయం ఏర్పాటు చేసి జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, మొగుడంపల్లి, న్యాల్ కల్, రాయికోడ్, మనూరు మండలాల్లో తమ కార్యక్రమాలు నిర్వహించారు. నిరుపేద మహిళలకు అక్షరాస్య కల్పించడంతోపాటు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు సంఘాలు ఏర్పాటు చేశారు. ఎకరా, రెండు ఎకరాల భూముల్లో చిరు ధాన్యాల్లో సాగు చేసేందుకు ప్రోత్సహించారు. సేంద్రియ ఎరువులతో చిరుధాన్యాల సాగుతు ఎంతగానో కృషి చేశారు. ఝరాసంగం మండలంలోని మచునూరు గ్రామంలో పచ్చసాలే ఏర్పాటు చేసి చదువుతో పాటు కులవృత్తులపై శిక్షణ కల్పించారు. ప్రతి ఏడాది జనవరిలో పాత పంటల జాతర నిర్వహించి వాటి సాగుపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా చిరుధాన్యాల సాగుపై దేశ విదేశాల్లో నిర్వహించిన సదస్సుల్లో అవగాహన కల్పించారు. ఆయన అందించిన సేవలకు గాను ప్రజలు ఆయన్ను ముద్దుగా తెలంగాణ మిల్లెట్ మ్యాన్ అని పిలుచుకునే వారు.
స్పందించిన మంత్రి హరీష్ రావు, ఎంపీ బీబీ పాటిల్
పస్తాపూర్ లోని డీడీఎస్ కార్యాలయంలోని వ్యవసాయ క్షేత్రంలో పీవీ సతీష్ అంత్యక్రియాలు నిర్వహించబోతున్నామని డీడీఎస్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అంతేకాకుండా అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లును చేస్తున్నట్లు వెల్లడించారు. డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ. సతీష్(77) మృతి బాధాకరమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే పీవీ సతీష్ ఆత్మకు మనశ్శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా పీవీ సతీష్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ మిల్లెట్ మ్యాన్ గా గుర్తింపు పొందిన ఆయన మరణ వార్త తనను ఎంతగానో బాధించిందని చెప్పారు. అలాగే పేద మహిళల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేసిన డీడీఎస్ డైరెక్టర్ సతీష్ మృతి తీరని లోటు అని టీఎస్ఎంస్డీసీ ఛైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్ అన్నారు. సతీష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం
Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్
TSPSC Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!
Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు
TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?
TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు
Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?