News
News
వీడియోలు ఆటలు
X

TS Martyrs Memorial: ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్ లెస్ స్టీల్ కట్టడంగా అమరుల స్మారకం, జూన్ నెలలో ప్రారంభం

సాగర తీరాన నిర్మాణం పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న అమరవీరుల స్మారకం వచ్చేనెలలో సీఎం కేసిఆర్ చేతులు మీదుగా ప్రరంభించనున్నట్లు తాజాగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు.

FOLLOW US: 
Share:

హైదరాబాద్ మణిహారంగా ప్రసిద్ది చెందిన హుస్సేన్ సాగర్ తీరాన ఇటీవల 125 అడుగుల ప్రపంచంలోనే ఎతైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం, ఆ తరువాత మరికొద్దిరోజులకే అధునాతన హంగులతో నిర్మించిన నూతన సచివాలం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక్కడే మరో అద్భుత నిర్మాణం అమరవీరుల స్మారక స్థూపం ఏర్పాటు చేస్తున్నారు. సాగర తీరాన నిర్మాణం పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న అమరవీరుల స్మారకం వచ్చే నెలలో సీఎం కేసీఆర్ చేతులు మీదుగా ప్రరంభించనున్నట్లు తాజాగా ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు.

తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివి. 2014లో తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన క్షణంలో వందల మంది ఆత్మబలిదానం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు ముందు చోటుకున్న అనేక పరిణామాలు అప్పట్లో తెలంగాణ యువతను కలిచివేశాయి. ఇక తమ ఆశల తెలంగాణ సాధించుకోవడం అసాధ్యమనుకుని ప్రాణాత్యాగాలకు  పూనుకున్నారు. మరెందరో ఇప్పటికీ వికలాంగులుగా మిగిలిపోయారు. అంతలా ఉద్యమ వీరుల త్యాగాలు భావితరాలకు  గుర్తు చేసేలా ఈ స్థూపం నిర్మాణం చేపట్టడమేకాదు, దేశంలోనే అరుదైన ,అద్బుత నిర్మాణంగా రూపొందించారు.కేసిఆర్‌ గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లే స్మారక చిహ్నం ఏర్పాటుకు కృషి చేశారు. అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ తో వేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న అమరల స్మారక చిహ్నం తుదిమెరుగులు దిద్దుకుంటోంది.

ఈ రోజు అమరవీరుల స్మారక చిహ్నన్ని పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫినిషింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ పనులు క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించారు. ప్రధాన ద్వారం, ల్యాండ్ స్కేప్ ఏరియా, పార్కింగ్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటైన్ ఏరియా, గ్రానైట్ ఫ్లోరింగ్, ఫోటో గ్యాలరీ, ఆడియో, విజువల్ రూం, లిఫ్ట్ లు, ఎస్కలేటర్, కన్వెన్షన్ సెంటర్, పై అంతస్థులో రెస్టారెంట్, నిరంతరం జ్వలించే జ్వాలలా ఉండే జ్యోతి ఆకృతి ఇలా అన్ని రకాల పనులు పరిశీలించారు మంత్రి. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ ఆదేశానుసారం అధికారులకు,నిర్మాణ సంస్థ కు పలు సూచనలు చేశారు.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా.. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగర నడి బొడ్డున,హుస్సేన్ సాగర్ తీరాన ఈ నిర్మాణం చేపట్టారని, అరుదైన స్టెయిన్ స్టీల్ తో అన్ని రకాల అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో,సకల హంగులతో స్మారకాన్ని నిర్మించామని తెలిపారు.  ప్రపంచంలోనే అరుదైన స్టెయిన్ లెస్ స్టీల్ తో నిర్మించిన అతిపెద్ద కట్టడం ఇదేనని అన్నారు. ఈ నిర్మాణం పూర్తి అయి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచమే  అబ్బురపడి చూస్తుందని చెప్పారు. స్మారక ప్రాంగణానికి ఎవరు వచ్చినా అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకునే విధంగా ఈ నిర్మాణంలో ఏర్పాట్లు ఉండబోతున్నట్లు తెలిపారు.

ఇది పూర్తిగా యావత్ తెలంగాణ ప్రజల హృదయాలను హత్తుకునే కట్టడమని ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేయాలని అధికారులను,వర్క్ ఏజెన్సీని కోరారు. ల్యాండ్ స్కేప్ ఏరియాలో పచ్చదనానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు.ఆహ్లాదకరమైన రంగురంగుల పూల మొక్కలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్మాణ ఫినిషింగ్ పనుల్లో వేగం పెంచాలని, ప్లాన్ చార్ట్ ప్రకారం పనులు పూర్తి చేసి సీఎం కేసీఆర్ నిర్ణయించిన నిర్ణీత గడువులోగా ప్రారంభానికి సిద్దం చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు తగ్గట్టుగా మ్యాన్ పవర్ పెంచాలని సూచించారు.

Published at : 05 May 2023 06:25 PM (IST) Tags: Vemula Prasanth Reddy Telangana KCR TS Martyrs Memorial Telangana Martyrs Memorial

సంబంధిత కథనాలు

Bandi Sanjay on TDP:

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

టాప్ స్టోరీస్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!