News
News
X

Telangana High Court: కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు ఆగ్రహం, మీ నిర్లక్ష్యం వల్లే అని వ్యాఖ్యలు

ఇటీవల హైదరాబాద్ లోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

FOLLOW US: 
Share:

ఇటీవల హైదరాబాద్ లోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇదివరకే ఈ ఘటనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు రావడంతో పరిస్థితిని గ్రహించిన హైకోర్టు కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ పై తండ్రి పనిచేసే చోట వీధి కుక్కలు దారుణంగా దాడి చేయడం అమానుష ఘటన అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కుక్కల దాడిలో పసివాడు మృతిచెందడం అత్యంత బాధాకరమని చెప్పింది. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే జీహెచ్ఎంసీ ఏం చేస్తుందని, మీ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడంటూ హైకోర్టు మండిపడింది. తదుపరి విచారణను హైకోర్టు మార్చి16కి వాయిదా వేసింది.

నగరంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, వీధి కుక్కలు దాడులు పెరిగిపోతుంటే మీరు ఏం చర్యలు తీసుకున్నారని జీహెచ్ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని జీహెచ్ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. బాలుడు ప్రదీప్ మృతికి నష్ట పరిహారం చెల్లించడాన్ని పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. ఈ ఘటనపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ కలెక్టర్, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ, అంబర్ పేట్ మున్సిపల్ అధికారికి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి16కి వాయిదా వేసింది. 

అసలేం జరిగిందంటే..?

నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చాడు. అంబర్ పేట చౌరస్తాలోని ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా పని చేస్తూ భార్యాపిల్లలను పోషిస్తున్నాడు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్ తో కలిసి బాగ్ అంబర్ పేట ఎరుకల బస్తీలో నివాసం ఉంటున్నాడు.

ఆదివారం రోజు సెలవు కావడంతో పిల్లలిద్దరినీ వెంట బెట్టుకొని తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడు ఆడుకుంటూ ఉండగా.. మరో వాచ్ మెన్ తో కలిసి గంగాధర్ వేరే ప్రాంతానికి వెళ్లాడు. కాసేపు అక్కడే ఆడుకున్న ప్రదీప్.. ఆ తర్వాత తన అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలోనే వీధి కుక్కలు వెంటపడ్డాయి. భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు అటూ ఇటూ పరుగులు తీశాడు. ప్రాణాలను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ కాలయముల్లా ఆ వీధి కుక్కలు మాత్రం బాలుడిపైకి వస్తూనే ఉన్నాయి. బాలుడు వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ వదలకుండా ఆ పసివాడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. మూడు కుక్కలు బాలుడిని ఈడ్చుకెళ్తూ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన బాలుడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

కేటీఆర్ ఏమన్నారంటే..
హైదరాబాద్ లో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మృతి చెందిన ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. జరిగిన ఘటన చాలా బాధాకరమన్న కేటీఆర్... జీహెచ్ ఎంసీ అధికారులను తక్షణమే వీటికి పరిష్కార మార్గం ఆలోచించేలా ఆదేశాలు జారీచేశామన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు.

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. "అంబర్ పేటలో ఓ మహిళ రోజూ వీధి కుక్కలకు మాంసం అందిస్తుంది. రెండు రోజులుగా ఆమె కనిపించడం లేదు. సోమవారం నుంచి ఆహారం లేకపోవడంతో ఆకలి తట్టుకోలేక ఆ కుక్కలు నాలుగేళ్ల బాలుడిపై దాడి చేశాయి" అని తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం అని వివరించారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

Published at : 23 Feb 2023 03:44 PM (IST) Tags: Telangana High Court Hyderabad News Dogs Telangana News Boy Died Dogs Attack

సంబంధిత కథనాలు

TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్‌ కుమార్ డిమాండ్

TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్‌ కుమార్ డిమాండ్

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

టాప్ స్టోరీస్

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

Anupama Parameswaran Photos: శారీలో సొగసుల అనుపమ

Anupama Parameswaran Photos: శారీలో సొగసుల అనుపమ