అన్వేషించండి

Telangana News: మాంసాహారంలో తెలంగాణ తర్వాతే ఎవరైనా- ముక్క కోసం ఒక వ్యక్తి ఏడాదికి 60 వేలు ఖర్చు పెడుతున్నాడట!

Telangana News: మాంసాహారం తినే వాళ్లు తెలంగాణలో ఎక్కువగా ఉన్నారని కేంద్రం నిర్వహించి ఓ సర్వేలో తేలింది. తర్వాత స్థానాల్లో పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి.

Telugu News: తెలంగాణలో వేడుక ఏదైనా సరే ముక్క ఉండాల్సిందే. మాంసం వాసన లేనిదే ఇక్కడ ఏ దావత్‌ జరగదు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో బలగం సినిమా వచ్చింది. సూపర్ హిట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోనే రికార్డులు బదల్లుకొట్టింది. మాంసం కేంద్రంగానే ఆ స్టోరీ మొత్తం నడుస్తుంది. 

తెలంగాణలో మటన్ చికెన్ తినడం ట్రెడిషన్‌లో భాగం. దావత్ ఉన్నచోటల్లా మందు, ముక్క ఉండాల్సిందే లేకుంటే వచ్చిన వాళ్లు ఎవరికీ సంతృప్తి  ఉండదు. ఇప్పుడు జాతీయ సర్వేలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. జాతీయ స్థాయిలో ఎక్కువ మాంసాహారం తీసుకుంటున్న వారిలో తెలంగాణ వాసులు టాప్ ప్లేస్‌లో ఉన్నారట. కేంద్రమంత్రిత్వ శాఖ 2022-23 సంవత్సరానికి సంబంధించిన సర్వేను జూన్ 7న విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మాంసాహార వినియోగంపై ప్రజల అభిప్రాయలు తెలుసుకుంది. 

దేశవ్యాప్తంగా కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ సర్వే చేపట్టింది. ఇందులో చాలా ఆసక్తికరమైన వెల్లడయ్యాయి. దేశంలో 70 శాతం మంది మాంసాహారులే. ఇందులో పురుషులు దాదాపు 30 శాతం ఉంటే... స్త్రీలు 17 శాతం మంది ఉన్నారు. ఈ సర్వే ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒకరు కచ్చితంగా మాంసాన్ని తింటారట. 

దేశవ్యాప్తంగా మాంసాన్ని ఎక్కువగా తినే వారి జాబితాలో తెలంగాణ టాప్ ప్లేస్‌లో ఉంది. 99 శాతంతో తెలంగాణ టాప్‌లో ఉంటే తర్వాత స్థానంలో పశ్చిమబెంగాల్ ఉంది. ఏపీ కూడా తక్కవేమీ కాదు ఇక్కడ కూడా 98 శాతం మంది మాంసాహారులే. తెలంగాణకు, పశ్చిమ బెంగాల్‌కు0.2 శాతం మాత్రమే తేడా ఉంది. 

ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇక్కడ మాంసం ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణంగా ఇంటర్‌నేషనల్‌ మార్కెట్‌లో కిలో మటన్ ధర ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఉంటే... ఇక్కడ మాత్రం వెయ్యి రూపాయల వరకు ఉంది. ఇంత రేటు ఉన్నప్పటికీ తెలంగాణలో వారానికి మూడు రోజులు కచ్చితంగా ఏదో విధంగా మాంసాన్ని తింటున్నారు. ఇలా ప్రతి వ్యక్తి సంవత్సరానికి కేవలం మాంసం కోసమే సగటున 60 వేలు ఖర్చు చేస్తున్నాడట. 

జాతీయ సర్వే ప్రకారం తెలంగాణలో 2014-15 మధ్య ఒక వ్యక్తి ఏడాదికి దాదాపు 13 కిలోల మాంసాన్ని తిన్నారు. అదే 2021-22 నాటికి 21కిలోలకు చేరింది. ఇప్పుడు అది 29 కిలోలకు చేరింది. జాతీయ సగటు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. జాతీయ స్థాయిలో సగటున 7 కిలోల మాంసాన్ని ప్రజలు తింటున్నారు. జాతీయ న్యూట్రీషియన్ ఇనిస్టిట్యూషన్ ప్రకారం ఏడాదికి ఒక మనిషి 11 కిలోల మాంసాన్ని తినొచ్చు. 

తెలంగాణలో వినియోగించే మాసంసంలో 8 కిలోలు గొర్రె, మేకల నుంచి వస్తుంటే... మిగిలినది బీఫ్‌, పంది మాంసం కాగా చివరి స్థానం చికెన్‌ది. రాష్ట్రంలో ఉన్న మేకలు, గొర్రెలు సరిపోక వేరే రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. ఒక వేళా అక్కడ నుంచి దిగుమతి ఆలస్యమైతే తెలంగాణ మాంసం ధరలు ఆకాశాన్ని అంటున్నాయని సర్వే తేల్చింది. అందుకే మాంసానికి హబ్‌గా హైదరాబాద్ మారిందని స్పష్టమైంది. వేరా రాష్ట్రాల నుంచి తెప్పించి ఇక్కడ ఉంచుతున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు మాత్రం ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నారు. హైదరాబాద్‌లో మాంసం వినియోగం భారీగా ఉండటంతో రోజుకు 18000పైగా గొర్రెలను కోస్తున్నారు. కేవలం మాంసం కోసం అన్ని జంతువులు కలిసి రోజుకు తెలంగాణ వ్యాప్తంగా యాభై వేల వరకు జంతువులను కోస్తున్నారు. 

కుటుంబ ఆదాయంతో పోల్చుకుంటేమాంసాహారంపై పెట్టే ఖర్చులో కేరళ అగ్రస్థానంలో ఉంది. రూరల్‌లో 23.5 శాతం మంది మాంసాహారంపై ఖర్చు పెడతారు. అర్బన్‌ ప్రజలు 19.8 శాతం ఖర్చు చేస్తున్నారు. ఈ విషయంలో కేరళ తర్వాత అసోం ఉంది. మూడో స్థానంలో ఏపీ ఉంది. ఇక్కడ అర్బన్‌లో 12 శాతం, పట్టణాల్లో 15 శాతం ఖర్చు పెడుతున్నారు. తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది. ఇక్కడ గ్రామాల్లో 16 శాతం, 12 శాతం వెచ్చిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget