Telangana News: రేపు గవర్నమెంట్ ఆఫీస్‌లకు, స్కూళ్లకు సెలవులు - ప్రభుత్వం ఉత్తర్వులు
Telangana Holidays: ఫిబ్రవరి 8న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటింస్తూ జీవో కూడా విడుదల చేసింది.
Holidays in Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌లో ఫిబ్రవరి 8వ తేదీన షబ్-ఎ-మెరాజ్‌కు సెలవు దినంగా ప్రకటించింది. ఇంతకుముందు, ఆప్షన్ హాలిడే గా ఉన్న దీనిని ఇప్పుడు సాధారణ సెలవుగా మార్చింది. షబ్-ఎ-మెరాజ్ ను ముస్లింలు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజున ఈ పర్వానా మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు.
రేపు ప్రభుత్వ సెలవు దినంపై గందరగోళం
కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న షబ్ ఇ మిరాజ్ పండుగ సందర్భంగా సాధారణ సెలవు అని ప్రకటించగా అధికారిక జీవో మాత్రం విడుదల కాలేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు గందరగోళంలో పడ్డారు. "షబ్ -ఎ- మేరాజ్ ను పురస్కరించుకుని ఫిబ్రవరి 8న ఐచ్ఛిక సెలవును సాధారణ సెలవుగా మార్చడానికి అందుకున్న ప్రాతినిథ్యాలపై, రాష్ట్ర "వక్ఫ్ బోర్డు" నేటికీ తన నిర్ణయాన్ని రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖకు తెలుపని కారణంగా, ప్రభుత్వం సెలవును మార్చలేదు. అయితే షబ్ -ఎ- మేరాజ్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణ సెలవుగా మార్చిన ఉత్తర్వులు తెలంగాణలో కొంత మేరకు గందరగోళం కలిగించాయి. కాబట్టి గురువారం నాడు ఐచ్ఛిక సెలవుగానే పరిగణనలోకి తీసుకుని నడుచుకోవాలి" అంటూ అధికారులు తెలుపుతున్నారు.
దీంతో, ఫిబ్రవరి 8న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. అలాగే ఏపీలో ఫిబ్రవరి 8న స్కూళ్లు, కాలేజీలకు, ఆఫీసులకు సెలవు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు.
తెలంగాణలో ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయింతి సందర్భంగా హాలీడే ఉండనుంది. ఏప్రిల్ 9 ఉగాది సెలవు.. ఏప్రిల్ 11,12న రంజాన్ సెలవు ఇచ్చారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవు ఉంటుంది. ఏప్రిల్ 17 శ్రీరామనవమికి కూడా సెలవు ప్రకటించారు.
జూన్ 17 బక్రీద్, జులై 17న మెహర్రం, జులై 29న బోనాల సందర్భంగా సెలవులు ఇచ్చారు. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్ట్ 26 శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెలవులు ఇచ్చారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి హాలీడే ఉంది. సెప్టెంబర్ 16 ఇద్ నబీకి సెలవు, అక్టోబర్ 2న మహత్మ గాంధీ జయంతి సందర్బంగా సెలవు ఉంటుంది. అక్టోబర్ 12, 13 తేదీల్లో దసరా సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 31 దీపావళి సెలవు ఉంది. నవంబర్ 15 గురునానక్ జయంతి సందర్భంగా సెలవు ఉంది. డిసెంబర్ 25 క్రిస్మస్ సెలవు ఉంది.