అన్వేషించండి

తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రయోగం- 12 చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్‌

ఈ సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ వల్ల ప్రభుత్వాసుపత్రులు బలోపేతం అవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరికీ సకాలంలో వైద్యం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, మెరుగైన ఔషధాలు అందేలా రాష్ట్రవ్యాప్తంగా సెంట్రల్‌ మెడిసిన స్టోర్స్‌ ఏర్పాటు చేయనున్నారు. 

తెలంగాణ ప్రభుత్వంలో ఆసుపత్రులు, వైద్య సేవలను మెరుగు పరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటుకు నిర్ణయించింది. 12 చోట్ల ఈ సీఎంఎస్‌లను ఏర్పాటు చేయనుంది. ఒక్కొక్క స్టోర్‌పై 3.60 కోట్లు ఖర్చు పెట్టనుంది. అంటే రాష్ట్రవ్యాప్తంగా 43.20 కోట్లు ఖర్చు చేయనుంది. 

ఈ సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ వల్ల ప్రభుత్వాసుపత్రులు బలోపేతం అవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరికీ సకాలంలో వైద్యం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో 12 చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు కూడా వైద్యారోగ్యశాఖ జారీ చేసింది. 

ఈ స్టోర్స్‌లో ప‌ని చేసేందుకు అవ‌స‌ర‌మైన సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ స్టోర్స్ ప‌రిధిలోని అన్ని ఆస్పత్రుల‌కు కూడా స‌కాలంలో మెడిసిన్స్‌ను చేర‌వేసే అవ‌కాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. 

సెంట్రల్‌ మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటు చేసే ప్రాంతాలు ఇవే. 
1. సిద్దిపేట‌(టీచింగ్ హాస్పిట‌ల్)
2. వ‌న‌ప‌ర్తి (జిల్లా ఆసుపత్రి)
3. మ‌హ‌బూబాబాద్ (జిల్లా ఆసుపత్రి)
4. జ‌గిత్యాల (జిల్లా ఆసుపత్రి)
5. మంచిర్యాల (జిల్లా ఆసుపత్రి)
6. భూపాల‌ప‌ల్లి (జిల్లా ఆసుపత్రి)
7. కొత్త‌గూడెం (జిల్లా ఆసుపత్రి)
8. నాగ‌ర్‌క‌ర్నూల్ (జిల్లా ఆసుపత్రి)
9. సూర్యాపేట (జిల్లా ఆసుపత్రి)
10. భువ‌న‌గిరి (జిల్లా ఆసుపత్రి)
11. వికారాబాద్ (ఏరియా హాస్పిట‌ల్)
12. గద్వాల (జిల్లా ఆసుపత్రి)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desamడేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్అర్జున్ టెండూల్కర్‌ని కొనుక్కున్న ముంబయి ఇండియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
Fake PM Kisan Yojana App: ఈ యాప్ డౌన్‌లోడ్ చేశారంటే - మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయినట్లే!
ఈ యాప్ డౌన్‌లోడ్ చేశారంటే - మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయినట్లే!
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
JEE Main Correction Window: జేఈఈ మెయిన్‌ దరఖాస్తుల సవరణ ప్రారంభం, తప్పులుంటే సరిచేసుకోండి
జేఈఈ మెయిన్‌ దరఖాస్తుల సవరణ ప్రారంభం, తప్పులుంటే సరిచేసుకోండి
Gautam Adani: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న అదానీ వ్యవహారం, అసలేం జరిగింది - ఎవరి వర్షన్ ఎలా ఉందంటే!
తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న అదానీ వ్యవహారం, అసలేం జరిగింది - ఎవరి వర్షన్ ఎలా ఉందంటే!
Embed widget