
Hyderabad Budwel Lands: బద్వేల్ భూముల అమ్మకానికి నోటిఫికేషన్ జారీ - ఎకరాకు కనీస ధర రూ.20 కోట్లు
Hyderabad Budwel Lands: కోకాపేట భూముల వేలం రికార్డు స్థాయిలో పలకడంతో.. బుద్వేల్ భూముల అమ్మకానికి కూడా తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

Hyderabad Budwel Lands: హైదరాబాద్ లోని కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధరలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అదే తరహాలో నగరంలోని బుద్వేల్ భూముల అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ లో బహుళ ప్రయోజన నిర్మాణాలకు అనుగుణంగా.. మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన వంద ఎకరాల స్థలాన్ని హెచ్ఎండీఏ ద్వారా విక్రయించబోతున్నారు. బుద్వేల్ లో మొత్తం 14 ప్లాట్లను అమ్మకానికి ఉంచారు. ఒక్కో ప్లాటు విస్త్రీర్ణం 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాల వరకు ఉంది. ఎకరాకు రూ.20 కోట్ల కనీస ధరను నిర్ణయించారు. ఆరో తేదీన ప్రీబిడ్ సమావేశం, 7వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 10వ తేదీన ఈ వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. బుద్వేల్ భూములు ఎకరాకు సగటున రూ.30 కోట్ల ధరకు అమ్ముడుపోయినా కనీసం రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.
నియోపోలిస్ ఫేజ్-2 భూముల రికార్డు వేలం.. ఎకరం రూ.72 కోట్లు
హైదరాబాద్ శివారులోని కోకాపేటని యోపాలిస్ భూముల వేలం సర్కార్ కు కాసుల వర్షం కురిపిస్తోంది. గతేడాది కంటే ఈ సారి వేలంలోరికార్డు స్థాయి ధరకు ప్లాట్లు అమ్ముడుపోయాయి. అత్యధికంగా ఎకరం 72 కోట్లు పలకగా... అతి తక్కువగా 51.75 కోట్లు అమ్ముడుపోయింది. మొత్తంగా నాలు ప్లాట్లకు రూ. 1532.5 కోట్లు పలికింది. కోకాపేటలో ఉన్న 45.33 ఎకరాల్లో ఉన్న 7 ప్లాట్లకు హెచ్ఎండీ వేలం నిర్వహించింది. ఇంకా మూడు ప్లాట్లను వేలం వేయనుంది. ఈ వేలం ద్వారా దాదాపు రూ. 2500 కోట్లు రాబట్టాలని అధికారులు అంచనా వేస్తున్నారు. 2021లో ఇదే ఏరియాలో వేలం నిర్వహించగా కనిష్టంగా ఎకరా రూ. 31 కోట్లు ,గరిష్టంగా రూ. 60 కోట్లు పలికింది.
మొత్తంగా ఈ విడతలో కోకాపేటలోని 45 ఎకరాలను అమ్మకానికి ఏర్పాట్లు చేసింది. రెండు సెషన్ లుగా భూములు వేలం జరుగుతోంది. సర్కార్ ఎకరాకు 35 కోట్లుగా ధర నిర్ధారించింది కోకాపేటలో అభివృద్ధి చేసిన లే అవుట్ కోసం హెచ్‌ఎండీఏ సుమారు రూ. 300 కోట్ల రూపాయలను వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నది. సుమారు 41 ఎకరాలను రకరకాల వసతుల కోసమే కేటాయించారు. లేఅవుట్‌లోని రోడ్లన్నీ 45 మీటర్ల వెడల్పుతో 8 లేన్ల రహదారి, 36 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు.
ఈ 45.33 ఎకరాల భూమి అమ్మకంతో భారీగా ఆదాయం రానుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధిచేసిన కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌లో ప్లాట్లు కొంత కాలంగా వేలం వస్తున్నారు. 2021లో మొదటి ఆన్‌లైన్ వేలం నిర్వహించారు. మొత్తం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను వేలం వేశారు. అప్పట్లో ఎకరం కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించగా, బిడ్డర్లు పోటీ పడి మరీ స్థలాలను దక్కించుకున్నారు. ఇందులో ఎకరానికి కనిష్ఠంగా రూ.31.2 కోట్లు పలకగా, గరిష్ఠ ధర రూ.60.2 కోట్లు పలికింది. మొత్తం వేలం ప్రక్రియలో సరాసరిగా ఎకరం రూ.40.05 కోట్లు పలికింది. 2/పీ వెస్ట్ పార్ట్ గల ప్లాట్‌ను రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థ ఎకరానికి రూ.60.20 కోట్ల చొప్పున 1.65 ఎకరాలను రూ.99.33 కోట్లకు సొంతంచేసుకున్నది. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.2000.37 కోట్ల ఆదాయం సమకూరింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

