By: ABP Desam | Updated at : 22 Aug 2023 11:58 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
యాసంగిలో సేకరించిన ధాన్యం అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచింది. ఆసక్తి ఉన్న సంస్థలు ఇవాళ్టి(22 వ తేదీ) నుంచి 15 రోజుల పాటు టెండర్లు దాఖలు చేయవచ్చు. సెప్టెంబర్ ఐదోవ తేదీ మూడు గంటలకు టెండర్లను తెరవనున్నారు.
యాసంగిలో సేకరించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ టెండర్ విధానాన్ని అనుసరిస్తోంది. ఇలాంటి విధానంలో ధాన్యాన్ని అమ్మబోతున్నామని అసెంబ్లీలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. తర్వాత పౌరసరఫరాల శాఖ, ఆర్థిక అనుమతితో ఫైల్ సిద్ధం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సంతకం చేశారు.
ముందుగా 25 లక్షల టన్నుల ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఈ గ్లోబల్ టెండర్లను పిలుస్తున్నారు. దీనికి సంబంధించిన వేలం ప్రక్రియ నోటిఫికేషన్‌ను పౌరసరఫరాల సంస్థ జారీ చేసింది. 15 రోజుల పాటు జరిగే టెండర్ల ప్రక్రియలో రైస్ మిల్లర్లతోపాటు ఎవరైనా పాల్గొనే ఛాన్స్ ఇచ్చారు. దీనిపై త్వరలోనే ప్రీబిడ్ సమావేశం కూడా నిర్వహించనున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 22 వేల కోట్ల విలువైన ధాన్యం ఉన్నాయి. వీటిని ఖాళీ చేస్తే కానీ వచ్చే భవిష్యత్‌లో రాబోయే పంటను కొనే పరిస్థితి లేదు. అందుకే ఈ విధానంలో అమ్మకాలు చేపట్టబోతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం నిరాకరించిందని అందుకే గ్లోబల్ టెండర్లు పిలుస్తున్నట్టు పేర్కొన్నారు. దీనికి వచ్చే స్పందన బట్టి విడతల వారీగా మిగిలిన ధాన్యాన్ని కూడా ఇదే విధానంలో అమ్మకాలు చేయబోతున్నట్టు తెలిపారు.
దేశంలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ఈ గ్లోబల్ టెండర్ విధానం అమల్లో ఉంది. అక్కడ మూడేళ్ల నుంచి ఈ విధానంలో అమ్మకాలు చేపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో తొలిసారిగా అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇది విజయవంతమైతే
PGECET Seats: పీజీఈసెట్ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు
తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్
Bandi sanjay on BRS: ప్రధాని టూర్‌తో ప్రగతిభవన్‌లో ప్రకంపనలు- బీఆర్ఎస్లో చీలిక ఖాయమన్న బండి సంజయ్
Mega Dairy Project: పాడి రంగంలో మెగా ప్రాజెక్టు, రేపు కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
Inter Admissions: ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!
Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్ సర్వీసులు - ఈ నగరాల నుంచే
AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా
Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్
/body>