అన్వేషించండి

G20 Meetings: హైదరాబాద్‌లో జీ20 సమావేశాలు, నగరంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ ఏర్పాటుకు డీజీపీ ఆదేశాలు

హైదరాబాద్‌ లో ప్రతిష్టాత్మక జీ-20 వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో భద్రతపై కార్యాలయంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ అధ్యక్షతన జీ-20 సెక్యూరిటీ సమన్వయ సమావేశం జరిగింది.

Telangana DGP Anjani Kumar: హైదరాబాద్‌ లో ఈ నెల 28 నుంచి జూన్‌ 17 మధ్య అత్యంత ప్రతిష్టాత్మక జీ-20 వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలు ( G20 meetings in Hyderabad) జరుగనున్నాయి. ఈ క్రమంలో భద్రతపై కార్యాలయంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ అధ్యక్షతన జీ-20 సెక్యూరిటీ సమన్వయ సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారులతోపాటు, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా, రీజినల్ పాస్‌పోర్ట్‌ ఆఫీస్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌జీ తదితర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రపంచంలోని 85 శాతం జీడీపీ, 75శాతం గ్లోబల్ వాణిజ్యాన్ని శాసించే 29 దేశాలు సభ్యులుగా ఉన్న అత్యంత ప్రతిష్టాత్మక జీ-20 దేశాల అధినేతల అత్యున్నత సమావేశం ప్రధాని నేతృత్వంలో సెప్టెంబర్‌లో జరుగనుందని తెలిపారు.
హైదరాబాద్‌లో ఆరు సమావేశాలు
ఈ అత్యున్నత సమావేశానికి ముందస్తుగా దేశంలోని 56 నగరాల్లో 215 వర్కింగ్ గ్రూప్‌ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఆరు సమావేశాలు జరగనున్నాయని వెల్లడించారు. జనవరి 28న తొలి సమావేశం జరగనుండగా, మార్చి 6,7, ఏప్రిల్ 26, 27, 28, జూన్ 7, 8, 9, జూన్ 15, 16 ,17న వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాలకు మంత్రులు, కార్యదర్శులు, జాయింట్ సెక్రెటరీ స్థాయి అధికారులు, నుంచి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
భద్రతా విభాగాల మధ్య సమన్వయం అవసరం
ఈ సమావేశాలు సజావుగా, ఎలాంటి భద్రతాపరమైన అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు భద్రతా విభాగాల మధ్య సమన్వయం అవసరమని అంజనీకుమార్‌ అన్నారు. ఈ సమావేశాలకు హాజరయ్యే ఉన్నతస్థాయి ప్రతినిధులు నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో విస్తృత భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో సమర్థవంతమైన సమన్వయం కోసం అంతర్గత వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని సూచించారు. ఈ సమావేశాలకు హాజరయ్యే ప్రతీ ఒక్కరి యాంటిడేన్స్‌లను పక్కాగా పరిశీలించాలని కోరారు.
నగరంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌
ప్రధానంగా ఎయిర్‌పోర్ట్‌, ప్రతినిధులు బస చేసే హోటళ్లు, సమావేశాలు జరిగే ప్రాంతాల్లో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. ఎయిర్‌పోర్ట్‌తో పాటు నగరంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ డీజీలు అభిలాష బిస్త్, సంజయ్ కుమార్ జైన్, స్వాతి లక్రా, విజయ కుమార్, నాగిరెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు, హోం మంత్రిత్వ శాఖ ఎస్‌ఐబీ డీడీ సంబల్ దేవ్, రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌ జీఎస్‌ఓ భారత్ కందార్, డిప్యూటీ పాస్ పోర్ట్ ఆఫీసర్ ఇందు భూషణ్ లెంక, ఎన్డీఆర్‌ఎఫ్‌ దామోదర్ సింగ్, సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన సింగన రామ్, ఎన్ఎస్‌జీ కల్నల్ అలోక్ బిస్త్, జీఏడీ ప్రోటోకాల్ అధికారి కే తదితర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget