అన్వేషించండి

KCR Review : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నేడు కేసీఆర్‌ సమీక్ష-నెలాఖరులోగా ప్రాజెక్టు ప్రారంభించే అవకాశం

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఫోకస్‌ పెట్టారు సీఎం కేసీఆర్‌. ఇవాళ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఈనెలాఖరులోగా ముహూర్తం ఫిక్స్‌ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.

పాలమూరు-రంగారెడ్డి... భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు. వలసల జిల్లాగా పేరుపొందిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాకు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు  అందించాలనే లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు పనులపై ఇవాళ సీఎం కేసీఆర్‌ ఫోకస్‌ పెట్టారు. ప్రాజెక్టు  నిర్మాణ పనులపై ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాలకు అడ్డంకిగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి నిర్మాణ  పనులు గడువులోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టనున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో ఇవాళ సీఎం కేసీఆర్‌ అధ్యక్షత జరగనున్న ఉన్నతస్థాయి  సమీక్షా సమావేశంలో... ప్రాజెక్టు పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ, ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు, సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు కూడా  హాజరుకానున్నారు. 

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో కీలకమైన నార్లాపూర్ పంప్ హౌస్‌లో డ్రైరన్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేశారు ఇరిగేషన్‌ అధికారులు. దీంతో..  ఈనెలాఖరులోగా ఆ ప్రాజెక్టును ప్రారంభించొచ్చని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఈ సమీక్షా సమావేశంలోనే ముహూర్తం కూడా ఖరారు చేసే  అవకాశాలున్నాయని ఇరిగేషన్‌ అధికారుల నుంచి సమాచారం అందుతోంది. 

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నారాయణపేట్, వికారాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు,  ఎమ్మెల్యేలను కూడా సీఎం కేసీఆర్‌ నిర్వహిస్తున్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ ఆరు జిల్లాల్లోని 70 మండలాల్లో కరువు పరిస్థితులను  పారద్రోలడానికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేతో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఐదేళ్లపాటు జాప్యం  జరిగింది. ఇటీవలే స్టే ఎత్తేయడంతో.. ప్రాజెక్టు నిర్మాణాలకు అనుమతులు దొరికాయి. దీంతో ఇంజనీర్లు, కాంట్రాక్టు ఏజన్సీలు పగలు రాత్రి అనే తేడా లేకుండా నిర్మణ పనుల్లో  నిమగ్నమై ఉన్నారు. 

ఎన్నికలలోపే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈనెల 15 లేదా 17వ తేదీల్లో ప్రారంభోత్సవం ఉండొచ్చని కూడా సమాచారం.  కరివెన జలాశయం వరకు నీటిని తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై సీఎం కేసీఆర్ ఇవాళ సమీక్షించనున్నారు.  అక్కడక్కడా పూర్తి చేయాల్సిన పనులు, క్షేత్రస్థాయి ఇబ్బందులపై ముఖ్యమంత్రి ఫోకస్‌ పెడుతున్నారు. కాల్వల నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభం కాగా..  ఆయా అంశాలపై కూడా సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నారు సీఎం కేసీఆర్‌.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indian Migrants: డంకీ రూట్‌లో అమెరికాకు వెళ్తూ మార్గం మధ్యలో గుండెపోటుతో పంజాబీ యువకుడు మృతి
డంకీ రూట్‌లో అమెరికాకు వెళ్తూ మార్గం మధ్యలో గుండెపోటుతో పంజాబీ యువకుడు మృతి
RC 16 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... రామ్ చరణ్ బర్త్ డేకి అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తున్న మేకర్స్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... రామ్ చరణ్ బర్త్ డేకి అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తున్న మేకర్స్
Indiramma Housing Scheme Rules: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు
YS Jagan Security: మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు - మ్యాటర్ ఏంటంటే
మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు - మ్యాటర్ ఏంటంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Madhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP DesamBaduguvani Lanka Nurseries | గోదావరి తీరంలో ఈ ఊరి పూలతోటల అందాలు చూశారా | ABP DesamElon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP DesamKiran Royal Janasena Issue | వివాదంలో చిక్కుకున్న తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Migrants: డంకీ రూట్‌లో అమెరికాకు వెళ్తూ మార్గం మధ్యలో గుండెపోటుతో పంజాబీ యువకుడు మృతి
డంకీ రూట్‌లో అమెరికాకు వెళ్తూ మార్గం మధ్యలో గుండెపోటుతో పంజాబీ యువకుడు మృతి
RC 16 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... రామ్ చరణ్ బర్త్ డేకి అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తున్న మేకర్స్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... రామ్ చరణ్ బర్త్ డేకి అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తున్న మేకర్స్
Indiramma Housing Scheme Rules: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు
YS Jagan Security: మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు - మ్యాటర్ ఏంటంటే
మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు - మ్యాటర్ ఏంటంటే
Thandel Piracy: 'తండేల్' డౌన్ లోడ్ చేసి చూస్తున్నారా? - అయితే.. జర జాగ్రత్త, అలాంటి వారికి నిర్మాత బన్నీ వాసు స్ట్రాంగ్ వార్నింగ్
'తండేల్' డౌన్ లోడ్ చేసి చూస్తున్నారా? - అయితే.. జర జాగ్రత్త, అలాంటి వారికి నిర్మాత బన్నీ వాసు స్ట్రాంగ్ వార్నింగ్
Income Tax SMS: ఆదాయ పన్ను విభాగం పంపిన SMSతో కన్‌ఫ్యూజ్‌ అయ్యారా? - అది యాక్షన్‌ కాదు, అలెర్ట్‌
ఆదాయ పన్ను విభాగం పంపిన SMSతో కన్‌ఫ్యూజ్‌ అయ్యారా? - అది యాక్షన్‌ కాదు, అలెర్ట్‌
Megastar Chiranjeevi: ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
Telugu TV Movies Today: నాగార్జున ‘నిర్ణయం’, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ to రవితేజ ‘ఇడియట్’, రామ్ ‘ది వారియర్’ వరకు - ఈ సోమవారం (ఫిబ్రవరి 10) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
నాగార్జున ‘నిర్ణయం’, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ to రవితేజ ‘ఇడియట్’, రామ్ ‘ది వారియర్’ వరకు - ఈ సోమవారం (ఫిబ్రవరి 10) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Embed widget